దృష్టి తగిలింది అని దిష్టి తీసిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయి రామ్ .

బాబాను ఒక్కసారి నమ్మి దరిచేరితే చాలు ఇక మన బాగోగులు అన్నీ ఆయనవే, బాబా చూపించే ప్రేమ గురించి చెప్పడానికి ఇలా రాయడం తప్ప ,  నిజానికి బాబా గురించి చెప్పే అంత బాషా జ్ఞానం కూడా  లేదు.

ఏ విధంగా చెప్పినా తక్కువే. అప్పుడు నాకు రెండవసారి ఏడవనెల సమయం లో జరిగిన సంగటన . మొదటిసారి నాకు బాబు కనుక రెండవసారి పాప కావలి అనేది నా కోరిక.

తాత ఉన్నారులే తీరుస్తారులే అని గట్టిగా మనసులో ఉండేది.కాని తాత దగ్గరకు వెళ్ళిన ప్రతీ సారి నాకు అడగాలి అని అనిపించేదికాదు. అసలు చెప్పలేను,

తాత నాకు ఏది మంచిదో అదే చెయ్యి అని చెప్పేదాన్ని. తాత మాత్రం నన్ను కనీసం అడగకుండా చేసారు. ఒకసారి నీకు మళ్ళీ పుత్రుడే అని చెప్పారు. అయినా సరే, ఇంకా ఆశ ఉండి ఏడవ నెల అయి కూడా షిర్డీ వెళ్లాను.

తాత మీరే ఎదో ఒకటి చెయ్యాలి అని ,తాత తో మొరపెట్టుకొని ఒక చోట చాలా దిగులుగా కూర్చొని ఉన్నా.

అప్పుడు నాకు ఎదురుగా కొద్దిదూరం నుండి ఒక పండు ముసలి చాలా తెల్లగా ఉన్నారు,మరియు కాషాయం బట్టలు వేసుకొని నెమ్మదిగా చాలా నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి ఆయన చేతిలో ఏమి ఉందొ నాకు తెలియలేదు, నాకు దిష్టి తీసారు.

నేను మాత్రం చలనం లేకుండా అలానే కూర్చున్నా. ఇతను ఎవరో తెలియదు పెద్ద వయసు కదా దిష్టి తీసారు అని ఒక పది రూపాయలు ఇద్దామని బాగ్ లోంచి తీసి తల పైకి ఎత్తేసరికి అతను లేరు.

సరిగా నడవలేని ఆతను ఇంత త్వరగా ఎటూ వెళ్ళలేరు. కాని ఆ రూపం నేను ఇప్పటికి మరువలేను. (2012 లో జరిగిన సంగటన ) కాని అప్పటి మైకం కొన్ని నెలల తరువాత వదిలింది.

స్వయంగా అయన వచ్చి ఇలా చేసారు అంటే నేను ప్రమాదంలో ఉనాను అని నాకు అర్ధం అయ్యింది.

కానీ నన్ను కాపాడు అని నా నోటి నుంచి రావడం లేదు . ఎందుకో  మరి ! షిర్డీ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఎనిమిదవ నెల వచ్చింది.

అప్పుడే నొప్పులు మొదలు ,హాస్పిటల్ వెళితే ఇప్పుడు పుడితే బతకరూ అని నొప్పులు రాకుండా ఇంజక్షేన్స్ వేసి మూడు రోజుల తరువాత ఇంటికి పంపించారు.

చివరకు తొమ్మిదో నెల వచ్చింది. మరలా సేమే ఒక రోజు మొత్తం నన ఇబ్బందులు పది ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. మొదటి సారి తాత దగ్గర ఉంది పురుడు పోసారు,

మరి ఈసారి ఏంటి తాత అంటే నేను నిన్ను చూస్తున్న కానీ నీదగ్గరకు రాలేను అంటారు.ఇది ఏమి నీవే ఇలా అంటే నాకు దిక్కు ఎవరూ లేరు.

నేను ఆశలు వదులుకున్నా డాక్టర్ తల్లి కాని,బిడ్డ కానీ ఇవ్వగలము అన్నారు. అంత కష్ట పరిస్థితిలో నాకు మరలా బాబు. పుట్టిన వెంటనే బాబు కి బాలేదు అని బాక్స్ లో పెట్టారు.

నాకు ఆపరేషన్ , ఒక వారానికి నాలో కదలిక వచ్చింది. అదే తాత ఆ విధంగా దిష్టి తీయక పొతే ఇక ఏమై ఉండేదో అని, బాబు కదా  సరే తాత ప్రసాదం అని అన్నీ నాకు నేను నచ్చచేప్పుకున్న.

బాబా ఏమి చేసినా అది మనమంచికే అని నాకు తరువాత అర్ధం అయ్యింది. కాని తాత నాకు ఎదో ప్రమాదం జరగా బోతుంది అని నన్ను ముందుగానే దిష్టి అనే ఒక వలయంలో నన్ను జాగ్రత్తగా దాచారు.

ఇలా కంటికి రెప్పలా కాపాడే తండ్రి ప్రేమను ఎలా , ఏవిధంగా వర్ణించను. కానీ ఇప్పుడు మాత్రం నాకు పాప ని ఇవ్వనందుకు రోజు కృతజ్ఞత చెప్తాను.

ఎందుకూ అంటే నా పరిస్తితి అది. బాబాకి ఎప్పుడు ఎవరికీ ఏమి ఇవ్వాలో బాబాకే తెలుసు.

మనము బాబాని కోరవలసింది మంచిదే కాని, ప్రీతీ కరమైనది కాదు. ఎప్పుడూ తాత ప్రేమ కోరుకుంటున్న మనవరాలు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles