Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
అధ్యాయం – 38 17,18 ఓవీలలో బాబా చెప్పిన మాటలు ఒక్కసారి చదవండి.. “సమయా సమయాలలో అతిథులు వచ్చినపుడు వారిని అన్నదానంతో సుఖపెట్టడం గృహస్థుల ధర్మం………….”
బాబా మీయింటికి కూడా వచ్చి ఉండవచ్చు
ఈ బాబా లీల శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు తమ బ్లాగ్ లో పోస్ట్ చేసినది. దాని యొక్క అనువాదం ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను.
మనకు సాధారణంగా ఒక అలవాటు ఉంది. అపరహ్ణంవేళ ఎవరు వచ్చినా భిక్ష వెయ్యకూడదు అని. ఒకవేళ అపరాహ్ణం వేళ బాబా గారు భిక్షకుని రూపంలో వచ్చి ఉండవచ్చు
మన అందరికీ కూడా బాబా గారి దర్శనం కావాలనే కోరిక ఉంటుంది. మన సద్గురు సాయినాథుని అనుగ్రహం కోసం మనం ఎన్నోవిధాలయిన పూజలు వ్రతాలు అన్నీకూడా మనకు తెలిసినంతలో చక్కగా చేస్తాము. కాని బాబాగారు మన ఇంటికి ఏదోరూపంలో వచ్చారనే సంగతి మనం గ్రహించలేము. భిక్షకుని రూపం కావచ్చు, సాధువు రూపంలో కావచ్చు, శునకం లేక పక్షి రూపంలోనైనా వచ్చిఉండవచ్చు. కాని మనం మానవమాత్రులంకదా, అందుచేత గుర్తించలేము.
నేను కొంతమందిని గమనించాను. వారు ఏమంటారంటే, బాబాగారు నాకు దర్శనం ఇవ్వలేదు, నా ప్రార్థనలకి జవాబు ఇవ్వలేదు, బాబాగారు నామీద కోపగించారా? ఇటువంటి నిందలకు అంతుండదు. కాని మనం ఆత్మవిమర్శ చేసుకోవడం మర్చిపోతాము. నా మనసులో ఉన్న ఇదే విషయం మీద ఒక భక్తురాలియొక్క అనుభవాన్ని మీకు చెపుతాను.
ఇది చాలా, హృదయానికి హత్తుకునే నిజంగా జరిగిన సంఘటన.
2011 ఆగస్టులో ఢిల్లీ నుంచి మా కజిన్ వచ్చాడు. ఆ మరునాడు మేము ఉంటున్న సిటీలోనే తన స్నేహితుడిని కలవాలనుకున్నాడు. తన స్నేహితుడి ఇంటికి నన్నుకూడా తోడుగా రమ్మనమని అడిగాడు. నాకు ఇష్టం లేకపోయినా తన కోరికని కాదనలేకపోయాను.
అతనింటికి వెళ్ళగానే నాకు ఆ ఇంటిలో ఒక విధమయిన నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపించింది. ఆ నెగటివ్ ఫోర్స్ వల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. 5 నిమిషాల తరువాత అతని తల్లి 70 సం.వయస్సు ఉన్న విధవావిడ వచ్చింది. వారింటికి వెళ్ళడం నాకు ఇదే మొదటిసారి కాబట్టి మాటలాడటనికి ఏమీలేక ఊరికే కూర్చున్నాను.
హఠాత్తుగా ఆమె మా అమ్మాయి పేరు ఆడిగింది. మా అమ్మాయి పేరు “సాయినా” అని చెప్పాను. మరలా ఆమె ప్రశ్నించక ముందే, నేను సాయి భక్తురాలిని అందుచేత ముందర సాయి అని వచ్చేటట్లు పేరు పెట్టానని చేప్పాను. బాబా వలననే మా అమ్మాయి రక్షింపబడింది అని చెప్పాను.
నేను మాట్లాడుతున్నానే గాని ఏదో తెలియని శక్తి నన్ను బయటికి ఆ ఇంటిలోనించి వెళ్ళిపొమ్మని చెపుతున్నట్లుగా అనిపించింది. కాని అక్కడే కూర్చుని మా కజిన్, అతని స్నేహితుల సంభాషణలను వింటూ కూర్చున్నాను. అతని తల్లి నావైపే దీక్షగా చూడడం గమనించాను. నేను ఆ ఇంటిలో నాలుగువైపులా పరికించి చూడడం మొదలుపెట్టాను.
హఠాత్తుగా నా దృష్టి ఫ్రిజ్ మీద అంటించిన బాబా స్టిక్కర్ మీద పడింది. నాకు బాగుందనిపించింది. మా కజిన్ స్నేహితుడిని మీరు బాబా భక్తులా అని అడిగాను. నా ప్రశ్న వినగానే అతని తల్లి తాము ఎంతటి దురదృష్టవంతులో చెప్పింది. బాబా గారు తమ ఇంటికి వచ్చినా గుర్తించలేకపోయాము. అప్పటినుంచి చాలా కష్టాలు పడుతున్నామని చెప్పింది.
ఇది వినగానే ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది. జరిగినదంతా చెప్పమని ఆంటీని అడిగాను. 6 నెలల క్రితం ఒక ఫకీర్ మధ్యాహ్నం ఒంటిగంటవేళ వచ్చి ఏమైనా ఆహారం పెట్టమని అడిగాడు. గడచిన 2 -3 రోజులనుంచీ ఏమీ తిండి తినలేదని చెప్పాడు. ఆమె అతను చెప్పినదేమీ పట్టించుకోకుండా నిర్దయగా వెళ్ళిపొమ్మని చెప్పింది.
కాని ఆ ఫకీరు భిక్ష అడుగుతూ అక్కడే నుంచున్నాడు. ఆ ఫకీరు, వెళ్ళిపొయేటప్పుడు, ఇంక యెవరింటికీ కూడా భిక్షకు వెళ్ళకపోవడం ఆమె గమనించింది. ఆరోజు నుంచి వారికి ప్రతీరోజు కష్టాలు మొదలయ్యాయి. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి.
ఒకరోజున ఒక ముసలి ఫకీరు వచ్చి ఆంటీతో, బాబా గారు మీ ఇంటికి, మీ బాధలు, కర్మలూ అన్నీ పోగొట్టటానికి వచ్చారు అని బాబా గారు వచ్చిన నెల, తేదీ, సమయం అన్నీ చెప్పారు. కాని మీరు చాలా దురదృష్టవంతులు, ఆయనని గుర్తించలేదు అని చెప్పాడు. ఆంటీ మరోమాట మాట్లాడక ముందే ఆ ఫకీరు మాయమయ్యాడు.
ఆంటీ దిగ్ర్భాంతికి లోనైందట. ఇక వేరేదారి లేక ఆమె బాబాని క్షమించమని ప్రార్థించి, మరలా తిరిగిరమ్మని వేడుకుంది.
ఇదంతా చెప్పి ఆంటీ చిన్నపిల్లలా ఏడవడం మొదలుపెట్టింది. నేను ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించాను. కాని లాభం లేకపోయింది. ఆఖరిగా ఆమెకు ఊదీ పాకెట్ ఇచ్చి బీద వారికి అన్నదానం చేయమని చెప్పాను.
ఓర్పు, సహనంతో ఉండండి, బాబాగారు మరలా వస్తారు అని ఓదార్చాను. కాని ఆమె కన్నీటిని ఆపడం నాకు సాధ్యం కాలేదు. వాళ్ళబ్బాయికి నా బాబా బ్లాగ్ గురించి తెలుసు కనుక, భిక్షకు ఎవరు వచ్చినా లేదు పొమ్మని కసిరి కొట్టకుండా ఈ విషయమంతా బ్లాగ్ లో పోస్ట్ చెయ్యమని చెప్పాడు. అతని తల్లి ఇప్పటికీ ఆ ఫకీరు మరలా వస్తాడని బయట కుర్చీ వేసుకుని ఎదురుచూస్తూ ఉందిట.
అందుచేత మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే కసిరి కొట్టవద్దు. ఇవ్వడం ఇస్టం లేకపోతే మర్యాదగా వెళ్ళిపొమ్మని చెప్పండి. బాబా గారు ఏ రూపంలోనయినా రావచ్చు. బాబా గారు చెప్పినదిదే.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘సీతక్క’ నీ ఇంట బాబా వచ్చి పొంగలి తిన్నారు
- బాబా, నీవు తలచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలవు—Audio
- బాబా వచ్చి అక్షింతలు చల్లి త్రిశూలం ని గీయమని చెపుతాడు.
- పవిత్రమైన బాబా ఊదీ – నయం కానివాటిని కూడా నివారిస్తుంది (1983)
- ఇలా వచ్చి దక్షిణ స్వీకరించి, ఆశీర్వదించారు, బాబా కాక ఇంకెవరు బాబానే.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments