Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా, కపర్డే, బాపుసాహెబ్ జోగ్, దాదా కేల్కర్ మొదలైన వారితో కలిసి ఒక జన్మలో ఒకే గురువును సేవించామని తెలిపారు.
తపస్వీ మహారాజ్ 197 ఏండ్లు జీవించి 1951లో శివబాలయోగిని దర్శించి, వీరు (శివబాలయోగి) తాను సేవించిన శ్రీచంద్రుడేనని తెలిపారు.
శ్రీచంద్రుడు సిక్కు మత స్థాపకుడైన గురునానక్ కుమారుడని, ఐతే నానక్ తన తరువాత గద్దెను తన కుమారుడైన శ్రీచంద్రునకు కాకుండా, లెహనాకు ఇచ్చారని తెలిపారు.
శ్రీచంద్రుడు ఉదాసీ సాంప్రదాయ స్థాపకుడని, తాను (తపస్వీ మహారాజు) శ్రీచంద్రుని శిష్యుడనని చెప్పారు.
శ్రీచంద్రుడు మరణానంతరము శివబాలయోగిగా జన్మించారని, తాను తన గురువును గుర్తించానని చెప్పేవాడు.
శివబాలయోగి 24, జనవరి 1935లో జన్మించారు.
ఒక ఆజానుబాహుడు మేడలో వ్రేలాడే రుద్రాక్షమాలతో ప్రత్యక్షమై, పద్మాసనంలో అతనిని కూర్చుండబెట్టి కండ్లు మూసుకొమ్మని, మధ్య వ్రేలితో భ్రుకుటిని తాకి, శిరస్సుపై చేతితో నెమ్మదిగా తట్టినాడు.
బాలుడు బాహ్య చైతన్యం కోల్పోయి సమాధి స్థితుడైనాడు. అంతర్ముఖంగా జ్యోతిరూపి శివలింగ దర్శనము కలిగి, ఓంకారం వినిపింపసాగేది.
బాహ్య చైతన్యానికి తిరిగివచ్చాడు. అప్పుడు ఆ బాలుడు బాహ్య చైతన్యం కోల్పోవటం కపట నాటకమని అభిప్రాయపడ్డారు అక్కడున్న వారు.
ఒకసారి ఆ ప్రాంతమంతా తుఫాన్ కు గురైంది, కాని శివబాలయోగి కూర్చున్న చోటు చెక్కుచెదర లేదు. దీనిని చూచి జనులు విస్తుపోయారు.
ఇక అయన (శివబాలయోగి) యోగ శాస్త్ర ప్రకారం 12 సంవత్సరాల పాటు దిక్ తపస్సు చేసారు (దీక్ష ననుసరించి ఒకొక్క దిక్కు వైపు నియమిత సంవత్సరములు తిరిగి చేయు యొగాభ్యసము).
ఈయన ధ్యానం, ప్రాణాయామం, ప్రార్థన, సమాధి స్థితుల గురించి తనవద్దకు వచ్చిన వారికి బోధించేవారు. ఈయనవద్ద దీక్షను గైకొన్న వారెందరో ఉన్నారు.
యోగులు సాధారణ మానవుల వలె మరణించరని, భౌతిక దేహాలు వారి ఆయుర్దాయాన్ని నియంత్రించవని ఆయన తెల్పేవారు. “నేను భౌతిక శరీరంలో ఉన్నప్పటికన్నా, సమాధిలో ఉన్నప్పుడే నా భకులకు తేలికగా అందుతాను. నా సమాధిని దర్శించిన వారి సమస్యలకు పరిష్కారాలను ఇస్తాను” అన్నారు శివబాలయోగి.
ఈ మహనీయుని సమాధి దాక్షారామమునకు ఒక కిలోమీటరు దూరములో నున్న ఆదివారపు పేటలో ఉంది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నానారాజ్య సందర్శనం …. మహనీయులు – 2020 – జనవరి 28
- భలే పావురమా! … మహనీయులు – 2020 – జనవరి 20
- శృంగేరి పీఠం … మహనీయులు @2020 – జనవరి 8
- జయంతి! వర్థంతి! …. మహనీయులు – 2020… మే 6
- శుభ దినాన శుభ సంకల్పం – మహనీయులు – 2020 – జనవరి 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments