జయంతి! వర్థంతి! …. మహనీయులు – 2020… మే 6



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబాను దత్తావతారంగా భావించి పూజిస్తారు.

శ్రీ వేణుగోపాలస్వామి సమాధి స్థితికి పోక మునుపు, తనకు ఇష్ట దైవమైన దత్తాత్రేయస్వామిని ప్రత్యక్షం చేసుకున్నానని, ఇకపై తనను “శ్రీదత్తాత్రేయస్వామి” గా పిలువలసిందని, శనివారం తప్ప మిగతా వారాలలో మందిరంలో పూజలు జరుపవచ్చునని తెలిపారు.

ఆంగ్ల కాలమానం ప్రకారం ఆయన జన్మదినం 6. 5.1944. సమాధి చెందిన దినం 6. 5. 1976. ఇటువంటి జనన మరణాలు ఒకే దినాన ఉండటం అరుదైన విషయం.

ఆయనే తదనంతర కాలంలో మొగిలిచర్ల దత్తాత్రేయస్వామిగా ప్రసిద్దికెక్కారు.

చదువే సరిగారాని, ఒక వ్యక్తికి, తాను సిద్ధిపొందిన తరువాత, కలలో కనిపించి కలం ఇచ్చి కవిత్వం వ్రాయమన్నారు స్వామి.

150 పద్యాలతో స్వామి వారి జీవిత చరిత్ర “సాధు దత్తాత్రేయ స్వప్రకాశ” అనే మకుటంతో వ్రాశాడు.

ఇంకా అయిదవ తరగతి వరకే చదువుకొనిన ఒక గ్రామవాసి దత్తాత్రేయస్వామి జీవిత చరిత్రను తెలుసుకుని లాలి పాటగా – స్త్రీల పాటగా వ్రాయటం జరిగింది.

ఒకసారి కూర, పులుసు, పచ్చడి, పాయసం అన్నీ స్వయంగా తయారుచేసి తీసుకుని వచ్చారు స్వామి వద్దకు. అన్నీ వడ్డించారు.

స్వామి వారు అన్నంలో అన్నీ పదార్దాలు కలిపేశారు. పాయసంతో సహా “పెరుగో, మజ్జిగో అది కూడా వేసేయి అమ్మా” అన్నారు స్వామి మరల.

“బెండకాయ వేపుడు, సాంబారు, చింతకాయ పచ్చడి, పాయసం వేటికవి మంచి రుచిగా ఉండాలని జాగ్రత్తగా తయారుచేశాను, నాయనా, “మీరిలా….” అన్నది ఆ భక్తురాలు.

పసిపిల్లవాడిలా నవ్వి “మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లీ, జిహ్వను రుచినుండి అరికట్టి, అతి సంభాషణ నుండి అరికట్టటమే సన్యాసుల మొదటి లక్ష్యం” అన్నారు శాంతంగా స్వామి.

సాయిబాబా కూడా అంతే! రుచులకు పోయేవారు కాదు.

సాయిబాబా నానా సాహెబ్ చందోర్కరు అనే భక్తునికి భగద్గీతలోని శ్లోకాలను ఎలా చదివి అర్ధం చేసుకోవాలో చెప్పారు.

ఒక భక్తురాలు (పవని నిర్మల ప్రభావతిగారు) లలితా సహస్రం చదువు నామములో అక్షర దోషం ఉంది, అక్షర దోషం ‘చ’ తొలగించి చదవసాగింది.

మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామివారు అపర రుద్రులయ్యారు.

ఏ సహస్రనామమైన, స్తోత్రమైనా, అష్టోత్తరమైనా, మరేదైనా అక్షరాలను బట్టి పట్టటమో, మన ఇష్టప్రకారం అక్షరాలను మార్చుకోవటమేకాదు. మంత్రార్థాన్ని గ్రహించి, అందులోని దైవరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలని స్వామి తెలిపారు.

స్వామికి మే 6 జయంతి, వర్థంతి కూడా.

నేడు మే 6. శ్రీదత్తాత్రేయస్వామిని స్మరిద్దాం.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles