భలే పావురమా! … మహనీయులు – 2020 – జనవరి 20



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి భక్తుడు బి.వి. నరసింహ స్వామి ఒక పిచ్చుక సూచన కోసం ఎదురుచూశారు. అట్లాగే మరో సాయి భక్తుడు స్వామి కేశవయ్య గారు కూడా.

మార్గదర్శకం అనేది మనుష్యులకే కాదు, జంతువులకు కూడా చేయవచ్చును.

అది రోమ్ నగరం. క్రీ.శ. 236 సంవత్సరం జనవరి 10 . గత కొద్ది రోజుల నుండి నూతన పోప్ ను  ఎన్నుకొనుటకు అందరూ సమావేశం అయ్యారు.

ఆ పోప్ పదవిని ఆశించేవారిలో కొందరు శక్తి సంపన్నులున్నారు. కొందరు వాగ్దాటి, వాక్చాతుర్యము కలవారున్నారు మరికొందరు ధైర్య సాహసాలే వారి సొత్తు అనదగిన వారున్నారు.

ఇలా ఎందరో, ఎన్నో గుణములు గలవారున్నారు. వారిలో విజయం ఎవరిని వారించునో కదా? ఆ ఉత్కంఠ కొలది దినములుగా కొనసాగుతున్నది. ఇంకను తెరపడలేవు.

అంతలో ఆకాశంలో ఒక పావురం కానవచ్చింది వారికి. అది తెల్లగా చాడ ముచ్చటగా ఉంది. ఆ పావురము ఆ సమయంలో ఎందుకు వచ్చినట్లు? దాని రక శుభమే. శ్రేయస్కరమే.

శాంతికి మారుపేరైన పావురం క్రైస్తవ మతంలో ఒక స్థానాన్ని ఆక్రమించుకున్నాడు.

జీసస్ క్రైస్తు బాప్తిజమును, నీటిలో నిలబడి స్వీకరించి తిరిగి ఒడ్డునకు చేరునపుడు ఆ పావురము పరిశుద్ధ ఆత్మవలె తన మీదకు (క్రీస్తు) దిగినది.

“ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనయందు నేను ఆనందించు చున్నాను” అనే మాటలు ఆకాశమునుండి వినిపించినవి.

అందరూ కనురెప్పలు వేయకుండా ఆ పావురం వంక చూచుచుండగా అది ఫెబియన్ అను వ్యకి తలపై వ్రాలినది. అసలు ఫెబియన్ పోప్ ఎన్నికలో తాను కూడా ఒక పోటీదారునిగా నిలబడదామని రాలేదు.

శాంతిదూత పావురము ఆదేశమని, దైవ నిర్ణయమని ఫెబియన్ ను పోప్ గా ఎన్నుకున్నారు.

అతడు నిజాయితీపరుడు. అతను సుమారు 14  సంవత్సరములు పోప్ గా అందరి మన్ననలు పొందాడు.

ఆయన పోప్ గా ఉన్న కాలంలో శాంతి, సామరస్యాలతో ప్రజలు కడుపులో చల్ల కదలకుండా సుఖ, సంతోషాలతో జీవనాన్ని కొనసాగించారు.

ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయములను ఆయన అనంతరం ప్రవేశపెట్టటం జరిగింది.

రాజు మారాడు. డెసియన్ రాజయ్యాడు. ఫెబియన్ ను క్రీస్తును కాదని, ఇతర దేవతలను స్తుతించమన్నాడు. ఫెబియన్ అంగీకరించలేదు.

చెరసాలలో ఉంచారు. భయపడలేదు ఫెబియన్. తాను నమ్మిన సిద్దాంతముల పరిరక్షణ కోసం జనవరి 20, 250 సంవత్సరంలో తనువును వీడాడు.

సామాన్య మానవుడు ఫెబియన్, సెయింట్ ఫెబియన్ అయ్యాడు.

పావురం చూపిన మరో మహనీయుడాయన.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles