Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. ఏ వర్గాన్ని ఏర్పర్చలేదు. అసలు ఆయన మతమేదో స్పష్టంగా తెలియదు ఎవరికీ.
ఒక మతంలోగాని, వర్గంలోగాని క్రొత్త శాఖ రావచ్చు. అందుకు ప్రతిఘటన కూడా ఉండనే ఉంటుందని ప్రజాపిత బ్రహ్మ, బ్రహ్మాబాబా, లేఖరాజ్ కృపలానీగారి జీవితం తెలుపుతుంది.
రత్నాల వ్యాపారిగా ధనాన్ని, కీర్తిని పొందిన ఆయన వల్లభాచార్యుల వైష్ణవ సంప్రదాయానికి చెందినవారు.
55-60 సంవత్సరాల వయస్సులో ఈశ్వరుని గురించి మనన చింతన ఎక్కువ కాజొచ్చింది. “నీవే క్రొత్త ప్రపంచానికి ఆధారంకాగలవు” అనే మాటలు వినబడేవి.. అలౌకిక సాక్షాత్కారాలు కలిగేవి.
ఒకనాడాయన గృహంలో సద్గోష్టి జరుగుతుండగా ఆయన తన గదిలోనికి వెళ్ళి ధ్యానావస్థలో కూర్చున్నారు. నేత్రాలనుండి ఎర్రటి జ్యోతులు వస్తున్నాయి. ముఖం దివ్య తేజస్సుతో నిండిపోయింది.
ఆయన శరీరాన్ని అపూర్వ శక్తి వశపరచుకున్నది. నోటివెంటనుండి “నిజానంద స్వరూపం శివోహం శివోహం…”అంటూ శ్లోకాలు దొర్లాయి.
అనంతరం ఆయన విశ్లేషణ చేసుకున్నారు అనుభవాన్ని. పరమపిత పరమాత్ముడైన శివుడే తన శరీరంలో ప్రవేశించి, సృష్టి వినాశనమును, రాబోవు సత్యయుగ సృష్టిని సాక్షాత్కారము గావించారని,
ఆ పరమాత్మయే తనను నూతన సత్యయుగ దేవతా ప్రపంచ పునఃస్థాపనకు నిమిత్తుడవు కమ్మని ఆదేశించారని ఆయన గ్రహించాడు.
ఇక సంసారిక, భౌతిక బంధనాలను త్యజించాడు. ‘ఓం మండలి’ని స్థాపించారు.
కానీ, ఆ కట్టుబాట్లకు ప్రజల నుండి ప్రతిఘటన వచ్చింది. కోర్టుదాక వ్యవహారం నడచింది. ఇక ప్రభుత్వమే పడిపోయే స్థితిలోకి వచ్చింది.
ఈలోగా పాకిస్తాన్ భారత్ లు ఏర్పడటంతో, మౌంట్ ఆబూలో ఆ ‘ఓం మండలి’ ఈశ్వరీయ విశ్వ విద్యాలయమైంది. అదే బ్రహ్మకుమారీ సంస్థ అయింది.
ఈ సంప్రదాయాన్ని స్వీకరించిన స్త్రీలు బ్రహ్మకుమారీలు, పురుషులు బ్రహ్మకుమారులు, బాబాజీ (లేఖ్ రాజ్ కృపలాని పితాశ్రీ) అయ్యారు.
ఆయన జనవరి 18 (1969)న అవ్యక్తరూపం పొందారు.
“శరీరమనే శవాన్ని చూడకు.
పరమాత్మ శివుని చూడు”.
“యోగాగ్నితో క్రోధాగ్నిని చల్లార్చండి”
రాజయోగము ద్వారా అష్ట శక్తుల ప్రాప్తి”. ఇలా ఎన్నో సద్బోధనలు చేసే ఆ సంస్థ విదేశాలలో కూడా శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మహేశ యోగం … మహనీయులు @2020 – జనవరి 12
- ఆత్మానందం …. మహనీయులు – 2020… ఆగస్టు 18
- గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18
- భలే పావురమా! … మహనీయులు – 2020 – జనవరి 20
- కాని భర్త అడుగుజాడల్లో…. మహనీయులు – 2020… అక్టోబరు 18
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments