Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా సమాధి నుండియే సమాధానం ఇస్తానన్న మాట ఆయన నిరూపించాడు. బాబాను నేను కొన్ని ప్రశ్నలు వేస్తుంటాను.
దానికాయన సమాధానాలు చెబుతుంటాడు. నేను ఒక సారి ”మేమంతా ఆనంద స్వరూపులం కదా! మరి ఎందుకు మేమందరమూ ఇలా కష్టపడుతున్నాము”, అని అడిగాను.
దానికి బాబా నా కిచ్చిన సమాధానం ”అసలు మనిషి, తనకు తానుగా ఆనంద స్వరూపం, కానీ ఈ భూమి మీదకి వచ్చే సమయానికి తాను ఆనంద స్వరూపుడని అన్న విషయం మర్చిపోవటం మూలంగా అన్ని బాధలు, కష్టాలు పొందడం జరుగుతుంది.
అటువంటి సమయంలో, మనిషికి తప్పని సరిగా ఒక గురువు అవసరం కావాలి. ఆ గురువే మనిషిని మరల తిరిగి ఆనంద స్వరూపుడిగా చేస్తాడు. అలా చేర్చగలిగే గురువును నేను” అని బాబా సుస్పష్టంగా నాకు చెప్పడం జరిగింది.
బాబాను నిజంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే కాదు, మరో వెయ్యి సంవత్సరాలైనా కూడా బాబాను అలాగే కొలవవచ్చు
ఒక విత్తనం చాలా చిన్నదిగానే ఉంటుంది. అది సరైన చోట మొలిచి, సరి అయిన ఫలాలను అందింప చేస్తాడు భగవంతుడు, అలాగే మనలను కూడా బాబా ఎక్కడ మనకు వన్నె చేకూరుతుందో అక్కడ మనల్ని బాబా పొదుపుతాడు.
మనం ఏం సాధించామన్నది అవసరమే లేదు. భగవంతుడికి, అనునిత్యం కృతజ్ఞతగా ఉండాలి.
ప్రతీ కార్తీక మాసంలో మేము విశేషంగా పూజలు చేస్తాము. ఒకసారి నమకం చమకం చదువుతూ శివునికి అభిషేకం చేయాలనుకున్నాము.
నా స్నేహితుడైన భాను నాకు సహకరిస్తానన్నాడు. విశేషమైన పర్వదినాలు కావటాన నేను బాబాని నువ్వు ఈ రోజు ఈ పూజలకు తప్పక రావాలి అంటూ ప్రార్ధించాను.
నువ్వు నీ అనుగ్రహాన్ని నా మీద కురిపించి వెళ్ళాలి అని అనుకున్నాను. ఇలా నేను అనుకున్న విషయం నేను ఎవరికీ చెప్పలేదు, అభిషేకాలు జరిగాయి, ఆ తర్వాత బాబా భజన జరిగింది.
నేను బాబా కోసం ఉదయం నుండి ఎదురు చూస్తూనే ఉన్నాను. సాయంత్రం గడుస్తున్న కొద్దీ నాలో ఉబలాటం పెరిగిపోతోంది. ఇంకా బాబా రాలేదు.
క్యాటరింగ్ వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, ఈ లోపల ఒక ముసలాయన, అతన్ని మా ఏరియాలో ఏనాడూ మేము చూడనే లేదు, బాగా మాసిన గడ్డం దుర్గంధంతో ఉన్న బట్టలు, అతని భుజాన చెత్త కాగితాలు ఏరుకునే మూటలు ఉన్నాయి.
అతను హిందీలో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నాకు అర్ధం అయిపోయింది, ఆ వచ్చింది ”బాబా” అని.
నేను అతనితో ”మా ఇంట్లో ఇలా పూజ అవుతోంది భోజనం చేయడానికి రండి బాబా” అని పిలిచాను,
”ఆయన నేను భోజనం చేస్తాను కాని నాకో దుప్పటి కావాలన్నాడు”, ”సరే” అన్నాను. ”ఆ పక్కనే కూర్చుంటాను” అన్నాడు.
నేను ఇంటికి వచ్చి ప్లేట్ నిండా భోజనం పెట్టి, ఒక దుప్పటి తీసుకుని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాను. దూరంగా ఒక వేపచెట్టు కింద పడుకొని హిందీలో ఏదో మాట్లాడుకుంటూ కనపడ్డాడు.
భోజన పళ్లెం ఆయన ముందు ఉంచాను. ఆయన తినేసాడు. ”నేను నువ్వు ఎక్కడ ఉంటావు బాబా అని అడిగాను. ”నేను ఎక్కడ పడితే అక్కడే ఉంటాను, ఇక్కడే తిరుగుతుంటాను” అంటూ చెప్పాడు.
నా ఆనందానికి అవధులు లేవు. భోజనాలు అందరూ తిన్నాక కూడా చాలా ఆహారపదార్ధాలు మిగిలిపోయాయి.
ఇంతకు ముందు మా ఇంట్లో గృహప్రవేశానికి వండిన పదార్ధాలు సరిపోక కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మా ఇంట్లో వారు ఎదుర్కొన్నారు.
అందువలన ఈ సారి కొంచెం ఎక్కువగా వండించాము. నేను బాబాతో అదే చెప్పుకున్నాను, వండిన పదార్ధాలు వేస్ట్ కాకుండా చూడు బాబా అని అనుకున్నాను.
ఇలాగ మిగిలేసరికి ఎవరో అన్నారు అనాధశరణాలయంకి పంపితే వాళ్ళు తీసుకుంటారు అని సరే మంచిది అని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు డబ్బాలు తీసుకుని వచ్చి వాళ్ళకి కావలసినంతా తీసుకు వెళ్లి పోయారు.
ఇంకా ఆహారపదార్ధాలు మిగిలిపోయాయి ఏం చేయాలా అని అనుకునేంతలో ఇంటి ముందుకి ఒక ఆవు వచ్చి నిలబడింది.
ఆ ఆవుకి మిగిలిన అన్నం, అరటి పండ్లు అన్నీ పెడితే శుభ్రంగా తినేసి వెళ్ళిపోయింది.
నేను బాబాకి చెప్పుకున్నట్లుగానే ఒక్క మెతుకు కూడా మిగలలేదు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- జీవితంలో నా భర్త నడవటం కష్టం అని చెప్పిన డాక్టర్ మాటలను, అసత్యం చేసి, త్వరలోనే మామూలు మనిషిని చేసిన బాబా వారు
- సాయిలీల పత్రిక రావడం లేదు అని చింతిస్తున్న వృద్దుడికి, బాబా వారు స్వయంగా వెళ్ళి ఇచ్చుట
- రోడ్డు మీద అందరూ ఉన్న భక్తునికి మాత్రమే కనిపించి, మిత్రమా అని సంబోధించిన బాబా వారు.
- గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments