కష్టాలు భరించలేక ప్రాణత్యాగం చేసుకోవాలనుకున్న భక్తురాలిని వృద్దుడి రూపం లో వచ్చి కాపాడిన బాబా గారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భరత్ రావు గారి అనుభవములు ఏడవ భాగం

1992 లో B. Sc చదువుతున్న మా అబ్బాయి కాలేజీ ఫీజ్ కట్టాలి అని అన్నాడు, ఆ సమయంలో చేతిలో డబ్బులు లేవు, ఇద్దరం సంపాదిస్తున్నా అప్పుడప్పుడు డబ్బుకి ఇబ్బంది వస్తూనే ఉంది.

ఫీజ్ పెద్ద మొత్తం లోనే ఉంది. ఎవరినైనా అడగాలంటే కొంచెం మొహమాటం, పైగా ఎల్లుండే ఆఖరి రోజు,

“బాబా నువ్వే ఆదుకోవాలి ఫీజ్ కట్టకపోతే ఏడాది మిగిలిపోతుంది. ఈ గడ్డు సమస్య నుండి నువ్వే బయటపడేయాలి” అని అనుకున్నాను.

అదే రోజు సాయంత్రం ఒక కొరియర్ బాయ్ వచ్చాడు. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ చెక్కు కొరియర్ లో వచ్చింది, కొంచెం పెద్ద మొత్తమే ఉంది అందులో.

ఆ వచ్చినతను నేను ఈ ఏరియా లోనే ఉంటాను, మీకు పోస్ట్ లో వస్తే ఇంకా ఆలస్యం అవుతుంది, అందుకే నేనే తెచ్చేశాను అన్నాడు.

మా ఆవిడ బ్యాంకు లో పని చేస్తుంది, కాబట్టి వెంటనే డబ్బు డ్రా చేసి ఫీజ్ కట్టేసాము. అలా సాయినాథుడే మాకు ఎదురై మా ఆపద గట్టెకించాడు.

మా ఇంట్లో చాలా ఏళ్లుగా జయమ్మ అనే అమ్మాయి పనిచేస్తుంది. ఆమెకు వెనుక ముందు ఎవరూ లేరు.

పెళ్లి అయింది కానీ ఆమె భర్త ఆమెని వదిలేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు.

జయమ్మకి పిల్లలు కూడా లేరు. మా ఇంటికి రాకముందు తను ఎక్కడో పని చేస్తూండేది. ఆమెకు  బాబా అంటే వల్లమాలిన అభిమానం.

ఎందుకో తెలియదు ఎలా ఏర్పడిందో తెలియదు కానీ రోజూ దిల్ సుఖ్ నగర్  బాబా గుడికి సాయంత్రం హారతికి వెళుతూ ఉండటం అలవాటు చేసుకుంది.

ఒకరోజు తనకి జ్వరం వచ్చి జ్వర తీవ్రత ఎక్కువగా ఉండి ఎవరూ తనను పట్టించుకునే వాళ్ళు లేక మందూ మాకూ అడిగి కనిపెట్టుకునే వారు లేక బాగా విరక్తి చెంది బాబా గుడికి వెళ్లి –

“ఏమిటి బాబా ఇది? ఎందుకు ఈ జన్మని ఇచ్చావు? నా అనేవారు లేరు? నా బాధ వినేవారు లేరు? ఏమిటీ నాకీ బాధా? పట్టించుకునే వారు లేరు? ఎందుకు నాకీ కష్టం?

నేను అనే పదార్ధం లేకుండా పోతే ఎవరికీ ఏ బాధా ఉండదు అందుకే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను నాయనా!” అంటూ బాబాకి చెప్పుకుని, ప్రాణత్యాగం చేయటానికి ఒక నూతిని ఆశ్రయించి అందులో దూకపోయింది.

అప్పుడు ఆమె భుజం పైన ఒక చెయ్యి పడిందట, ఎవరా అని చూస్తే ఒక పండు ముసలి మనిషి నిలబడ్డాడుట.

ఆయన “ఏమ్మా! ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు” అని అడిగాడట.

అప్పుడు ఈమె చెప్పిందట – నాకు చాలా కష్టాలున్నాయి. నాకు అమ్మా నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, నాకు నా అనేవాళ్ళు లేరు, కట్టుకున్నవాడు వదిలేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు.

నేను పనులు చేసుకుంటూ బతకాల్సి వచ్చింది. కట్టుకున్నవాడు నన్ను వదిలేసి పోతే లోకం నన్ను చూసి ఏమంటుంది. అందుకే విరక్తి చెంది చనిపోవాలని అనుకున్నాను” అని చెప్పిందట.

అప్పుడు ఆయన నవ్వి “చచ్చిపోతే నీ సమస్యలు అన్నీ పోతాయా”? అని అడిగి ఆయనే మరలా “నీ తప్పు ఏమీ లేదు, నీ భర్త నిన్ను వదిలి పోయినంత మాత్రాన పిరికి దానిలా ప్రాణత్యాగం చేసుకుంటావా? సమస్యలని ఎదిరించి నిలబడాలి.” అన్నాడట.

అది సరే కానీ ఇంత చెప్తున్నావు ఇంతకీ నీవు ఎవరు? అని అడిగిందట జయమ్మ.

అందుకు ఆయన “అందరిని కాచేవాడిని, అందరి కష్టాలను తీర్చేవాడిని నేనే అన్నాడట.

నువ్వు దిగులు పడకు, దైర్యంగా ఉండు, ఆందోళన పడకు అని కూడా”చెప్పారట.

జయమ్మ సరే అని కళ్ళు తుడుచుకుని చూసేసరికి కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదట.

ఆ వచ్చింది అందరి కష్టాలను తనవిగా భావించేది ఆ సాయినాధుడు కాక ఇంక ఎవరు?

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

భరత్ రావు గారి అనుభవములు ఎనిమిదవ భాగం తరువాయి….

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles