Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: మాధవి గౌతమ్
నివాసం: భువనేశ్వర్
సాయి బంధువులందరికి సాయిరాం. నా పేరు సిరివాళ్ళూరి వారిణిపురం మాధవి గౌతమ్. మాది భువనేశ్వర్. మా అన్నయ్యగారైన రవి గారి విషయంలో బాబా గారు చేసిన లీలను నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.
మా అన్నయ్య గారికి చర్మ సంబంధమైన ఒక వ్యాధి వచ్చింది. అందుకు గాను తాను తమిళనాడులోని వెల్లూరు CMC హాస్పిటల్ లో చేరారు.
రెండు, మూడు నెలల వరకు అదే హాస్పిటల్ లో ఉన్నారు. తరువాత తనకు సీరియస్ గా ఉందని ICU లో ఉంచారు.
డాక్టర్లు తొమ్మిది గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేం అని చెప్పారు. మా అక్కగారు USA లో ఉంటారు. మా గురువు గారు కూడా అక్కడే ఉంటారు.
ఇక్కడ జరిగిన విషయాన్ని మేము మా గురువు గారికి చెపితే, ఎవరైన తొమ్మిది గంటలపాటు కదలకుండా బాబా ధ్యానంలో కనుక ఉంటే తనకు ఎలాంటి ప్రాణహాని కలగదని చెప్పారు.
డాక్టర్ గారు మరియు మా గురువు గారు కూడా అదే చెప్పారు. కావున నేను బాబా భజన, సచ్చరిత్ర పారాయణ చేస్తూ తొమ్మిది గంటలు బాబా సన్నిధిలో గడిపాను.
తొమ్మిది గంటలు గడిచాక బాబా నా ప్రార్ధనను, నా పూజని స్వీకరించారు. కావున గండం గడిచిపోయింది. డాక్టర్స్ ఇక ప్రమాదం లేదని చెప్పారు.
తాను మామూలు స్థితికి వచ్చేసాడు. నేను ఇక్కడ ధ్యానంలో ఉన్న సమయంలోనే అమెరికాలో మా అక్క వాళ్ళకి తెలిసిన ఒక అతను మా అన్నయ్య ఆరోగ్యం కోసం బాబా ధ్యానంలో కూర్చున్నారు.
అతను అక్కడ ధ్యానంలో ఉన్నప్పుడు నేను బాబా ధ్యానంలో ఉన్నట్టు కనపడ్డానట.
వారు మా అక్కగారితో మీ ఇంట్లో ఎవరో ఒకరు బాబా ధ్యానంలో ఉండి బాబాను పట్టేసుకున్నారు. తనంటే బాబాకు చాలా ఇష్టం. కావున మీరు దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
బాబా దయ వలన తనకు ఎలాంటి హాని లేదని డాక్టర్స్ చెప్పారు. అయినప్పటికీ అన్నయ్య హాస్పిటల్ లోనే నాలుగు నెలలు ఉండాల్సి వచ్చింది.
ఈ నాలుగు నెలల్లో మా అన్న కొంచెంకొంచెం కోలుకుంటూ మామూలు స్థితిలోకి వచ్చాడు.
తాను కోలుకుంటున్న సమయంలో 2, 3 సార్లు వెనక నుండి బాబా తన వీపు మీద నిమురుతూ “ఏమి కాదు, ఏమి కాదు” అని చెప్పారట.
అలా చెప్పడం వల్ల మా అన్నయ్య ఎంతో దైర్యంగా ఉంటున్నాడు. బాబా భక్తుడు అయిన మాణిక్యం బాబా అనే అతను నాకు ఫోన్ లోనే పరిచయం. అతను వెల్లూరులో ఉంటారు.
మా అన్నయ్యను చూడడానికి నేను వెల్లూరు పోయినాను. ఆ సమయంలో నేను మా అన్నయ్య హాస్పిటల్ ఎదురుగానే రూమ్ తీసుకుని ఉన్నాను.
అప్పుడు మాణిక్యం బాబా గారు అక్కడికి వచ్చి నాకు ఫోన్ చేసి నిన్ను కలవాలమ్మా ఒకసారి కిందికిరా అని పిలిచారు.
కిందికి వచ్చి పరిచయం చేసుకున్నాక రా…. వెళదాం టిఫిన్ చేయడానికి అని అడిగితే వద్దు అనలేక పెద్దాయన కదా! 64 సంవత్సరాల వయస్సున్న మాణిక్యం బాబా గారు అడిగితే వెళ్లకుంటే బాగోదని వెళ్ళాను.
ఇద్దరం హోటల్ లో ఎదురెదురుగా ఉన్నాము. తన ఫోనులో మాధవి కాలింగ్ అని వస్తుంది నా నెంబర్ తో, కానీ నా ఫోన్ నాదగ్గరే ఉంది. నేను అయన ఫోనుకి రింగ్ కూడా చేయలేదు.
ఇది ఎలా సాధ్యం అని ఆయనని ప్రశ్నిస్తే, మాధవి ఆకలితో ఉంది, తన ఆకలి తీర్చు అని బాబా పంపించారని చెప్పారు. బాబా ఆజ్ఞ కనుక ఇడ్లీ తిని ఇద్దరం కలిసి మా అన్నయ్య దగ్గరకు వెళ్ళాం.
మా అన్నయ్యకు ఏదో దిష్టి తగిలిందని ప్రారబ్ద కర్మ వల్ల ఇలా జరిగిందని చెబుతూ మంచం చుట్టూరా విభూతి చల్లినారు.
తరువాత ఆ బాబా నాకు ఒక ద్వారకామాయి విగ్రహం ఇచ్చారు.
కానీ నేను మా అన్నయ్య దగ్గర ఉండాలని ఆ విగ్రహంను అక్కడే తనకు కనబడేలా ఉంచి బాబాను చూస్తూ “సాయిరామ్, సాయిరామ్” అని స్మరించుకోమని చెప్పి నేను భువనేశ్వరుకు వచ్చేసాను.
కొద్ది రోజులకి బాబా దయ వలన తాను డిశ్చార్జ్ అయి క్షేమంగా ఇంటికి వచ్చేసాడు.
ఒక సంవత్సరం తరువాత మా అన్నయ్య తన పిల్లలకు ఉపనయనం చేయిస్తున్నానని నన్ను ఆహ్వానించాడు.
నేను మాఅన్నయ్య గదికి వెళ్లి చూస్తే, మాణిక్యం బాబా ఇచ్చిన ద్వారకామాయి బాబా అక్కడ ఉన్నది.
వాళ్ళు ఆ విగ్రహంను తమ పూజా మందిరంలో ఉంచి ఉదయం, సాయంత్రం, నైవేద్యం, పూజా హారతి ఇచ్చి పూజించట్లేదని బాధేసి, ఇలా బాబాను వదిలివేయకుడదని వాళ్ళకి చెప్పి, మా వదినని అడిగి ఆ ద్వారకామాయి బాబాను తీసుకొని భువనేశ్వర్ లో మా ఇంటికి విగ్రహం తీసుకెళ్ళాను.
కానీ, ఇంట్లో విగ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల బాబాను ఒక దగ్గ్గర పెట్టాను.
కొన్నిరోజుల తరువాత మాణిక్యం బాబా చనిపోయారు. ఆ తరువాత ఆరు నెలలకు మా అన్నయ్య చనిపోయారు.
మా అన్నయ్య కనుక అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు చనిపోతే తనకు కర్మకాండలు చేయడానికి ఎవరు ఉండేవారు కాదు. ఎందుకంటే మా అన్నయ్య కొడుకుకు పెళ్ళికి ముందు చేస్తాంలే…. అని చిన్నప్పుడు ఉపనయనం చేయలేదు.
మా ఇంట్లో ఉపనయనం అయిన కొడుకే కర్మకాండలు చేస్తాడు. కర్మకాండ చేయడానికి మాకు తండ్రి లేడు. అన్నదమ్ములు లేరు.
అందుకనే బాబా మా అన్నయ్య జీవితకాలంను రెండు సంవత్సరాలు పొడిగించి కొడుకులకు ఉపనయనం చేయించి తనలో ఐక్యం చేసుకున్నారు.
కొంతకాలం తర్వాత ఈ మద్యనే మా ఇల్లు శుభ్రం చేస్తుంటే మాణిక్యంబాబా ఇచ్చిన ద్వారకామాయి బాబా విగ్రహం కనిపించింది.
అప్పుడు బాబా విగ్రహాన్ని చూస్తే, విగ్రహం మొత్తం మచ్చలు, మచ్చలు అయిపోయింది.
మా అన్నయ్య భాదపడుతున్న వ్యాధి అంతా బాబా విగ్రహరూపంలోనే తీసుకుని ఆ వ్యాధిని అంతా బాబా భరిస్తూ దానికి నిదర్శనంగా బాబా మా అన్నయ్య ఒంటి మీద ఉన్న మచ్చలు తాను తీసుకుని బాబా భరించారని తరువాత అర్ధం అయింది.
అన్న ఒంటి మీద ఎలాగైతే మచ్చలు ఉంటాయో అలాగే బాబా ఒంటి మీద కూడా మచ్చలు వచ్చేసాయి.
అయితే ద్వారకామాయి విగ్రహాన్ని ఫోటో తీసి నేను మా గురువుగారికి పంపిస్తే తాను బాబాని చూసి, బాబాగారు మీ అన్నయ్య జబ్బును, బాధను భరించారని, అది కూడా రెండు సంవత్సరాలు భరించారని, ఆ విగ్రహంలోనే మీ అన్నయ్య కనపడుతున్నాడని చెప్పారు.
బాబాలోనే మీ అన్నయ్య ఐక్యం అయ్యారని దిగులు చెందవద్దని, ఆ బాబా విగ్రహంను మీ పూజలో ఉంచి పూజించమని చెప్పారు.
అంటే 2012 నుండి 2014 వరకు మా అన్నయ్యను బాబా కాపాడుకుంటూ వచ్చినారు. ఇంతకన్నా లీల ఇంకేం ఉంటుందండీ.
భక్తుల భారాలు కాదు భక్తుల వ్యాధిని కూడా తాను భరిస్తున్నాని చెప్పడానికి మా అన్నయ్య యే ప్రత్యక్ష నిదర్శనం.
బాబాను నమ్ముకుంటే వెన్నంటి ఉండి కాపాడతారని, మరల చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నా ఈ అనుభవంను మీతో పంచుకోవడం కొరకు అవకాశం ఇచ్చిన అందరికి మరియు ప్రత్యేకంగ కిశోర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
*** సాయిసూక్తి:
“మరణ అంచుల నుండి కూడా నా వాణ్ణి నేను లాగ గలను”
Latest Miracles:
- దూరాన్ని పెంచిన అంగ వైకల్యం, నాన్నకి దగ్గర చేసిన సాయి కరుణ ……….!
- భక్తురాలి మనసులోని కోరికను సర్వాంతర్యామి అయిన బాబా తీర్చుట
- జీవిత కాలాన్ని పెంచిన బాబా–Audio
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- కానీ ఖర్చులేని వైద్యం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments