కాకాసాహెబు దీక్షిత్ నకు విఠలదేవుడు గా దర్శనమిచ్చుట (దాసుగణునికి బాబా వారు ఇచ్చిన వాగ్దానం నెరవేరుట)–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!

This Audio prepared by Mr Sreenivas Murthy

  1. Mir-11 కాకాసాహెబు దీక్షిత్ నకు విఠలదేవుడు గా దర్శనమిచ్చుట 2:33

సాయిబాబాకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి.

వారెప్పుడు అల్లా మాలిక్ అని యనెడివారు. అనగా అల్లాయే యజమాని.

ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామస్నరణ చేయించు చుండెడివారు.

దీనినే నామసప్తాహ మందురు. ఒకప్పుడు దాసుగణు మహారాజును నామసప్తాహము చేయుమనిరి.

సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్ధాన మిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసుగణు జవాబిచ్చెను.

బాబా తన గుండెపై చేయివేసి “తప్పనిసరిగ దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తిప్రేమలతో నుండవలెను.

డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకాపట్టణము, ఇక్కడనే యనగా షిరిడీలోనే యున్నవి.

ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునపుడు విఠలుడిక్కడనే యవతరించును” అనెను.

సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రిందివిధముగా దర్శనమిచ్చెను.

స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్న హారతికొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా బాబా యిట్లడిగెను.

“విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టు కొనుము. ఏమాత్రము అజాగ్రత్తగ నున్నను తప్పించుకొని పారిపోవును.” ఇది ఉదయము జరిగెను.

మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25, 30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను.

ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబామాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను.

విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles