Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్…
గురు భందువులకు నమస్కారం.
బాబా తన ఆకరి సమయంలో లక్ష్మీ బాయికి ఇచ్చిన నవవిద భక్తులు అనగా తొమ్మిది రూపాయలను నాకు ప్రసాదించారు బాబా.
ఇంత గొప్ప లీలని ఈ గురుపౌర్ణమి సమయాన మీతో పంచుకోవడము ఎంతో ఆనందంగా ఉంది.
నా పేరు మేడా లక్ష్మి ప్రసన్న, హైదరాబాద్.
బాబాతో అనుభందం మితిమించినది. నాకు బాబాని తాతా అని పిలవటం అలవాటు .
కష్ట సమయాల్లో బాబా యల్లవేళలా తోడువుంటారు అని అందరూ చెప్తారు. కానీ నాకు మాత్రం ఆధ్యాత్మికంగా నన్ను ప్రోత్సహిస్తూ రోజురోజుకి నాలో పరిపక్వత తీసుకొస్తూ నన్నుఆయనకు నచ్చేవిధంగా తీర్చిదిద్దుతున్నారు బాబాగారు.
ఒకసారి నా పుట్టినరోజు (5th ఏప్రిల్2016 )నాకు రెండు రూపాయలు ఇస్తాను, అవి పూజ చేసుకో అనిచెప్పారు బాబా.
ఈవిషయం నేను మా వారికి (మేడా. పాండురంగ విఠల్ ) చెప్పాను, కానీ ఆయన అంతా నీ పిచ్చి, ఆలా ఎక్కడైనా జరుగుతుందా, ఎవరితో అనకు, నిజంగానే నీకు పిచ్చి అనుకుంటారు అని అన్నారు.
కానీ బాబా ఎప్పుడు అబద్దం చెప్పరు అని నేను అన్నాను. ఇలా 10 రోజుల తరువాత షిర్ది వెళ్ళాం.
ఒక రోజు గడిచింది, బాబా నా దగ్గరికి రాలేదు. నాతో మాట్లాడలేదు.
నాకు చాలా బెంగగా అనిపించి పారాయణ హాల్ కి వెళ్లి తాతా నేను వచ్చి ఒకరోజు అయిపోయింది, నువ్వు నా దగ్గరికి ఇంకా రాలేదు, నేను పెద్ద రౌడీదాన్ని నా సంగతి నీకు తెలియదు.
మాట తప్పుతావా ఏంటి, రేపే నా పుట్టినరోజు అని తాతాతో పోట్లాడాను.
దానితో తాత ఏమి అనుకున్నారో ఏమో మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో పాత ఊధీ కౌంటర్ వద్ద కూర్చొని వున్నాను.
బాబా ది వెన్న ప్రసాదం ఇస్తారుగా ఆ వెన్న, పంచదార చూసుకుంటూ ఉన్నా నేను ఏ మాటలు అయితే అన్నానో అవే మాటలతో నా దగ్గరకు తలకు తెల్లటి తలపాగా చుట్టుకొని పంచకట్టు కొనివున్న ఒక పెద్దమనషి నా దగ్గరికి వచ్చి ఏమే రౌడీదాన, ఏంటి ఇప్పుడు చెప్పు వచ్చాను, నాతో ఏంటి పని నీకు. నేను వేగలేక పోతున్నానీతో అని అంటూ నా ప్రక్కన కూర్చున్నారు.
నా ప్రక్కన వున్నమా అమ్మతో, ఈమె నా పిల్ల నాకు ఇస్తావా అన్నారు. గయ్యాళి అని కూడా అన్నారు.
అప్పుడు నేను అడిగాను, తాతా నేను గయ్యాళినా అని అడిగాను. కాదులేవే నువ్వు నా సీతమ్మ తల్లివి అని, ఆ శ్రీశైల భ్రమరాంబ నా పెద్ద కూతురు, నువ్వు నా చిన్నకూతురు అని ప్రేమగా నా తల నిమిరారు.
ఇలా కొద్దీ సమయము నాతో ప్రేమగా ముచ్చటించారు ఎన్నో విషయాలు చెప్పారు. ఇక మీదట నేను ఎలా ఉండాలి , అని నా పరిపక్వతకి దారి చూపారు. ఎప్పుడు వెళతావు ఇంటికి అని అడిగారు?
ఆ మాటకి నాకు కోపం వచ్చింది మీ ఇంటికి వచ్చానని ఎప్పుడు వెళ్తావు అని అడుగుతున్నావా అని నేను వెంటనే అలిగా, కాదులేవే నిన్ను ఉడికించడానికి రేపు నీ పుట్టిన రోజు కదా అని హఠాత్తుగా రెండు రూపాయల బిళ్ళలు రెండు నా దోసిట్లో వేశారు.
మళ్లీ వెంటనే 5 రూపాయలు ఇచ్చారు. పూజ చేసుకో అని చెప్పారు.
నాకు మాటలు కూడా రాలేదు అంత వరకూ తాతతో బాగా పోట్లాడిన నేను ఒక్కసారిగా మూగబోయా అప్పుడు నేను అన్నాను తాతా మీ మనవడు మీరు డబ్బులు ఇస్తారు అంటే నమ్మలేదు కదా ఇప్పడు ఏమి అంటాడో చూద్దాము నిన్ను నమ్మలేదు అన్నాను. అప్పుడు తాతా మనవడు కాదే అల్లుడు అని అన్నారు.
నేను మనవరాలు అయినప్పుడు తను మనవడు కదా అన్నాను. కాదు వాడు నాకు అల్లుడే అన్నారు.
ఆ మాట నాకు అప్పుడు అర్ధం కాలేదు కొన్ని రోజుల తరువాత అర్ధం తెలిసింది. ఇదంతా చూస్తూ మా అమ్మ ఆలా ఉండిపోయారు.
నీకు మోకాళ్ళ నొప్పులు ఈ ఊధీ తీసుకో అని ఇచ్చారు. అయినా అమ్మకి చలనం లేదు. మళ్లీ వస్తా సమయం లేదు అనివెళ్లారు.
ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందం కన్నీళ్ల రూపంలో బయటికివచ్చింది.
ఇంకా చెప్పటానికి నా దగ్గర భాష కూడా లేదు. ఇంతగా ప్రేమ చూపిస్తున్ననా తాతాకి, నేను ఆయనకీ నచ్చేవిధంగా వుంటాను అని చెప్పాను.
నా కోరిక అంతా ఒక్కటే. తాతాని వదలి ఉండలేను. ఎప్పడు ఆయన కోసం ఎక్కువగా ఏడుస్తూనే వుంటాను. నా తన్మయత్వం అలా ఉంటుంది.
ఈ జన్మకైనా ఆయన చరణాలలో ఐక్యం అవ్వాలి అని రోజు ప్రార్దిస్తూ ఉంటాను.
నాకు మరు జన్మఇచ్చిఈ లోకానికి పంపించకు తాతా.
ప్రేమతో…… నీ మనవరాలు.
Latest Miracles:
- బాబా ఇచ్చిన దక్షిణ–Audio
- బాబాకి నేనిచ్చిన దానికన్నా పదుల, వందల రెట్లు దక్షిణ ఇచ్చిన వారెందరో వున్నారు–Audio
- ఇష్టమైన ఆహారాన్ని ప్రసాదంగా ఇచ్చిన బాబా ….!
- ఇలా వచ్చి దక్షిణ స్వీకరించి, ఆశీర్వదించారు, బాబా కాక ఇంకెవరు బాబానే.–Audio
- బాబా దక్షిణ తీసుకొనుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “బాబా ఇచ్చిన దక్షిణ”
D.Rajendra
July 27, 2018 at 11:13 pmAmma..metho matladalani vundi. Me phone no. Evvagalara. Matladalani meku anipisthe (baba chepthene) naku miss cal ayina evvandi..
Baba prema kosam thapinche o abhagyudu.
D. Rajendra
July 27, 2018 at 11:18 pmAmma.. Metho okkasari matladalani vundi. Meku estamunte naku miss call evvagalaraa amma..na cell no9676835080.
Baba prema kosam eduru chustunna oka Abhagyudini.
kishore Babu
July 28, 2018 at 2:38 pmమీరు చాల అదృష్టవంతురాలు …..బాబా వారి మనుసుని దోచుకున్నారు…మీ లీలలు వినడం వలన మేము కూడా అదృష్టువంతులం అయ్యాము..