Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
🌹శ్రీసాయిసచ్చరిత్రము-13🌹
బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తి వంతముగను, సమతూకముతోను నుండెడివి.
వారు ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా నుండువారు.
బాబా యిట్లనిరి “నేను ఫకీరునయిప్పటికీ, ఇల్లువాకిలి, భార్యబిడ్డలు ,తదితర బాదరబందీ లేవీలేకుండా, ఎక్కడికీ కదలక యొకచోట కూర్చొనియున్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నునూ బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది.
హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా, నావంటి దుర్బలుడయిన ఫకీరనగ నెంత.హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం.నిరంతర హరిభజనయే దానికి మార్గం”.( మారుతి : మా హరి మీరే సాయి.మా భజన సాయిభజనయే సాయి ) . మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను.
తనభక్తుల మేలుకొరకు బాబా యింకా యేమి చెప్పియున్నారో వినుడు. “ఎవరు అదృష్టవంతులో, యెవరి పాపములు క్షీణించునో, వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెఱుగగలరు.ఎల్లప్పుడు ‘సాయి సాయి‘ అని స్మరించుచుండిన సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని, అష్టాంగయోగములు గాని నాకు అవసరములేదు. భక్తి యున్నచోటనే నా నివాసము“.
బాబా యాజ్ఞ జవదాటరానిది.
బాబా తన భక్తులవద్దనుంచి యేమియు కాంక్షించెడువారు కాదు. వారికి కావలసినదేమన, భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తియందుంచుకొని, అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుండుటయే.
బాబా వాక్కుకున్న శక్తి యద్భుతమైనది.
నిజమైన యౌషధము బాబాయొక్క వాక్కే .
అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబాయొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమేకాని, ఔషధములు కావు.
🌹సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా🌹 🙏
Latest Miracles:
- ఆమె జీవితం బాబా యొక్క బహుమతి
- సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.—Audio
- సర్వ శక్తి సంపన్నుడు సాయి–Audio
- “సాయి సచ్చరిత్ర” జయంతి…..సాయి@366 నవంబర్ 26….Audio
- శ్రీ సాయిదాసుగారు నంధ్యాలనుండి శ్రీ శైలము ట్రాన్సఫర్ లోని బాబా లీల.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments