Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నేను సుమారు గత 13 సంవత్సరాల నుండి సాయి భక్తుడిగా ఉన్నాను. నేను యెల్లప్పుడూ ఆయనని పూజిస్తూ ఉంటాను. ఆ కాలంలో నేను చాలా చిత్రమైన అనుభవాలు కలిగాయి. వాటిలో కొన్ని సాయిలీల మరాఠి పత్రికలో, గతంలో ప్రచురింపబడ్డాయి. కాని 1972 ఏప్రిల్లో జరిగిన బాబాగారి శక్తి మరియు షిరిడీ లోని బాబా ఊదీ మహాత్మ్యం మాకు మరిచిపోలేని అనుభూతి. ఆ లీలని ఇప్పుడు సాయిభక్తులందరికి వివరిస్తాను.
ఏప్రిల్, 1972 లో హటాత్తుగా, మా పెద్దాబ్బాయి కూతురు భావనకి సుస్తీ చేసింది. ఆమెని మేము సంజీవని అని ముద్దుగా పిలుస్తాము. మా ఫామిలీ డాక్టర్ పరీక్షించి వేసవి కాలము వల్ల కొంచెం వడ దెబ్బ లేక వాతావరణం వేడి వల్ల కొంచెం సుస్తీ చేసి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. జ్వరం తగ్గకుండా అలాగే ఉండటంతో ఆహారం యేమీ తినడంలేదు. అమ్మాయి పొత్తికడుపు పెద్దదయి బయటకు తెలుస్తోందీ. డాక్టర్ గారు మాములుగా వడదెబ్బకనే వైద్యం చేస్తూ సీరియస్ నెస్స్ ని చూడలేదు. అమ్మాయి రోజు రోజుకి క్షీణిస్తోంది. కళ్ళు లోతుకు వెళ్ళాయి, పొట్ట ముట్టుకుంటే బాగా నొప్పి, అలా వుంది పరిస్థితి. ఆఖరికి మేము అమ్మాయిని యిండొర్ లోని పెద్ద ఆస్పత్రిలో చూపించదలచాము. మేము ఆదివారము రాత్రి ఆప్స్పత్రిలో చేర్పించాము. ప్రథాన డాక్టర్ గారు ఆరోజు సెలవులో ఉన్నారు. ఆస్పత్రిలో చేర్పించే ముందు అమ్మాయికి నుదిటి మీద షిరిడీలోని బాబా ఊదీ చిటికెడు పెట్టాము. మరునాడు ప్రథాన డాక్టర్ గారు పరీక్షించి, ప్రేవులకి సంబంధించిన టైఫాయిడ్ అని నిర్థారించారు. లోపల ప్రేవులలోని గోడకి చిల్లు పడిందని చెప్పారు. ఇటువంటి కేసులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, ఆపరేషన్ చెయ్యవలసి ఉంటుంది, కాని, అమ్మాయి ఆపరేషన్ కి తట్టుకోలేదు అని డాక్టర్ గారు చెప్పారు. గ్లూకోజ్ సెలైన్ యెక్కించమని సలహా ఇచ్చారు. మేమంతా కూడా చాలా అందోళనగా ఉన్నాము. మా కుటుంబ సభ్యులమంతా అమ్మాయి గురించి భయపడుతున్నాము. ఆస్పత్రిలో వైద్యం మొదలు అయింది. ఇది జరిగే ముందు నేను మరాఠిలో బాబా చరిత్ర చదువుతున్నాను. ఆ సమయానికి నేను 8 అథ్యాయం పూర్తి చేసి 9 లోకి వచ్చాను. నాకు బాబా మీద నమ్మకం ఉంది. నేను ఆయనకి విన్నవించుకున్నాను ” ఓ బాబా మామీద ఇటువంటి ఉపద్రవం పడిందేమిటి, దీనినుంచి తప్పిచగలవాడవు నువ్వే” అని.
ఈ లోగా నేను చరిత్ర చదువుతూ ఉన్నాను. ప్రతి గురువారము ఆరతి, పూజ చేస్తూ ఉన్నాను. ఆపరేషన్ లేకుండా రోగం నయం అయ్యేటప్పటికి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అది పేషంట్ సాథించిన విజయమా కాదు అది బాబా గారి శక్తి, ఊదీ మహత్యం. క్రమంగా అమ్మాయి జ్వరం తగ్గింది, ప్రేవులలోని గోడకి ఉన్న చిల్లు కూడా మానింది. 2, 3 వారాల తరువాత అమ్మాయి యింటికి తిరిగి వచ్చింది. నాకనిపిస్తుంది, బాబా మీద నమ్మకం చూపే లీల అమోఘం. కాని ఆయన అందించే అనుగ్రహ ఫలితాన్ని మనం కోల్పోతూ ఉంటాము.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- పవిత్రమైన బాబా ఊదీ – నయం కానివాటిని కూడా నివారిస్తుంది (1983)
- బాబాగారి 101వ సమాధి చెందిన రోజుకి saileelas.com వెబ్సైటు లో బాబాగారి క్విజ్ లు correct గా 101 క్విజ్ లు
- ఆ చేతులు ఎవరివి? బాబావి
- నాకు అనుభవమైన ఊదీ మహత్యం ……….!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబాగారి శక్తి మరియు ఊదీ మహాత్మ్యం”
B.V.R.Murthy
December 25, 2016 at 5:07 am“మన కర్మలు జోలెలొ వేసుకొని, ఆ ధునిలో కాల్చేవాడవని” నిరూపించారు మన ప్రియాతి ప్రియమైన సచ్చిదానందుడు.
అందుకే “వీభూతి” ని నమ్మితే ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన పని లేదు. అదే “వీభూతి” ని నమ్మకపోతే ప్రాణం గురించి ఆలోచించాల్సి వచ్చేది.
“వీభూతి” ని నమ్మితే ఆరోగ్యం. నమ్మకపోతే దానంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. జై సాయిరాం.