నాకు అవసరమైనప్పుడు బాబానే ఇస్తారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బాబా గుడికి గురువారం మాత్రమే వెళ్లే నేను,తరువాత ప్రతిరోజూ వెళ్లడం అలవాటు చేసుకున్నాను.

ఒకరోజు” క్రిడా “లో జూనియర్ రీసెర్చ్ ఫెలో లో పోస్ట్ కి నోటిఫికేషన్ పడింది.ఇంట్లో ఫైనాన్సియల్ గా పెద్దగా ప్రాబ్లెమ్ లేకపోయినా,మా నాన్నఅమ్మాయిలు కచ్చితంగా జాబ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉన్నతను ,నాకు కూడా జాబ్ చేయాలని చాల ఇష్టం.

(బాబా ఎంతగానో చెప్పినా నేను బాబాని విసిగించేది ఒక్క జాబ్ విషయం లోనే ,ఈ విషయం లో నాకు దాసగణు గుర్తుకు వస్తాడు.బాబా యెంతగా జాబ్ వదిలేయమన్నా కూడా తనకి జాబ్ మీద ఉన్న మక్కువతో దాసగణు జాబ్ ని వదిలేయడు వీడితో ఇలా కాదు.ఒక కొరత పెడితే కానీ దారికి రాడు అని…లాస్ట్ కి దాసగణు జాబ్ మానేలా చేస్తారు బాబా ).

నా విషయం లో కూడా అలాగే చేసారు.

“క్రిడా” లో నోటిఫికేషన్ పడింది కదా.నా సర్టిఫికెట్స్ అన్ని జిరాక్స్ చేయించి, అప్ప్లయ్ చేశాను.తిరిగి వరిజినల్ వాటిని బ్రౌన్ కలర్ కవర్ లో పెట్టి నా సెల్ఫ్ లో పెట్టాను.

తరువాత నాకు చాల ఇష్టమైన అంకుల్ కి కాల్ చేస్తే,నీ ఎడ్యుకేషన్ కి సంబందించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా నాకు చెప్పు.అగ్రికల్చర్ మినిస్టర్ తో అయినా చెప్పించి జాబ్ వచ్చేలా చేస్తాను. అన్నారు.

నేను సరే అని ఫోన్ పెట్టేసాక ఇలా ఆనుకున్నాను.బాబా నా జాబ్ కి చెప్పిన టైం ఇంకా చాల ఉంది.కానీ ఇప్పుడు నాకు జాబ్ అవసరం కదా ! బాబా చెప్పినట్టు ఇది గవర్నమెంట్ జాబ్ కాకపోయినా సెమి గవర్నమెంట్ ఏ కదా.పరవాలేదు అడ్జస్ట్ అవుతాను..నాకు కూడా ఈ జాబ్ చేయడం ఇష్టం కాబట్టి బాబా ఎలా ఆపుతాడు ఈ జాబ్ ని.అని అనుకున్నాను.

రెండు రోజుల తరువాత మా రూమ్ సెల్ఫ్ లో ఉన్న సర్టిఫికెట్స్ ని చూసి బాగ్ లో పెడుతూ,నాకు అస్సలు బుద్ది లేదు.సర్టిఫికెట్స్ ని ఇలా అజాగ్రత్తగా సెల్ఫ్ లో పెట్టాను.ఇవి కనిపించకుండా పోయి,నేను చాల వెతికి వెతికి ,ఇక నావల్ల కాదు అనుకున్న సమయంలో బాబా నాకు ఈ సర్టిఫికెట్స్ ని ఇస్తే, అప్పుడు గాని నాకు బుద్ది రా దనుకుంటా .అప్పుడు వీటిని భయంగా జాగ్రత్తగా దాచుకుంటానేమో అని అనుకుంటూ బాగ్ లో పెట్టాను.నాకు బాగా గుర్తుంది.

ఒక పదిరోజుల తరువాత దసరా కి ఇంటికి వెళదాం అని బాగ్ సర్దుకుంటూ వర్జినల్ సర్టిఫికెట్స్ ఇక్కడ ఎందుకు ఇంటిలో పెట్టి వస్తే బెటర్ అని చూసేసరికి బాగ్ లో సర్టిఫికెట్స్ కనిపించలేదు.టెన్షన్ తో రూమ్ మొత్తం వెతికా,మా రూమ్ మేట్స్ కూడా వాళ్ళ బాగ్స్ ,రూమ్ మొత్తం వెతికారు.కానీ ఎక్కడ కనిపించలేదు.నాకు షాక్ గా అనిపించింది.10th -pg సెరిటిఫికేట్స్ మొత్తం ఆ కవర్ లోనే ఉన్నాయి .భయం వేసింది .ఇంటికి వెళ్ళాక కూడా తెచ్చిన బాగ్ ని ఒక్కొక్కటి గా తీసి చూసాను కానీ కనిపించలేదు.ఇంట్లో చెపితే మా నాన్న తిడతారు అని చెప్పలేదు.కానీ భయం అనిపించింది.

మళ్ళీ హాస్టల్ కి వచ్చాక చూసినా లాభం లేకుండాపోయింది.ఫ్రెండ్స్ అందరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి అని, అవి రావడానికి చాల టైం పడుతది, చాల కష్టం అని ఏవేవో చెప్పారు నాకు భయం వేసింది.

మా హాస్టల్ లో ఒక అమ్మాయి జాతకం చెప్పే ఆమె దగ్గరకి వెళ్తూ నన్ను రమ్మంది సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయో చెప్పుతది అని.జాతకాలూ చూడడం బాబాకి ఇష్టం లేదు అని చెప్పాను.కానీ తను, ఏమో నాతో బాబానే చెప్పిస్తున్నాడేమో, రా ,అంది. నాకు వెళ్లడం ఇష్టం లేదు కానీ వెళ్ళాను.

ఆ జాతకాల ఆమె,సర్టిఫికెట్స్ ఈ ఊరు దాటి పోయాయి దొరకడం చాల కష్టం. పార్క్ లో పచ్చి గడ్డి తెచ్చి ఇరవైయొక్క ముడులు వేసి గణపతికి వేసి దొరకాలని మొక్కుకో ,అప్పుడు కూడా దొరుకుతాయి అని నమ్మకం లేదు కానీ,అదొక్కటే లాస్ట్ ఛాన్స్ .అని చెప్పింది.

నేను మా ఫ్రెండ్ మారుతి తో గడ్డి తేవడానికి వెళ్ళేటప్పుడు చేప్పాను.నా సర్టిఫికెట్స్ పోయాయి. ఇలా రెమిడీ చెప్పింది అని.ఆ గడ్డి తీసుకుని గుడికి వచ్చాను కానీ,నాకు అలా చేయడం నచ్చట్లేదు.

బాబాకేమో జాతకాలూ చూడడం ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు ఇలా చేస్తే నేను ఈమెని నమ్మినట్టు అవుతుంది కానీ,బాబాని నమ్మినట్టు ఎలా అవుతుంది అని ఒక ప్రశ్న.ఇన్నిరోజులు బాబా అని, ఇప్పుడు నా అవసరం కోసం గణపతి దగ్గరకు వెళ్లి మొక్కడమా ?అలా చేస్తే బాబా బాధపడరా ?నేను అలా చేయగలనా ?ఇంకోవైపు సరిఫికేట్స్ కనిపించట్లేదని బాధ.
ఆ బాధలో బాగా ఏడిచా,బాబా నా సర్టిఫికెట్స్ ని కనిపించేలా చేయాలి కదా ఎందుకు చెయ్యట్లేదు అని.మారుతి అంది ఇప్పుడు నీకు ఈ సర్టిఫికెట్స్ తో అవసరం లేదేమో,అవి నీ దగ్గర ఉండడం కన్నా బాబా దగ్గర ఉండడం బెటర్ అని బాబా తన దగ్గర పెట్టుకున్నాడేమో,నీకు అవసరం అయినప్పుడు కచ్చితంగా తనే కనిపించేలా చేస్తాడు.అని అంది.

నేను ఉక్రోషంతో బాబా ఎలా కనిపించేలా చేస్తాడు?ఆకాశం లో నుండి ఇప్పిస్తాడా? నేను ఏడుస్తున్నాను అని చెబుతున్నావు కానీ ప్రాక్టికల్ గా ఇది జరగదు నాకు తెలుసు.అంటే,దానికి తను అదంతా తరువాత చూద్దాం ఇప్పుడైతే వాటి అవసరం లేదు కదా.ఇక నీకు గణపతి దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదు.బాబా ఐన గణపతి అయినా ఒక్కటే కాబట్టి ఇక బాబానే అడుగుదాం అంది.నేను సరే అని బాబా దగ్గరే ఆ గడ్డిని పెట్టి ప్లీజ్ బాబా నాకు సర్టిఫికెట్స్ కనిపించేలా చేయండి. అని కోరుకున్నాను.

సర్టిఫికెట్స్ లేవు కాబట్టి మా మామయ్యకు కూడా కాల్ చేసి “క్రిడా “లో J R F పోస్ట్ గురించి అడగలేదు.

కానీ ,తరువాత నాకు జాబ్ తప్పని సరి కాబట్టి బాబానే నా ఎడ్యుకేషన్స్ కి రిలేటెడ్ కానీ ఒక జాబ్ ఇప్పించారు.వాళ్ళు కనీసం నా సరిఫికేట్స్ఆ గురించి అడగనే లేదు. జాబ్ లో బాబా మార్క్ నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది.పెద్దగా పనేమిలేకుండా హ్యాపీ గా,ఉండేది.

ఆ మధ్యలో చాల మంది నా సరిఫికేట్స్ గురించి అడిగి బయపెట్టేవాళ్ళు.నేను నాకు అవసరమైనప్పుడు బాబానే ఇస్తారు అని చెప్పేదాన్ని.వాళ్ళు నవ్వుకునేవాళ్ళు పిచ్చినమ్మకం అని.

అప్పుడప్పుడు నాకు కూడా బయమేసేది. అప్పటికే రెండు సంవత్సరాలు అవుతుంది.కనిపించకుండా పోయి.సర్టిఫికెట్స్ లేవు కాబట్టి వేరే జాబ్ గురించి కనీసం ఆలోచించడం లేదు.అదే చిన్న దాన్లో ఉన్నాను.

బాబా ఇస్తాడు అని అనుకోవడం నిజంగానే నా పిచ్చితనం ఏమో అని అనిపించేది.కానీ పోలీస్ కంప్లైంట్,కాలేజ్ లో కంప్లైంట్ ఇవ్వాలి.పీజీ..సర్టిఫికెట్స్ కోసం తమిళనాడుకి వెళ్లాల్సి వస్తది.(నా పీజీ అక్కడే )అంత దూరం ఇంట్లో చెప్పకుండా వెళ్ళలేను.చెబితే తిడతారు. సర్టిఫికెట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవా అని. ఏమి చేయలేక ఏడుపు వచ్చేది.

అయినా బాబా చెప్పిన జాబ్ కి ఇంకా టైం ఉందిగా,అవసరమైనప్పుడు బాబా ఇస్తారులే అని ఒక నమ్మకంతో ఉండేదాన్ని.మనం యెంత నమ్మకంతో ఉన్న మన నమ్మకాన్ని వమ్ముచేయడానికి ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు నేను పట్టించుకోలేదు.

అలా రెండున్నర సంవత్సరాల తరువాత ,నాకు బాబా ,శరత్ బాబూజీ గారిని గురువుగా ఇచ్చారు.నేను గురువుగారిని నమ్మి తనని ఇష్టపడుతున్న కొన్నిరోజులకి, దసరా వచ్చింది..

(ఆ రెండురోజుల ముందే మా చెల్లికి చెప్పాల్సి వచ్చింది సర్టిఫికెట్స్ గురించి అది కూడా మళ్ళీ 2 ఇయర్స్ నుండి అంటే తను కూడా నాకు క్లాస్ తీసుకుంటది అని,పదిరోజులనుండి కనిపించట్లేదు అని చెప్పా.)

సో ,తనకి తెలుసు కాబట్టి.దసరా రోజు మా నాన్న నిద్రపోతున్న టైం లో నా దగ్గరకి వచ్చి. ఒక సారి బీరువా లో చెక్ చేసుకో, మళ్ళీ నాన్న లేస్తే దేనికోసం చూస్తున్నావు అని అడుగుతాడుఅంది.

నేను చాలాసార్లు చూసాను లేవు.అని చెపితే మళ్ళీ ఒకసారి చూడు అంది సరేలే తన కోసం చూద్దాం అనుకుని,ఎలాగూ బీరువాలో ఉండవని తెలుసు కానీ, బాబా,గురువుగారి ఫొటోస్ దగ్గరికి వెళ్లి బీరువాలో సర్టిఫికెట్స్ ఉండవు అని నాకు తెలుసు,కానీ అవి ఎక్కడున్నాయో మీకు తెలుసు.అవి ఎక్కడున్నా కూడా వాటిని తెచ్చి ఈ నిమిషంలోనే బీరువాలో పెట్టె సామర్థ్యం మీకు ఉంది. సో ప్లీజ్ వాటిని బీరువాలో పెట్టారా! నేను ఓపెన్ చేసి ఎక్కువ వెతకకుండానే పైపైనే కనపడేలా చేయరా ప్లీజ్! దసరా మీ సమాధి రోజు కదా ఈ రోజు నేను మిమ్మల్ని ఈ గిఫ్ట్ అడుగుతున్నాను.అని బాబాని,మళ్ళీ గురువుగారితో గురువుగారు బాబా సమాధిచెందిన రోజు విజయదశమి రోజు.అందరికి ఇంపార్టెంట్ రోజు కాబట్టి నేను గిఫ్ట్ అడుగుతున్నాను.నాకు గిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్, ప్లీజ్ , అని మీరు ఇస్తారు అనే నమ్మకంతోనే బీరువా ఓపెన్ చేస్తున్నాను అని అడిగాను.

అలా అడిగి బీరువా ఓపెన్ చేశా.అదివరకే చాల సార్లు చూసా,అప్పుడు కనిపించనివి ఇప్పుడు కానిపిస్తాయా?అని ఒక వైపు..మళ్ళీ నాకు బాబా గురువుగారు ఇచ్చిన ఎక్సపీరియన్సు గుర్తుకువచ్చి.దసరా రోజు గిఫ్ట్ అడిగా కదా ఇస్తారేమో అని ఆశ ఒకవైపు..బీరువాలో వెతుకుతున్నా. రాక్ లో నేను కోరుకున్న విదంగానే ఎక్కువ సేపు వెతకకుండానే పైపైన నేను ఏ కవర్ లో పెట్టానో అదే బ్రౌన్ కవర్ చివరన సర్టిఫికెట్స్ కనిపించాయి..అప్పుడు చూడాలి నా ఆనందం.వెళ్లి మా చెల్లికి చెప్పా సర్టిఫికెట్స్ ఉన్నాయి అని.

నా ఎక్సప్రెషన్స్ కి నవ్వుకుంటూ,బీరువాలో పెట్టి మర్చిపోయి ఉంటావు దానికే అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నావ్ ఏంటి అని అంది..దానికేం తెలుసు నేను 2 ఇయర్స్ నుండి వెతుకుతున్నాను అని.

తనకి బాబా మీద నమ్మకం లేదు అందుకే ఏమి చెప్పలేదు కానీ మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చేప్పాను.అందరూ అలా ఎలా జరిగింది.అని ఆశ్ఛర్య పోయారు

.మారుతికి కాల్ చేస్తే ఏదో నువ్వు ఆరోజు బాధపడుతున్నావు అని అలా చేప్పాను కానీ,నాకు అంత నమ్మకం లేదు.సర్టిఫికెట్స్ ఇలా కనిపిస్తాయి అని హ్యాపీగా ఫీల్ అయింది…

కొసమెరుపు ఏంటంటే నాకు సర్టిఫికెట్స్ కనిపించిన కొన్ని రోజులకే నేను వర్క్ చేస్తున్న కంపెనీ లాస్ లో ఉండి కంపనీ ని తీసేసారు.

తరువాతి భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నాకు అవసరమైనప్పుడు బాబానే ఇస్తారు

kishore Babu

Its really great for your patience…you are the example of patience…Sainathuni Prathibha….Sai Baba…Sai Baba.

prathibha sainathuni

tnq kishore garu..saibaba saibaba saibaba..

Sai Suresh

శ్రద్ధ, సహనం ఉండాలే గాని బాబా అనుగ్రహానికి లోటేమిటి? మీ అనుభవాలు ఏంతో బాగున్నాయి. బాబా మీ పై కురిపించిన ఆ ప్రేమ జల్లులలో నేను తడిసి ముద్దవుతున్నాను. బాబా ప్రేమ ని ఆస్వాదిస్తున్నాను సాయి.

prathibha sainathuni

tnq suresh garu..

సాయినాథుని ప్రణతి

చాలా ఆనందిస్తునాను మి అనుభవాలు చదువుతు .జై సాయినాథా, జై గురుదేవా

prathibha sainathuni

tnq pranathi..

Sai bhavana

Sairam.. I am learning to have Shraddha and Saburi by your precious experiences.. No words for your faith and patience.. Thank you Baba to make me read her experiences… JAI SAIRAM.. JAI GURUDEVA

prathibha sainathuni

tnq bhavana..

Maruthi.Velaga

Jai Saibaba..Happy ga vundi sis,Nea anubhavalu chaduvuthunte..Thank U.

prathibha sainathuni

tnq maruthi…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles