కళ్ళు పెద్దగా తెరిచి రోడ్డు మీద పరిగెత్తుతూ ,ఎగురుతూ,పెద్దపెద్దగా నవ్వుతూ నడుస్తుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

ఒకరోజు హాస్టల్ లో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో కూచున్నాను.వాళ్ళ పక్క రూమ్ అమ్మాయి శ్రావణి అనే అమ్మాయి కూడా వచ్చింది .నాకు తనతో ఎక్కువగా పరిచయం లేదు.మాటలలో తాను నాతో,నువ్వు రోజు గుడికి వెళుతుంటావు కదా,ఇకనుండి ఆలా రోజు వెళ్ళకు అంది.

నేను ఏ ఎందుకు వెళ్ళద్దు .అని అడిగితే, ఆలా రోజూ గుడికి వెళ్ళవద్దు.వెళితే అందరు తప్పుగా అనుకుంటారు అంది.నేను దాన్లో తప్పేం ఉంది వెళ్ళేది గుడికే కదా అని అన్నాను.అదే చెబుతున్నాను. రోజు గుడికి వెళ్ళద్దు,నీ మంచికోసం చెపుతున్నాను,ఇక నీ ఇష్టం అంది.

నేను సరేలే నువ్వు అలా అంటున్నావని నేనేమి అనుకోవట్లేదు కానీ, నాకు రోజు గుడికి వెళ్లడం ఇష్టం.నేను వెళతాను.ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను అని చెప్పా.

దానికి ఆమె వేళాకోళంగా నవ్వి, ఔనూ నీకు బాబా అంటే ఇష్టమా అని అడిగింది.అవును అన్నాను.అసలు బాబా నిజంగా ఉన్నాడంటావా,అసలు దేవుడేనా ? అని అంది.

నేను బాబా ని నమ్ముతాను అంటే,అసలు బాబా టెంపుల్స్ అన్ని ఊర్లల్లో ఉంటాయా?మా ఊరిలో ఐతే బాబా టెంపుల్స్ ఉండవు.మేము వేంకటేశ్వరుని నమ్ముతాము.అని అంది

.బాబా టెంపుల్స్ అన్ని ఊర్లల్లో ఉంటాయి.ఎవరి నమ్మకాలూ వాళ్ళవి,ఎవరిని ఏమనొద్దు అంటారు బాబా అని చెబితే ,ఓహో మీ బాబా అలా కూడా చెబుతారా అని వెటకారంగా అంది.నాకు బాధ అనిపించింది ఏంటి ఈ అమ్మాయి ఇలా అంటుందిఅని కానీ,ఏమి అనకుండా ఊరుకున్నాను.బాబాకి ఎవరినేమైనా అంటే నచ్చదు కదా అని.

కానీ, చాల బాధ అనిపించింది.సాయంత్రం గుడికి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చి బాబా నాకు చాల బాధగా అనిపిస్తుంది తాను ఎందుకు అలా అనాలి  .నేను తనలాగా ఒకరిని అనలేను. మీకు కూడా ,ఒకరితో గొడవపడితే ఇష్టం ఉండదు అని ఊరుకున్నాను.కానీ,మీరే తనకి పనిష్మెంట్ ఇవ్వండి.నాకు చాల బాధగా ఉంది అని అనుకున్నాను బాధలో,అనుకుని గుడికి వెళ్లి పోయా.తరువాత మర్చిపోయాను.

రెండు,మూడు రోజుల తరువాత సండే రోజు మద్యానం ఆరతి అటెండ్ అయి వచ్చి మెస్ లో భోజనం చేస్తున్న టైం లో ,నా ముందు నుండే ఆ అమ్మాయి హాస్టల్ఆంటీ వాళ్ళ రూమ్ లో దేవుడి విగ్రహాల దగ్గరకి వెళ్లి దణ్ణం పెట్టుకుని అక్కడే బెడ్ మీద పడుకుంది,2 నిమిషాల తరువాత హాస్టల్ఆంటీ ఆమెకు మజ్జిగ తీసుకెళ్లి తాగిస్తుంది.

నేను ఇవన్నీ చూస్తున్న, కానీ బాబా ని అలా అంది కదా తనేం చేసుకుంటే నాకెందుకు అని పట్టించుకోలేదు.అలా 2 ,3 నిమిషాల తరువాత ఆమె ఒక్కసారిగా బాబా బాబా అని పెద్దగా అరుస్తూ ఉంది.

నేను ఏమిటి బాబా అని అరుస్తుంది అని అనుకున్నాను.అందరూ ఆ రూమ్ కి వెళ్లి చూస్తున్నారు.నేను పట్టించుకోకుండా భోజనం చేస్తున్నా,కానీ ఆమె గట్టిగా చాల సేపటినుండి అలా అంటుండడంతో, ఏంటి అని ప్లేట్ అక్కడే పెట్టి లోపలి వెళ్లి చూసే సరికి బెడ్ మీద పడుకుని ఎటు వైపో దిక్కులు చూస్తూ బాబా,బాబా అని అరుస్తుంది.

అక్కడున్న వాళ్ళు బాబా ఎక్కడున్నారు అంటే అదిగో అక్కడున్నారు,నన్ను చూసి నవ్వుతున్నారు అని అటు చూపిస్తూ చెబుతుంది.అందరూ ఆమెకు బాబా కనిపిస్తున్నారు అని అనుకుంటున్నారు.

నేను నిజమేనేమో అనుకున్నాను.ఆ శ్రావణి వాళ్ళ కజిన్ బయపడి వాళ్ళ అన్నయ్యకు కాల్ చేసి ,మాట్లాడమని ఇచ్చింది.తాను వాళ్ళన్నయ్యతో బాబా బాబా అంటుంది భయం తో.వాళ్ళ అన్నయ్య బాబా లేడు ఏమి లేడు వెళ్లి రెస్ట్ తీసుకో అంటే, గాట్టిగా అరుస్తూ లేదు బాబా ఉన్నాడు,నేను చూసాను ,నన్నుచూసి నవ్వుతున్నాడు అంది.

అలా బెడ్ పైన పడుకుని బాబా బాబా బాబా అంటూనే ఉంది శ్వాసకూడా పీల్చుకోకుండా,నోరు పూర్తిగా వంకర పోయింది.నాకు బయమేసింది ఏంటి ఇలా చేస్తుంది అని.

మా హాస్టల్ ఆంటీ నాతో ఏరా ఈమెని బాబా గుడికి తెసుకుకెళదామా అంటే.ముందు ఆమెకి గుడికి రావడం ఇష్టమా లేదా అని కనుక్కోండి. వస్తాను అంటే తీసుకెళదాం అన్నాను.

ఆ అమ్మాయిని అడిగితే ఒక్కసారిగా లేచి ఆ వెళ్దాం వెళ్దాం,అనిలేచింది.అక్కడున్న చిన్న బాబా విగ్రహాన్ని ఆంటీ ఇస్తే బుజ్జి బాబా,బుజ్జి బాబా అని అనుకుంటూ బాబా విగ్రహాన్ని గిచ్చుతుంది .

అప్పుడు ఆంటీ ఇలా చెప్పింది.నిన్న హాస్టల్ ఫీ ఇవ్వడానికి వచ్చినప్పుడు, ఈ చిన్న బాబా విగ్రహాన్ని చూసి,మీరుకూడా బాబా ని నమ్ముతారా అంది.నేను అవును అంటే చాలామంది నమ్ముతారు.అన్ని ఊర్లలో బాబా టెంపుల్స్ ఉంటాయా? అని అడిగింది.నేను ఈమేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నాను.నిన్న ఏ టైం కి ఇలా అందో అదే టైం కి వచ్చి, కళ్ళుతిరుగుతున్నై అని పడుకుంటే ,బీపీ ఏమైనా తగ్గిందేమో అని మజ్జిగ ఇచ్చాను.తరువాత ఇలా చేస్తుంది అని  చెప్పింది.

సరే ఈమేని గుడికి తీసుకువెళ్ళురా అక్కడికి వెళ్ళాక అయినా తగ్గుతాదేమో అని ఆంటీ చెబితే నేను సరే, అని టెంపుల్ కి వెళ్తున్నాం,హాస్టల్ పిల్లలు చాల మంది వెంట వస్తున్నారు.

టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి పెద్ద పెద్దగా అడుగులేస్తూ చేతులు అటు ఇటు ఊపుతూ ,కళ్ళు పెద్దగా తెరిచి రోడ్డు మీద పరిగెత్తుతూ ,ఎగురుతూ,పెద్దపెద్దగా నవ్వుతూ నడుస్తుంది.

హాస్టల్ అమ్మాయిలు అందరూ ఆమెకు బాబా పూనాడు.ఆమె చాల లక్కీ అంటున్నారు.నాకు ఇదంతా చూస్తుంటే ఏడుపు వస్తుంది.బాబా ఎవరిలో పూని ఇలా పిచ్చిగా చేయడు.ఈమె ఎందుకు ఇలా చేస్తుందో తెలియదు కానీ, అందరూ అంటున్నారు బాబా ని పునాడు అని. బాబా ఎందుకు ఇలా పిచ్చిగా చేస్తారు.కానీ చెపితే ఎవరు వినరు అని ఊరుకున్నాను.

టెంపుల్ కి వెళ్లేసరికి అప్పటికే ఆరతి అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసి ఉంది. పూజారికి ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్పాడు.ఆమె వెళ్లి డోర్ దగ్గర కూచుంది.

మిగిలిన అమ్మాయిలు డోర్ క్లోజ్ ఉందిగా ఎలా అని ఆ అమ్మాయిని అడిగితే ,బాబా నన్ను రమ్మన్నాడు.పూజారి వస్తున్నాడు డోర్ తీస్తాడు,నేను లోపలి వెళతాను అని అంది.

పూజారి వచ్చి,నాతో డోర్ ఓపెన్ చేయడం కుదరదు సాయంత్రం మే ఓపెన్ చేస్తాము,అన్నాడు.నేను అదేంటి పాపం తాను మీరొచ్చి డోర్ తెరుస్తారు,వెళ్లి బాబా ని దర్శనం చేసుకుంటాను అని డోర్ దగ్గరే కూచుంది.మీరేమో కుదరదు అంటున్నారు ఇప్పుడెలా? అని అంటే అవి రూల్స్ అండి, ఏమి చేయలేము అన్నాడు.

అంతలో ఆ అమ్మాయి సరేలే వద్దులే హాస్టల్ కి వెళదాం అంది.నాకు చాలాసేపటి నుండి దర్శనం చేసుకుందాం అని వెయిట్ చేసి పాపం ఇప్పుడు చూడకుండానే వెళ్లాల్సి వస్తుంది ఈమెకి అని బాధనిపించి,పూజారితో కనీసం విండో నుండి అయినా చూడొచ్చా తాను అని అడిగితే,చూడొచ్చు అన్నాడు నేను వెళ్లి బయటి నుండి విండోస్ ఓపెన్ చేసి తనకి చూపిస్తే చూసి దణ్ణం పెట్టుకుని స్టెప్స్ దిగి కిందకి వెళ్ళింది.

నేను పూజారితో మాట్లాడుతూ ఉండిపోయా.స్టెప్స్ దిగగానే ఆమెకి ఇంతకు ముందు జరిగింది ఏమి గుర్తులేదట.

ఏంజరిగింది,ఇక్కడికెలావచ్చాను.మీరందరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగిందట.ఏమి లేదు అని అందరూ అంటుంటే లేదు అందరూ నావంక అదోలా చూస్తున్నారు.అంటే జరిగింది చెప్పారట.ఆమె షేమ్ గ ఫీల్ అయి, నాకెందుకు ఇలా జరిగింది?.అందరూ నేను కావాలని చేశాను అనుకుంటారు.నాకు ఏమి గుర్తులేదు అని చెప్పిందట.

కొందరేమో ఆమెకి బాబా పునాడు అదృష్టవంతురాలు అనుకున్నారు.కొందరేమో కావాలని ఓవర్ ఆక్షన్స్ చేస్తుంది అనుకున్నారు.

నాకు రెండు నమ్మాలనిపించలేదు.ఎందుకంటె బాబా అలా పూనడు అని నా నమ్మకం.ఆ అమ్మాయి కూడా కావాలని చేసి ఉండదు.అలా రోడ్డుపై పిచ్చిగా గంతులు వేసే టైపు కాదు తాను .బాబా కనిపించి ఉంటారు అది తట్టుకోలేక అలా చేసిందేమో, ఏమైనా లక్కీ నే తాను అనుకున్నాను .

మా టెంపుల్ ఫ్రెండ్స్ కి చెపితే ఆరోజు నిన్ను అలా అంది కదా. బాబా తన భక్తులని ఏమైనా అంటే ఊరుకోడు అన్నారు

.నాకు డౌట్ వచ్చింది.బాబా తను, నన్ను బాధపెట్టిందని ఇదంతా చేసారా ?ఎలా ఇది ఆమెకి పనిష్మెంట్ అవుతది.నాకైనా బాబా కలలోనే కనిపిస్తారు కానీ, తనకు రియల్ గానే కనిపించారు.అంటే నాకంటే తన మీదనే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కదా అనిపించింది.

బాబా కి తనంటే ఇష్టం కదా అని నేను తనతో ఫ్రెండ్ షిప్ చేయలేను,కానీ ఇక మీద తనేమన్నా నేను బాధపడకూడదు. ఏమి అనుకోవద్దు తనగురించి, అనుకుని బాబా అలా రియల్ గా నాకు కనిపిస్తే బాగుండు అనిపించింది.కానీ ఇప్పుడు అదృష్టం ఇంతవరకేమో అని ఊరుకున్నాను.

కానీ ఈ సంఘటన తరువాత ఆమె ఒకసారి టెంపుల్ కి వచ్చి వెళ్ళింది. అంతే కానీ ఇంకెప్పుడు రాలేదు. బాబా గురించి అసలు ఏంటి అని తెలుసుకోవడానికి సచ్చరిత్ర చదువుతూ కనిపించిందిఒకసారి.అంతే .

ఇది జరిగి ఆరు నెలల తరువాత విజయ్ అని ఒక టెంపుల్ ఫ్రెండ్ కి ఈ విషయం చెప్పినప్పుడు ఇది బాబా తనకి దర్శనం ఇచ్చినట్టు కాదు.

ఆమెకి బాబా నిజంగానే కనిపించారు.బాబా లేడు, అని పొగరుతో అన్నది కదా సో, తన నోటితోనే బాబా ఉన్నాడు అని చెప్పించారు,టెంపుల్ కి వెళ్లొద్దు అన్న తానే టెంపుల్ కి వెళదాం అనేలా చేసాడు.నిన్ను రోజు అలా టెంపుల్ కి వెళితే వేరేలా అనుకుంటారు అంది అంటే ఆమె మీనింగ్ పిచ్చిదానిలా అనుకుంటారు అని సో,అలా అన్న తననే రోడ్ మీద పిచ్చిదానిలాగా నడిచేలా చేసారు,తాను టెంపుల్ కి వెళ్ళింది కానీ డోర్ దగ్గర కూచుంది వెయిట్ చేసేలా చేసాడు.కానీ దర్శనం ఇవ్వలేదు.మల్లి నువ్వు విండో లో నుండి చూపిస్తే అప్పుడు చూడగలిగింది.

ఇదంతా చేసి లాస్ట్ కి స్టెప్స్ దిగి కిందకు రాగానే ఆమె అన్ని మర్చిపోయింది.దానితో పాటు ఆమె దర్శనం ని కూడా మర్చిపోయింది ఇది ఎలా అనుగ్రహం అవుతది.పనిష్మెంట్ అవుతది కానీ.ఇప్పటికైనా ఆమెలో ఏమైనా మార్పు వచ్చి బాబా అని నమ్మితే ,ఆమె సంస్కారానికి తగ్గట్టు ఆమెని బాబా అనుగ్రహిస్తారు అని చెప్పాడు.అప్పుడు నాకు నిజమే కదా అనిపించింది.

తరువాతి భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “కళ్ళు పెద్దగా తెరిచి రోడ్డు మీద పరిగెత్తుతూ ,ఎగురుతూ,పెద్దపెద్దగా నవ్వుతూ నడుస్తుంది.

Sai Suresh

wonderful experience sai

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles