Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
నీరాజనం , నీరాజనం ..ఆయన శత సంవత్సర సజీవ మహాసమాధికి నిండు నిజనీరాజనం.
*********
తియ్యగా మాటలుచెప్పి నమ్మించి ,లోకాన్ని బురిడీకొట్టించి , ఆస్తులు మూటకట్టుకోడం కొందరి నైజం ..
ప్రతి రక్తపుబొట్టును ఖర్చుపెట్టి , క్షణం తీరికలేకుండా , రేయింబవళ్లు కష్టబడి బిడ్డలకోసం ఆరాటపడి కూడబెట్టడం కొందరి స్వభావం ..
జీవితమన్నాక జరుగుతున్నదేకాక, జరగబోవు కాలానికి కూడా వెనకాముందూ జాగ్రత్తపడడం వివేకవంతుల లక్షణం ..
జాగ్రత్త అత్యాశగా మారి , డబ్బే జీవితం అనుకొంటు , పుట్టబోయేవారెవరో ముక్కూమొహం తెలియని తరతరాలకు కూడబెట్టాలనుకోడం అతి దుర్మార్గ లక్షణం అంటారు …
శరీరాన్ని కష్టపెట్టో , మరేయితర మార్గాల ద్వారానో అక్షరజ్ఞానం లేనివాడుకూడా అదృష్టం కలిసివొచ్చి ధనాన్ని పోగుచేసి , వూరూవాడను శాసించె స్థాయికి ఎదగవొచ్చుకానీ తల్లి పెంపకంలోనూ , ఒక ఉత్తమమయిన మహాత్ముని శిక్షణలో మెలగక , ఉత్తమ సంస్కారాలు అలవడడం కష్టమే ..
బాబా లీలలు ప్రకటమౌతున్న క్రమంలో ఆశ్రయించేవారి సంఖ్యా , అందుకనుగుణంగా కొందరు సమర్పించుకున్న దక్షణలు , బూటీలాంటి కోటీశ్వరులను మరో విధంగా ఉపయోగించుకుని ఉంటె , ఆయన మహాసమాధి అనంతరం , ఆయన ప్రబోధాలకన్నా, ఆయన కూడపెట్టిన సొత్తుకు ఎవరికివాళ్లు వారసులమంటూ ఎన్ని సమస్యలు తలెత్తుండేవో, అడుగుపెట్టినప్పుడు ఆయనతో ఏ వస్తులున్నాయో , ఆయన శరీరం చాలించేసమయానికి కూడా అంతకుతప్ప ఆయన కూడపెట్టిన ఆస్థులంటూ ఏమీలేవు , శాశ్వతంగా ఆయన లోకానికి అందించిన ఉత్తమోత్తమైన జ్ఞానబాండంతప్ప …
కూడుకొన్న ఆస్తులు ఏదోరూపంలో కరిగి భిక్షగాళ్లయిన సంఘటనలు ఎన్నో ఉండొచ్చు కాని ఒక సద్గురును ఆశ్రయించి , ఉత్తమ సంస్కారాలతొ జీవనవిధానాన్ని మలచుకొని లోకానికి ఆదర్శులై చరిత్రకెక్కినవారు గతచరిత్రలొ ఎందరో ..
వెనకటి సద్గ్రంథాలను ఎన్నిపరిశీలించినా , అద్భుతాలను సృష్టించి ఆకర్షించినవారు , ఆడంబరాలను ప్రదర్శించిన నిజమహాత్ములెవరూ గతంలో కనిపించరు ..
ప్రతి మహాత్ముడు లోకందృష్టిలో సగటు సాధకుల్లా ఆచరించి , మార్గాన్ని అందించినవారే.
ఒక మహాత్ముని జీవిత చరిత్రను విశ్వసించి పారాయణచేసి , అవగాహనచేసుకొంటే , అది ఆ మహాత్ముని సశరీరంగా సేవించిన ఫలితమిస్తుందంటారు .. ” నాకూ , నా సచ్చరిత్రకు తెడాలేదన్నారు బాబా …
మహాత్ములు మొదలూ మనిషి , మరేతర జీవరాసులుసైతం ఉద్భవించి , నిష్క్రమించడం సృష్టిలో నిరాటంకంగా సాగుతున్న ప్రక్రియ ..
లోకాన్ని శాసించి పాలించిన చక్రవర్తులమొదలూ చీమ దోమలైనా పంచభూతాలకు ఆహుతై పోయినవారే ..
రామాయణం ఆదరింపబడినంతవరకు రాములవారు సజీవంగా ఉన్నట్టే ,బాబా తత్వంకూడా మనసావాచా , ఆచరిస్తూ , ఆదరించినంతకాలం ఆయన మహాసమాధి సజీవంగా సమాధానం ఇస్తూనే ఉంటుంది ..
” నాకూ , నా సచ్చరిత్రకూ తేడాలేదు , ఎక్కడ ఆదరింపబడుతుందో , అక్కడ నేను నిత్యనివాసముంటాను ” అని లోకానికి బాబా అందించిన దివ్య సందేశం ..అనుసరించి అభ్యున్నతిని పొందినవారికి , కదిలే సమాధిలో సజీవదర్శన అనుభవాలు, ఆత్మానుభూతినీ కలిగినవారు ఎందరో .. ఇదే ఆయన శతసంవత్సర సజీవమహాసమాధికి ప్రతిఒక్కరూ సమర్పించదగ్గ నిండు నీరాజనం అని నా ప్రఘాఢభావన …
జయ్ జయ్ సాయి సమర్థ
*******
Latest Miracles:
- చేయెత్తి జై కొట్టు తెలుగోడా! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 26
- జనార్ధన్ గల్వంకర్
- నాకు కష్టమైన,నష్టమైనా ఇష్టమైనా కూడా అది బాబానే అయి ఉండాలి, కానీ వేరొకరు కాదు
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- శ్రీ శివస్వరూపము – సాయి (8 వ. భాగము)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments