Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
సంకల్పాలు సరిగాఉంటే ఆ జన్మలెప్పుడూ క్షేమమే,పరులసొత్తును ఆశించినవాడికి ఎన్నటికైనా అధోగతి తప్పదు.
*******
నారు పొసినవాడు నీరుపోయడా అన్నదో సూక్తి ..
ఎప్పుడయినా కాస్త క్లిష్టపరిస్థితులు ఏర్పడితే , పాతరోజుల్లొ ఎన్నో సార్లు ఓదార్పు మాటల్లో వినబడుతూండేది ..
నిజానికి సంసారానికి కర్త , భరించే భర్త ..వీడు ఏ ఉద్యోగమో , కూలీనాలోచేసి కుటుంభాన్ని పోషించవలసిన బాధ్యతను నిర్వహిస్తాడు ..ఆ ఒచ్చిన వొరుమానంతో సంసారాన్ని చక్కదిద్దుకొంటూ , ఇంటి బాధ్యతను నిర్వహించుకోవలసింది ఆ ఇంటి యిల్లాలే ..
ఇప్పుడు కాలంలొ కాస్త మార్పులు వొచ్చివుండవొచ్చుకాని అనాదిగా వొస్తున్న పద్దతి అదే ..
భగవంతుడొక్కడే పురుషుడు ..లోకాచారంలో స్త్రీ పురుష లింగబేధాలున్నాయితప్ప , ప్రకృతిపై ఆధారపడిన మనిషి మొదలు ప్రతి జీవి స్త్రీయే , పరమాత్ముడే పురుషుడు అంటుంది వేదం .
సూర్యచంద్రులు మొదలూ చరాచరజీవరాశులు కంటికెదురుగా కదలాడే ప్రకృతిలో ఒక భాగమే ..
ఈ ప్రకృతికి ఆధారం , సృష్టికి మూలం పరమాత్ముడే ఆధారం అన్నది వేదసారం ..
ప్రకృతిపై ఆధారపడక ఏ జీవికి మనుగడన్నది లేదు ..
మనిషితప్ప ప్రతిజీవి నిర్ధేశించిన ఉపాధితోనే అనాదిగా గీతదాటక ప్రవర్తిస్తున్నాయి.
తన హద్దులుదాటి ప్రయత్నంచేస్తూ నిలకడను కోల్పోతున్నది మనిషొక్కడె …
ఉపాధికి ప్రకృతిలో అనేకమార్గాలున్నాయి ..
మనిషి తనప్రయత్నంతో , నీతిదాటకుండా ఉపాధిని పొందేందుకు ఎన్నో మార్గాలున్నా , కొన్ని వ్యక్తిత్వాలు పరులసొమ్ముకోసం కుటిల ప్రయత్నాలు చేస్తుంటారు .. పరుల సొత్తే పరమావధిగా భావిస్తుంటారు ..
స్వశక్తిని ఉపయోగించుకొనే జ్ఞానం ఉన్నా , మాటలతో మాయచేస్తూ, అధ్యాత్మిక మార్గం మొదలూ నిత్య జీవితాలతొ కూడా అక్రమంగా సంపాదించుకొనే సులువైన మార్గాన్ని ఎంచుకొంటూ ఉంటారు ..లోకం ఎటుపోతేనేం , నేను బాగుంటే చాలన్న లక్ష్యంతోనే బతికిపోతుంటారు ..
సృష్టి అని క్రమంలో నారుని నాటి , ఆధారమనే నీరుగా ప్రకృతిని ప్రసాదించాడు .. ఆ ఫలాన్ని నిజాయతీగా ప్రయత్నంచేసి సాధించుకొంటే ఉత్తమ ఫలితాన్ని అందించగలదు ..
పెడమార్గంలో సంకల్పాలు మొదలయితే వొగచి,వేసారినా ఓదార్చే నా అన్నవారు కనుచూపుకు కరువౌతారని పెద్దలమాట …
జయ్ గరుభ్యోన్నమః
Latest Miracles:
- ఆ వ్యక్తీ రూపంలో వచ్చింది బాబాయేనా?
- ఆ TE కూడా తన వైపు చూస్తూ నవ్వి ఆ ముస్లిం ఫకీరు ఖాళీ చేసిన సీట్ లో కూర్చోమన్నారు.
- అప్పటికి గాని ఆ వృద్ధుడు సాక్షాత్ బాబా అని నాకు తెలియలేదు
- నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు
- ఆ పనిని గొప్పగా ప్రేమించి, సంపూర్ణముగా చేస్తూ ఆనందిస్తూ ఉంటాను.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments