భక్తి,జ్ఞానం మరియు వైరాగ్యం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

ఎంతనేర్చినగాని ఇంకెంతో ఉన్నదని , ఎరుకగా ఉండవే మనసా !
******

ఉపాదికోసం చదువు , ముక్తికోసం భక్తి అంటారు …

ఏ స్థాయి ఉద్యోగస్థుడైనా , ఎంత తెలివికలవాడైనా తొలుత వాడి చదువు , అక్షరాలు దిద్దడంతో ప్రారంభంకావలసిందే ..

పలకా బలపం పట్టిన క్షణంలోనే , మావాడు ఫలాన ఉద్యొగం చేస్తాడని ఏ తల్లీతండ్రీ ప్రకటించుకొన్నా అంతకన్నా తెలితక్కువ , హాస్యాస్పదవిషయం మరొకటి ఉండదు ..

చదువనేది ధ్యేయం , ఉద్యోగం అన్నది అర్హతనుబట్టి ఒనగూరే అవకాశం ..

చదువు మీద దృష్టిపెట్టకుండా , ఎప్పటికో రాబోయే ఉద్యగం ఇలా ఉండాలని ముందే ఊహించుకొని పగటికలలుకంటే , ఉద్యోగం సంగతి అటుంచి చదువుమీద దృష్టికుదరడం కూడా దుర్లభమే ..

అందరూ ఒకే విద్యావిధానాన్ని కొనసాగించినా , బాగా పైచదువులుచదివినా , ఒకడు గుమాస్తాగిరీ ఉద్యోగార్హతను పొందెవాడుంటే మరొకడు కలెక్టరు స్థాయి ఉద్యోగాన్ని పొందుతుంటారు ..

చదువులు నేర్పే విద్యాసంస్థలు , బోధించే ఉపాధ్యాయులు వేరుకావొచ్చుకానీ , ఎక్కడ చదివినా అదే సైన్సు , అదే లెక్కలూ తప్ప , విధ్యానిబంధనలకు మించి ప్రత్యేకమైన అక్షరాలు , ప్రత్యేక బోధనలూ ఎక్కడా ఉండవు ..

బోధనావిధానం ఒకటే అయినా , చదివే విద్యార్థికి ఉన్న ఆసక్తి ,శ్రద్ధను అనుసరించే వొంటబడుతుంది .

తల్లీతండ్రులు బలవంతపెట్టినా , ఆచార్యుడు నాలుగుచీవాట్లుపెట్టినా , విద్యార్థి తనకు తాను ప్రయత్నంలో పట్టులేక చదువుకొనసాగడం కష్టమే …

భక్తి , జ్ఞాన , వైరాగ్యమంటారు ..

భక్తి , జ్ఞానం అనంతమైన సముద్రంతో పోలుస్తారు ..

భక్తి కుదిరి , ఆశక్తికి అంకురార్పణ మొదలయితే మనసు అన్వేషణలోపడడమే జ్ఞానం అంటారు

జ్ఞానానికి నిర్వచనం తెలియని ఆద్యాత్మిక విషయాలపట్ల దృష్టిని యినుమడించడమే అంటారు ..

విద్యావ్యవస్థలో ప్రగతి సాదించినవారు ఎందరున్నా , అన్వేషణలో శిఖరాగ్రాన్నిచేరి , చంద్రమండలంలో సయితం అడుగుపెట్టగలవారు కోట్లమందిలో ఒకరే ఉంటారు ..

ఇదే భగద్గీతలో ఆచార్యుని సందేశంలోకూడా వినబడతుంది ” కోటాను కోట్లమందిలో ఏవొక్కడో నన్ను తెలుసుకోగలడు , ఆ తెలిసిన కోట్లమందిలో ఏఒక్కడో నన్ను చేరగలడు ” అని ..

ఆద్యాత్మిక సాధనకు కూడా ఒక అంతమన్నది లేదంటారు,జ్ఞానాభిలాష పెరిగేకొద్దీ , అడుగడుగునా మనసుకు ఓ కొత్త అనుభవం అందుతూనే ఉంటుంది …

ఏక్షణానికి ఆ క్షణం ఎంతో తేలిసిపోయినట్లపిస్తుంటుంది .

గతాన్ని , వర్తమానంతో పోల్చుకొంటే , సాధించవలసింది ఎంతో ఉందని అర్థమౌతుంది ..

అందుకే పెద్దలంటారు” ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగి , ఎంతసాధించినా , పైవాడి దృష్టిలో వాడు నిత్యవిద్యార్ధే అని

సాయి గురుదేవ సమర్థ
******

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles