Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
హద్దులుమీరి ప్రవర్తిస్తే , చివరకి చేదు అనుభవాలే మిగులుతాయి
********
రెండు మతాలను ఏకంచేసి , ఎవరు ఏ సాంప్రదాయాన్ని పాటించినా , ఏమతంవారైనా , మానవత్వాన్ని మరువక , అందరూ సాటి మనుషులే అని , ఒకరినొకరు గౌరవించుకొనే ఒక విశిష్ట సాంప్రదాయాన్ని అందించారు సాయి …
మతోన్మాదంతో చెలరేగిపోయి , విశిష్టమైన ఆలయాలనే రూపులేకుండా చేశారు ఒకప్పుడు..
దాదాపుగా పన్నెండో శతాబ్దంలో ఒకే మతంలో శివుడుగొప్పా , విష్ణువుగొప్పా అని రెండువర్గాలలో వాదనలు వివాదాలై రాజ్యాలమధ్య యుద్ధాలకాడికి దారితీసి , నెత్తురు ఏరులైపారింది ..
మద్యలో పరదేశీయుల రాకతో మరో మతం ప్రాణం పోసుకొంది , దానిలో కూడా నాలుగు వర్గాలు , పది చీలికలు ప్రదర్శింపబడుతున్నాయి ….
అగ్రవర్ణాలు , అణగారినవర్గాలు , స్థాయీభేదాలు చరిత్రను తిప్పిచూస్తే ప్రతిమతంలోనూ దర్శనమిస్తాయి ..
ఏ మతానికి సంబంధించిన ఏ మూలగ్రంధాన్ని చదివి ఆకళింపుచేసుకొన్నా , ఏప్రవక్తా , ఏ సద్గురువు , ఏ పురాణముకూడా మనుషుల్లా బ్రతకమని ప్రభోదించాయితప్ప , రాక్షసత్వాన్ని రెచ్చగొట్టే ప్రబోధాలు ఎక్కడా కనిపించవు ..
మనిషి జీవనవిధానంలో ఉపాధిలక్షంగా , కీర్తి ప్రదానంగా పోటీలు పెరిగిపోతున్నాయి ,,
చదువులో అయినా , ఉపాధివిషయంలో అయినా ఒక మంచి స్థాయిని పొందాలని ఆశపడడం , ఆశయాన్ని తగ్గట్టు ప్రావీణ్యంలో పోటీపడటం ఆరోగ్యమైన సాంప్రదాయంకావొచ్చు ,
సాంప్రదాయాలను ఆదరించి , గౌరవించి , ప్రేమగా మందిరాలను నిర్మించుకొంటూ , ఆ తత్వాన్ని అనుభవానికితెచ్చుకొని , సభ్యతా,సంస్కాలను మెరుగుపరుచుకుని , యితరులకు మార్గదర్శకంగా ఉండాలి.
కావలసిన చోట్లకూడా , అధిక పెత్తనాలతో , కీర్తి దాహంతో ఒకరిని ఒకరు ద్వేషించుకోడం , ఎంతవరకు ఆయన ప్రబోధాలను అర్ధంచేసుకొంటున్నారు , ఎంతవరకు ఆయన అనుగ్రహానికి చేరువకాగలుతున్నారు అన్నది సందేహాత్మికమే ..
సాయి సచ్చరిత్రకు మూలకర్త హేమాద్రిపంతు , అటుతర్వాత బాబాతో బౌతికంగా గడిపిన అనునూయులనుండి విషయాలను ఎంతో శ్రమతీసుకొని సేకరించిన బీవీనరసింహస్వామి , ఆనాటి పాత సాయి లీలా పత్రికలలో యథార్థమైన సంఘటలు అందించబడ్డాయి తప్ప , ఇప్పుడు కొత్తగా అన్వేషించదగ్గవి నిజానికి అవకాశం ఎక్కడుంది ..
అత్యాశకుపోయి , ధనకాంక్షతో ఆహారపదార్ధాలలో కల్తీచేసినా క్షమార్హమేమోకానీ , మనిషికి మానవత్వాన్ని అందించి , సృష్టిధర్మాన్ని నేర్పె ఆద్యాత్మిక వితరణలోకూడా కల్తీలు మొదలయితే కాలనిర్ణయానికి పైవాడుకూడా బాధ్యతవహించడంటారు ..
ఎవరికి వారు మెట్టుదిగకుండా అహాన్ని ప్రదర్శిస్తే అది తత్వానికే చేటుకలిగించినవారౌతారు ..
సమభావంతో , సమిష్టి ప్రయత్నం చేయగలిగితే , అదే ఆయనకు చెయ్యగల నిత్యోపాసన అని పెద్దలమాట …..
శ్రీ గురుదేవ సమర్ధా
*****
Latest Miracles:
- బూటీ వాడా…..సాయి@366 అక్టోబర్ 16….Audio
- కొంత సమయం తరువాత పాప బ్రతికింది అందరూ బాబా లీలను చూసి ఆశ్చర్యపోయారు.
- నేను గొప్ప భక్తుడని అనే అహంకారము నాలో రాకుండా ఉంటేనే తగ్గించండి
- అందరూ బిడ్డలే! …..సాయి@366 ఆగస్టు 5…Audio
- పొద్దు పోలేదు! …. మహనీయులు – 2020… నవంబర్ 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments