Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ఒకరికి పెట్టకపోయినా తప్పులేదు కానీ , ఒకరి కడుపునుకొట్టేప్రయత్నం , ఆ కుటుంబాన్నే నడివీధిపాలు చేస్తుంది
***
దానం దర్మం , నీతి నిజయాతీలను గూర్చి , గత పురాణాలలో , సద్గ్రందాలలోని విషయాలను సేకరించి , ఇతరులకు నిరవధికంగా చెప్పడానికి ఒక సప్తాహం రోజులైనా సరిపోకపోవొచ్చు ..
సత్యహరిచ్చంద్రుడి నీతిని , రామచంద్రులవారి ధర్మాచరణను చెప్పేందుకు , వినేందికు ఎంతో బాగుంటుంది .. వారి ధర్మాచరణ ఒక్కరోజు స్వానుభవానికి తెచ్చుకుని భరించగలడం మాటలు చెప్పినంత తేలికైన విషయంకాదేమో ..
తండ్రికి యిచ్చినమాటముందు , పట్టాభిషేకం గడ్డిపరకతో సమానమైనది రాములవారికి,
ఒక ఋషికి యిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు కనీస సౌకర్యాలను త్యజించి , భార్యాబిడ్డలనుకూడా అనుకోకుండా కాటికాపరిగా మిగిలిపోయాడు సత్యహరిచ్చంద్రుడు..
బాగా పరపతి , ఒక స్థాయిలో ఉన్నవాడి చుట్టూ ఉపయోగించుకొనేవాళ్ళు ,అవసరాలని తీర్చుకొనేవాళ్ళు క్యూలో నిలబడతారుతప్ప , కాలం వక్రీకరిస్తే ఆదుకొని , ఉపయోగపడేవాళ్లు ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఉంటారంటే సందేహమే అనిచెప్పొచ్చు ..
వినినంత తెలికగా , మనో నైజాలు ఒక్కరోజులో మార్చుకోడం ఎవరితరమూ కాదు , విన్నది మననానికి అలవాటు పడితే , కనీసం అయా సందర్భాలలో గడిచిపోయే దోషాలను మనసుకు గ్రహించి, సరిదిద్దుకునే అవకాశం అయినా కలుగుతుంటారు ….
రెండు పూటలా తినగలిగే స్థాయిలో ఒకడుంటే , తరతరాలు అనుభవించగల స్థోమతవున్నవాడు ఒకడుంటాడు …
అన్ని జీవులకు , మనిషికున్నట్టే, ఆకలి దాహం ఒక్కటే, నీకు కలిగినదానిలో ఒక ముద్దనైనా వాటి కడుపునింపే ప్రయత్నంచేయ్ అంటారు సాయి..
బ్రేవుమని త్రెన్చేవాడికి కాదయ్యా , ఆకలితో అలమటించేవాడికి ఒక ముద్దను పెట్టడం నేర్చుకో అంటారు భగవాన్ వెంకయ్యస్వామి…
ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్న , కనీసం ఒక్క స్పూను పంచదారను నేలపై చల్లినా వెయ్యి చీమల ఆకలిని తీర్చినవాడవౌతావు అంటారు సమర్థులవారు..
కట్టెఉన్నంతవరకే కర్మను చేయగలుతాం ..
దానమైనా , ధర్మమైనా , నీతి నిజాయితీలను పాటించి , కనీసం కుటుంబానికి ఆదర్శంకావాలన్నా , అది శరీరం ఉన్నంతవరకే సాధ్యపడుతుంది ..
రాముడిని , హరిచ్చంద్ర , ధర్మరాజులను ఆదర్శంగా తీసుకోడం తప్పులేదుకాని , అందుకు తగ్గట్టు ఎవరికున్న పరిధులు ఎంతవరకు అన్న విచక్షణను అతిక్రమిస్తే , సహకరించే శరీరం ఉన్నా , సాయంచేయగలిగే ఉపాధి మృగ్యం కావొచ్చు ..
అనుకరణకు ఆచరణకు, ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం కనబడుతుంది ..
ఆశయాలు మంచివే కావొచ్చు , అందుకుతగ్గ పరిస్థితినిబట్టి ప్రవర్తనలేకుంటే , కర్తవ్యాలు కుంటుపడకతప్పవు .,
ఒక ప్రాణాపాయస్థితిలో ఉన్నవాడిని , ప్రాణాన్ని లెక్కచేయకుండా రక్షించే ప్రయత్నంచేయడం ఉత్తమలక్షణంకావొచ్చుకానీ , అయోగ్యులైనవారికి ఎన్నిచెప్పినా , ఎంతచేసినా , వాడి బలహీనతని పెంచిపోషించినట్టే , అడవిని కాచిన వెన్నెల్లా నిరర్థకమే అని పెద్దలమాట ..
శ్రీగురు చరణార్పణమస్తు
********
Latest Miracles:
- క్రీస్తు శకం – సాయి యుగం …..సాయి@366 డిసెంబర్ 25….Audio
- గూడు చేరిన పక్షి…..సాయి@366 జనవరి 26….Audio
- సన్నుతించు వేళ…..సాయి@366 జూన్ 12…Audio
- వీడ్కోలు పలుకులు …..సాయి@366 జూలై 13…Audio
- నీ పాదం గంగాయమున సంగమ సమానం….. సాయి@366 ఫిబ్రవరి 24….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments