సచ్చరిత్రకు , నాకూ తేడా తేడాలేదన్నారు సాయి ..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

రాగానికి తగ్గ తాళమెలాగో , ధ్యేయానికి తగ్గ ద్యాస మొదలయితే జన్మ తరించినట్లే
*****

ధ్యేయం ఎలా ఉంటుందో , ధ్యాస దానిపైనే లగ్నమౌతుంది ..

కొందరు డబ్బే  ప్రదానంగా ఒక ధ్యేయాన్ని పెట్టుకొంటారు ..

సంసారం , మంచీచెడ్డా పక్కనబెట్టి సంపాదనపైనే ప్రతిక్షణం దృష్టినిపెడతారు ..

కొందరు పారమార్ధిక సుఖాలవైపు దృష్టిని సారించి , మొక్షార్హతను సాధించుకునే ధ్యేయంలో నిమఘ్నమౌతుంటారు …

పరమార్ధాన్ని అందించే సద్గ్రంథాలను,ఆశించింది నెరవేరుతాయని ఫలాపేక్షతో లౌకికప్రయోజనాలే ధ్యేయంగా పెట్టుకొంటారు కొందరు …

లోకం పోకడ , లోకంలో తనవొంతు కర్తవ్యాన్ని గుర్తించిన ఏ కొందరో చివరితోడుపై ధ్యాసను నిలుపుతుంటారు ….

భాగవతం భక్తిని , రామాయణం థర్మాన్ని , భగవద్గీత మానసికోన్నతిని ప్రభోధిస్తాయి అంటారు అనుభవజ్ఞులు.

ఒక గ్రంథాన్ని ఫలాపేక్షతో చదవటం మొదలుపెడితే, ప్రతి నిమిషం “ద్యాస” అవసరాలని గుర్తుచేస్తుంటుంది ..

అది నిష్ఫలాపేక్షతో ప్రారంభమైతే , మనసు తనను తాను శుద్ధిచేసుకొంటూ , శుద్ధ మార్గాన్వేషణలో పడుతుంది ..

బియ్యం మొదలు ఉప్పూ , పప్పువరకూ ముడి పదార్ధాలను అందించడం ప్రకృతి ధర్మం ..

వాటిని ఎలా ఉపయోగించుకొని , షడ్రుచులను ఎలా ఆస్వాదించాలో అది మనిషి ప్రయత్నమే ..

అమ్మ ఎంతోరుచిగా వొడ్డించే మధురపదార్దాల వెనక ఆమెకు ఆ అనుభవం , ఆమె తల్లిచేసే వంటకాలపై దృష్టి లేక సంక్రమించదు .

పురాణాలలో ప్రతి అవతారం దుష్ట శిక్షణ , శిష్ట రక్షణా ధ్యేయాలతో అవతరించినవే ..

మానసిక కాలుష్యాలు , మతద్వేషాలను తొలగించి , మానవత్వాన్ని అందించే ధ్యేయంగా ప్రకటమైంది బాబా అవతారం ..

ఆయన ఒక ధ్యేయంతో ఉపాసనీబాబాను చేరదీసినా , కొంతకాలానికి ధ్యాసలో వైపల్యంచెంది చెప్పకుండా గ్రామాన్నే విడిచివెళ్ళాడు.

కోటీశ్వరుడైన బూటీ , వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు గడించిన కాకాసాహెబుదీక్షిత్ లాంటివారు , లౌకిక ప్రయోజనాలకోసం పాకులాడక , ఆయన ధ్యేయానికి తగ్గట్టు ధ్యాసనుంచి , జన్మరాహిత్యాన్ని పొందారు ..

భగవంతుడు ఒకటి తలిస్తే , మనిషి మరొకటి కోరుకొంటూఉంటాడు

సచ్చరిత్రకు , నాకూ తేడా తేడాలేదన్నారు సాయి .. ఎక్కడ తత్త్వం ఆదరింపబడుతుందో ,అక్కడ నా ఉనికి అనుభవానికి వొస్తుందని అన్నారు ..

ఆయన బోధలలో అందించిన ధ్యేయం , ఆశ్రయించినవారి ద్యాసలో భాగమైతే ఆయనను నమ్ముకొన్నవారికి యిహ , పరసౌఖ్యాలకు లోటన్నది ఎన్నటికి పొడచూపదని పెద్దల మాట …

శ్రీ సాయి గురుభ్యోనమః
*********

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles