Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!
This Audio prepared by Mr Sreenivas Murthy
- Art-1-యోగీశ్వరుల-కర్తవ్యము 2:43
భగవద్గీత చతుర్థాధ్యాయమున 7, 8, శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు.
“ధర్మము నశించునపుడు అధర్మము వృద్ధిపొందునపుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించెదను”.
ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు.
ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారి హక్కులను అపహరించునప్పుడు,
మతగురువులను గౌరవించక యవమానించునపుడు,
ఎవరును మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు,
ప్రతివాడును గొప్ప పండితుడనని యనుకొనునపుడు,
జనులు నిషిద్ధాహారములు త్రాగుడులకలవాటుపడినపుడు,
మతము పేరుతో కానిపనులు చేయునపుడు,
వేర్వేరు మతములవారు తమలోతాము కలహించునపుడు,
బ్రాహ్మణులు సంధ్యావందనము మానునపుడు,
సనాతనులు తమ మతాచారములు పాటించనపుడు,
ప్రజల ధనదారాసంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్షమార్గమును మరచునపుడు,
యొగీశ్వరులుద్భవించి వారి వాక్కాయకర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు.
వారు దీపస్తంభములవలె సహాయపడి, మనము నడువవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు.
ఈ విధముగనే
నివృత్తి,
జ్ఞానదేవు,
ముక్తాబాయి,
నామదేవు,
జానాబాయి,
గోరా,
గోణాయీ,
ఏకనాథుడు,
తుకారము,
నరహరి,
నర్సిబాయి,
సజన్ కా సాయి,
సాంవతమాలి,
రామదాసు
మొదలుగాగల యోగులను, తదితరులును వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి. అట్లే సాయిబాబా గూడ సకాలమందు శిరిడి చేరిరి.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము (వి రామ అరవింద్)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా ఆనందానికి అవధులు లేవు–Gopal Rao–17–Audio
- సాయి దాసు గారు బాబా ను ఆశ్రయించకముందున్న స్థితి.
- నవవిధ భక్తి సూత్రాలను వివరంగా చెప్పండి బాబా…లక్ష్మీబాయి.
- నీ ఇచ్ఛయే మా ఇచ్ఛ….సాయి@366 డిసెంబర్ 7….Audio
- వినదగు నెవ్వరు చెప్పిన …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments