Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!
This Audio prepared by Mr Sreenivas Murthy
- Mir-15 ఆగు, యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు 2:50
బాబాకు పంచభూతములు స్వాధీనమైనవని తెలుపు రెండు విషయములను వర్ణించిన పిమ్మట ఈ యధ్యామును ముగించెదము.
ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను.
గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను.
కొంతసేపటిలో నేలయంతయు నీటిలో మునిగెను. జీవకోటులన్నియు పక్షులు, జంతువులు, మనుష్యులు, మిక్కిలి భయపడిరి. తలదాచుకొనుట కందరు మసీదులో ప్రవేశించిరి.
షిరిడీలో అనేకస్థానిక దేవత లున్నను వారిని ఆదుకొనలేదు.
కావున వారందరు తుఫానును ఆపి వేయుడిని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను.
బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి, బిగ్గరగా నిట్లు గర్జించిరి.
“ఆగు, యాగు, నీ కోపమును తగ్గించు, నెమ్మదించు.” కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను.
తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరు సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి.
ఇంకొకప్పుడు మిట్టమధ్యాహ్నము ధునిలోని మంట యపరిమితముగా లేచెను; మసీదు వెన్ను పట్టీలవరకు పోవునట్లు గనిపించెను.
మసీదులో కూర్చొన్నవారి కేమి చేయుటకు తోచకుండెను. బాబాతో ధునిలో నీళ్ళు పోయుమని గాని మంటలు చల్లార్చుటకు మరేమైన సలహా నిచ్చుటకుగాని వారు భయపడుచుండిరి.
ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను.
తమ సటకాను (పొట్టి కఱ్ఱ) దీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచు ‘దిగు, దిగు, శాంతించుము’ అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు, మంటలు తగ్గి దిగిపోవుచు కొన్ని నిమిషములలో ధుని చల్లబడి మామూలుగా నుండుదానివలె శాంతించెను.
ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు, వారి పాదములపైబడి సాష్టాంగనమస్కారము చేసి సర్వస్యశరణాగతి వేడినవారినెల్ల రక్షించును.
ఎవరయితే భక్తి ప్రేమలతో నీ యధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టము లన్నిటినుండి విముక్తులగుదురు.
అంతేకాక సాయియందే యభిరుచి, భక్తి, కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు.
వారి కోరికలన్నియు నెరవేరును. తుదకు కోరికలను విడచినవారై, మోక్షమును సంపాదించెదరు
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- గుండె ఆపరేషన్ చేసిన బాబా–Audio
- అట్లు చేసిన శ్రీసాయిబాబా నీ కనుసన్నల మెలుగు సమయము రాగలదు అని చెప్పిరి–Audio
- బాబా వారు మాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు …..!
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments