Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
ఠక్కర్ ధరమ్సె జెఠాభాయి, హైకోర్టు ప్లీడరు కొక కంపెని గలదు. దానిలో కాకా మేనేజర్ గా పని చేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేకసారులు పోవుట, కొన్నిదినము లచటనుండి, తిరిగి బాబా యనుమతి పొంది వచ్చుట, మొదలగునవి ఠక్కరుకు తెలియును. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితోను, ఠక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా యెప్పుడు తిరిగి వచ్చునో యనునది నిశ్చయముగా తెలియదు కనుక ఠక్కరింకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలసి బయలుదేరిరి. బాబా కిచ్చుటకై కాకా రెండుసేర్ల యెండుద్రాక్షపండ్లు (గింజలతోనున్నవి) దారిలో కొనెను. వారు షిరిడీకి సరియైన వేళకు చేరి, బాబా దర్శనమునకయి మసీదుకు బోయిరి. అప్పుడక్కడ బాలాసాహెబు తర్ఖ డుండెను. ఠక్కరు మీరెందుకు వచ్చితిరని తర్ఖడ్ నడిగెను. దర్శనముకొరకని తర్ఖడ్ జవాబిచ్చెను. మహిమ లేమైన జరిగినవా యని ఠక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైన అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తర్ఖడ్ చెప్పెను.
కాకా బాబా పాదములకు నమస్కరించి యెండు ద్రాక్షపండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని యాజ్ఞాపించెను. ఠక్కరుకు కొన్నిద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుట కిష్టము లేదు. ఎందుచేత ననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహా యిచ్చియుండెను. ఇప్పుడాతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుట కిష్టములేదు. కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసికొనెను. గింజలనేమి చేయవలయునో తోచకుండెను. మసీదులో గింజ లుమ్మివేయుటకు జంకుచుండెను. తన యిష్టమునకు వ్యతిరేకముగ తుదకు తన జేబులోనే వేసికొనెను. బాబా యోగి యయినచో తనకు ద్రాక్షపండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతముగా నిచ్చెను? ఈ యోలోచన అతని మనస్సున తట్టగానే బాబా యింకను మరికొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి యాజ్ఞానుసారము తినగా, వానిలో గింజలు లేకుండెను. అందు కతడు మిగుల నాశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదను కొనెను గాన నాతనిపై నీ యద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలుగల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి యాశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్ఖడు కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. గింజలతోనున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పెను. ఠక్కరు ఆశ్చర్యపడెను. తనయందుద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి యైనచో, ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకా కివ్వవలె ననుకొనెను. అతని మనస్సు నందున్న యీ సంగతి కూడ గ్రహించి, బాబా కాకావద్దనుంచి యెండు ద్రాక్షల పంపిణి ప్రారంభింప వలయునని యాజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో ఠక్కరు సంతుష్టి చెందెను.
శ్యామా ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా యిట్లనెను. “అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలడు”. కాకా యీ జవాబుకు చాలా ప్రీతిచెందెను. తన మనోనిశ్చయము మరచి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను.మధ్యాహ్నహారతియైన పిమ్మటు, వారందరు బాబా సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. శ్యామా వారి పక్షమున మాట్లాడెను. బాబా యిట్లు చెప్పదొడంగెను.
“ఒక చంచలమనస్సుగల పెద్దమనుష్యు డుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడ నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన యారాటములు పైన వేసుకొని, యక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారము లన్నియు వదిలివేయుచుండెను; మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను, “నీ కిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకేచోట నాశ్రయించుకొని నిలకడగా నుండు” మని చెప్పితిని.”
వెంటనే ఠక్కరదియంతయు తన గూర్చియే యని గ్రహించెను. కాకా కూడ తన వెంట రావలె ననుకొనెను. కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కాజ్ఞ దొరకునని యెవ్వరనుకొనలేదు. బాబా దీనిని కూడ కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞ నిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ఠక్కరు కింకొక నిదర్శనము దొరికెను.
బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ యడిగి పుచ్చుకొని అతని కిట్లని చెప్పెను. “నేను ఒక రూపాయి దక్షిణ యెవరివద్దనుంచి గాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరకనే యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియకుండగ నే నెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయిపోవును. గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని, నీ విప్పు డనుభ వించలేవు. కనుక ధనమును పొందవలెననినచో. దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును.”
ఈ మాటలు విని, ఠక్కరు తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలయిన దనుకొనెను. ఏలన, అతని సంశయము లన్నియును తొలగెను. ఆతడెంతయో నేర్చుకొనెను.
అటువంటివారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి యమోఘమయినది. అన్ని బాబాయే చేయుచున్నను, దేనియందభిమాన ముంచలేదు. ఎవరయినను నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ యిచ్చినను, ఈయకున్నను తన కందరు సమానమే. బాబా యెవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించెడివారు కాదు. తనను పూజించలేదని విచారించెడువారు కాదు. వారు ద్వంద్వాతీతులు.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- కాకామహాజని (నీళ్ళ విరేచనములు)
- బాబాయే యజమాని మరేవరూ కాదు –Taarkad–Audio
- సాయి చూస్తున్నాడు జాగ్రత్త!…..సాయి@366 అక్టోబర్ 24….Audio
- కాకా మహాజని
- కాకా మహాజని స్నేహితుడు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments