కాకామహాజని (నీళ్ళ విరేచనములు)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!         శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

 కాకామహాజని యను నింకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబునిండ నీళ్ళు పోసి మసీదులో నొకమూలకు పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్ల పోవుచుండెను. బాబా సర్వజ్ఞుడగుటచే కాకా బాబా కేమి చెప్పకే, బాబాయే త్వరలో బాగుచేయునని నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపనచేయుటకు బాబా సమ్మతించెను; కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరచెను. అందరు పరుగెత్తి పారిపోయిరి. కాకా కూడ పరుగిడ మొదలిడెను. కాని బాబా అతనిని పట్టుకొని యచ్చట కూర్చుండ బెట్టెను. ఈ సందడిలో నెవరో వేరుశనగపప్పుతో చిన్నసంచిని అచ్చట విడిచి పారి పోయిరి. బాబా యొక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి, పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్ర పరచుట, తినుట యొకేసారి జరుగుచుండెను. బాబా కూడ కొంతపప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్ళు తీసుకొనిరమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్ళు తెచ్చెను. బాబా కొన్నినీళ్ళు త్రాగి, కాకాను కూడ త్రాగుమనెను. అప్పుడు బాబా యిట్లనెను. “నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపనజేయు పనిని చూచుకొనవచ్చును.” అంతలో పారిపోయిన వారందరును వచ్చిరి. పని ప్రారంభించిరి. విరేచనములు ఆగిపోవుటచే కాకాకూడ వారితో కలిసెను. నీళ్ళవిరెచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్రము ప్రకారము వేరుశనగపప్పు విరెచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన యౌషధము బాబాయొక్క వాక్కు.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles