షిర్డీ లోని విఠల్ మందిరం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support by : Mrs Lakshmi



శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

షిర్డీ లోని విఠల్ మందిరం
• సాయి లీలామృతం లో బాబా లెండి కి వెళ్ళేటప్పుడు విఠల్ మందిరం దగ్గర ఒక ఇంటి గోడకు అనుకుని నిలిచే వారని ఉంటుంది. నేను 7 టైమ్స్ షిర్డీ వెళ్ళాను.

కానీ నాకు ఆ విటల్ మందిరం ఎక్కడ ఉందో తెలిసెది కాదు. గత సంవత్సరం షిర్డీ వెళ్ళే ముందు ఈ సారైనా ఆ మందిరం చూపించండి సాయి అని వేడుకున్నాను.

షిర్డీ వెళ్ళిన తర్వాత ఒకరోజు మేము షిర్డిలో షాపింగ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాము. అలా తిరుగుతూ ఉండగా సాయి అనూహ్యంగా మమ్ము విఠల్ మందిరం ఎదురుగా నిలిచేలా చేసారు.

నేను విఠల్ దర్శనం చేసుకొని, బాబా నా కోరిక మన్నించినందుకు ఎంతో సంతోషించాను.
చామరంతో సేవ
• నేను అప్పుడప్పుడు హైదరాబాద్ లో అమీర్ పేట బాబా గుడికి వెళ్ళే వాడిని.

సాయి కి హారతి ఇచ్చే సమయంలో చామరముతో వీస్తూ ఉంటారు. నాకు చామరం వీచే అవకాశం కావాలనిపించింది.

కానీ నాకు అక్కడ ఎవరు పరిచయం లేకపోవటము వలన ఆ కోరిక నా మనస్సులో అపుకొన్నాను.
కొన్నాళ్ళ తర్వాత నేను మందిరానికి వెళ్లి సాయి దర్శనం చేసుకొని హారతి కి ఉందామని. దూరంగా కూర్చున్నాను.. హరతికి తయారుచేస్తున్నారు.

ఒక వ్యక్తీ అంతమంది ముండువుండగా వారి అందరిని దాటి దూరంగా ఉన్న నా దగ్గరకు వచ్చి చామరం వీస్తారా అని అడిగారు.

సంతోషంతో సరేనన్నాను. నాకున్న కోరికను సాయి ఆవిధంగా తీర్చినందుకు మనసులోనే సాయికి కృతఙ్ఞతలు తెలుపుకుంటూ చామరం వీచాను.

ఆనందంతో నా కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి.

హైదరాబాద్ లో చింతల్ బాబా గుడిలో:-
• ఒక సాయంత్రం నాకేందుకో పులిహోర తయారుచేసి సంధ్య ఆరతి కి గుడిలో బాబాకి నివేదించాలనిపించింది. నేను పులిహోర చేసి గుడికి బయలుదేరాను.

కానీ అప్పటికి హారతి టైం అయిపొయింది. త్వరత్వరగా వెళ్ళాను.

సాయి నాకోసం ఎదురు చూస్తున్నట్లు హారతి మొదలు కాలేదు. థాంక్స్ బాబా అనుకోని లోపలికి వెళ్లి పంతులు గారికి పులిహోర ఇచ్చాను. ఆయన సంతోషంతో తీసుకోని, ఈ రోజు ఎవరు నైవేద్యం తేలేదు. ఎవరైనా తేస్తారేమో అని ఎదురు చూస్తున్నాను అన్నారు.

బాబా భక్తులు ప్రేమతో తెచ్చే నైవేద్యం కోసం ఎదురు చూడటము మనము సచ్చరిత్రలో చదివాము. అలానే సాయి నాకోసం వేచి నా నైవేద్యం స్వీకరించినందకు చాలా ఆనందమనిపించింది.
• మరోసారి ఉదయం బాబా గుడికి వెళ్లి ధ్యానం చేస్తున్నాను.

“దాసగణుకి ఉద్యోగం వదిలి పెట్టమని సాయి చెపితే, అతడు నాకు భుక్తి ఎలా అని అడుగుతారు. అప్పుడు సాయి ‘నేను పోషిస్తాను’ అని చెప్తారు.

ఈ సన్నివేశం గుర్తు వచ్చి, బాబా నేనిప్పుడు టిఫిన్ చేయలేదు. నాకు టిఫిన్ పెడతావ? అని అనుకున్ననంతే. బాబా పాదాలకు నమస్కరించి బయటకు వెళ్ళిపోతుండగా ఒక పెద్దాయన ఆ గుడిలో ఉంటారు.

ఆయన నన్ను అతని గదిలోకి రమ్మన్నారు. నాకు అతనితో పరిచయము ఏమి లేదు. సరే వారు రమ్మన్నారని గదిలోపలికి వెళ్ళాను. ఆయన నాకు టిఫిన్ ఇచ్చితినమన్నారు.

నేను మోహమాటానికి వద్దన్నాను. కానీ వారు ఒప్పుకోలేదు. నాకు చాల ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ సంఘటన. నేను బాబాని అడగటము తర్వాత ఆయన నాకు టిఫిన్ ఇవ్వటం అంత బాబా లీలె, లేకుంటే నా మనసులో కోరిక వారికీ ఎలా తెలుస్తుంది.

అందరి హృదయవాసుడు సాయే కదా! వారె అతనిని ప్రేరేపించి నాకు టిఫిన్ ఇప్పించారు.

దీనినిబట్టి మనకు సాయి కి శరణు అని ఒకసారి అంటే చాలు, ఇక భక్తుని సర్వ బాద్యత వారు తీసుకుంటారని, భక్తులకు వారి సేవలోనే భుక్తి, ముక్తి ప్రసాదిస్తారని తెలుస్తుంది.
• ఇంకోసారి సాయి మందిరంలో పంతులుగారు నన్ను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావా అని అడిగారు.

నేను నా ఉద్యోగ విషయం సాయికి వడిలివేసాను, అంత వారె చూసుకుంటారని అన్నాను. దానికి అతను నువ్వు ప్రయత్నం ఏమి చేయకుండా ఉంటే సాయి ఏమీ చేస్తారు.

గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే ఎలా అన్నారు.

నేను సాయి ఫై పూర్ణ విశ్వాసం ఉంఛి సహనంతో ఉంటే మనకు శ్రేయస్సుకరమైనది వారె చేస్తారు. గాలిలో దీపం అయిన ఆరిపోకుండా ఉంటుంది అని అన్నాను.

ఆ మందిర ప్రాంగణములో బయట గణేశుడు, దత్తాత్రేయుడు, శివుడు, నాగేంద్రుడి విగ్రహాలు, తులిసికోట ఉన్నాయి. ప్రతి చోట ఒక దీపం వెలిగిస్తారు.

ఆ సమయంలో విపరీతమైన గాలి వీస్తుంది. పంతులుగారు సాయి పై నీకంత విశ్వాసం కదా! కనీసం ఒక్క దీపామైన ఇంత గాలిలో ఆరకుండా ఉంటుందా అన్నారు. నేను కచ్చితంగా ఉంటుంది అన్నాను.

మేము బయటకుపోయి చూసాము. అన్ని దీపాలు ఆరిపోయాయి కానీ తులసికోట వద్ద దీపం మాత్రము దేదీప్యమానంగా అంత గాలిలో కూడా వెలుగుతుంది.

దానితో ఋజువైంది సాయి పై సంపూర్ణ విశ్వాసం ఉంటే ఏది అసాద్యం కాదని.
ఊదీ మహిమ:
1. ఒకసారి నాకు జ్వరం వచ్చింది. అయినా ఉదయం 4 గంటలకు లేచి చల్లని నీళ్ళతో స్నానం చేసి కాకడ హరతికి మందిరానికి వెళ్ళిపోయాను. నాకు కాకడ ఆరతి అంటే చాల ఇష్టం.

ఆరతి అవుతూ ఉండగా చివరిలో నాకు కొంచెం కష్టంగా అన్పించి వెనకకి వెళ్లి కూర్చుండిపోయాను.

నా తోటి భక్తులు ఆరతి పూర్తీ అయినా వెంటనే నా దగ్గరకు వచ్చి ఏమైందని ఆడిగారు. జ్వరమని చెపితే, మరి ఎందుకు వచ్చావు అన్నారు. నాకంత బాబానే, అంత బాబానే చూసుకుంటారని అన్నాను.

వారు డాక్టర్ కు చుపించుకోమన్నారు. సరే అన్నానుగాని సాయి పై విశ్వాసంతో మొండిగా బాబా ఊదీ మాత్రమే తీసుకున్నాను. వేరే ఏ మందు వేసుకోలేదు.

మూడవ రోజు కూడా జ్వరం తగ్గలేదు. మద్యాహ్న ఆరతికి ఒక లేడి డాక్టర్ వచ్చారు. నా తోటి వారు, పంతులుగారు నాపై ప్రేమతో నా విషయం ఆమెకు చెప్పారు.

నేను బాబా కు మనస్సులో నాకే మందులు వద్దు నువ్వే నాకు శరణు అని కోరాను. ఆ డాక్టర్ నన్ను చూసి, వచ్చింది వైరల్ ఫీవర్ అని చెప్పారు.

కానీ ఏ మందు తీసుకోవద్దు రెండు రోజులలో ఫీవర్ అదే తగ్గిపోతుందని చెప్పారు. డాక్టర్స్ యేవో మందులు రాసి ఇస్తారు గాని ఏ డాక్టర్ అలా చెప్పారు. నేను బాబా లీలకు ఆశ్చర్యపోయాను.

సాయి కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. రెండు రోజులలో ఫీవర్ తగ్గిపోయింది.
2. ఒకప్పుడు నా పెదవుల రెండు చివరల తెల్ల మచ్చలు ఉండేవి. 5 లేక 6 సంవత్సరాల పాటు ఏ మందులు తీసుకున్న తగ్గేవి కాదు.

చివరకు విసుగుచెంది మందులు వాడటం మానేసాను. సాయి కి శరణాగతి చెందిన తరువాత సాయి ఊదీ పెదలకు రోజు రాసుకోనేవాడిని. చిత్రంగా ఒక నెల రోజులలో ఆ మచ్చలు పూర్తిగా నాయమైపోయినవి.

అది ఉది మహిమ.
3. ఈ మద్యనే 4 లేక 5 నెలలుగా నా కుడి చేయి చిటికన వెళ్ళు తిమ్మిరి ఎక్కినట్లుగా ఉండేది.

అందువలన చేయి పటుత్వము తగ్గినట్లు ఉండేది. తినేటప్పుడు ముద్ద చేతికి సరిగా వచ్చేది కాదు. చపాతీ ముక్క చేయడానికి ఇబ్బందిగా ఉండేది.

బట్టల క్లిప్ పెట్టాలన్నా కష్టంగా ఉండేది. ఈ సమస్య గురించి ఇంటర్నెట్ లో వెతికాను.

అది ఒక రకమైన సమస్య అని దానికి యేవో కొన్ని వ్యాయామాలు చేయాలనీ, ఆపరేషన్ కూడా అవసరము ఉంటుదని చదివి భయపడ్డాను.

ఇంట్లో వాళ్ళకి తెలిస్తే భాధ పడతారని, హాస్పిటల్ కి వెళ్లమంటారని, వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే అందరికంటే పెద్ద డాక్టర్ సాయి ఉండగా హాస్పిటల్ కి వెళ్ళటం అనవసరమనిపించింది.

సాయినే నమ్ముకొని రోజు రెండు పుటలు బాబా ఊదీ చిటికనవ్రేలుకి పూయటం మొదలుపెట్టాను. బాబా కృప వలన ఆ భాధ నయమయ్యింది.
4. నాకు ఏది తిన్న, త్రాగిన బాబాకు సమర్పించి ఆ తర్వాత నేను స్వీకరించటం అలవాటు. ఒకసారి మా ఇంట్లో టీ చేసారు. నేను బాబా ముందు టీ పెట్టాను.

మిగిలిన వాళ్ళు త్రాగుతున్నారు.

అది ఏదో వాసన వస్తుందని, గేదెకు వ్యాక్షిన్ ఏదో ఇచ్చి ఉంటారని అందుకే పాలు ఆ వాసనతో ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు.

టీ త్రాగలేక వదిలివేసారు కూడా. కానీ బాబా అద్భుత లీల ఏమిటంటే నేను టీ త్రాగాను అది ఎటువంటి వాసన లేకుండా చక్కగా ఉంది. అందులో దోషాన్ని సాయి తొలగించేసారు.

ఈవిదంగా సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. సాయి గుర్తు చేసినంతవరకు మీ అందరితో పంచుకున్నాను.

మీ సాయి బందువు,

సాయి సురేష్,
శ్రీకాకుళం.

సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సర్వం సాయినాధర్పణ మస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles