శ్రీసాయిబాబా అనుగ్రహం 



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ప్రియమైన పాఠకులారా! పూజ్య శ్రీనరసిం హస్వామీజీ గారు ఆంగ్లంలో తను వ్రాసిన పుస్తకాల ద్వారా, వార్తా పత్రికలలో ప్రచురించిన కధనాలు, యింకా సమావేశాలలో ప్రసంగాల ద్వారా, మరాఠీ భాష తెలియని భక్తులందరికి శ్రీసాయిని పరిచయం చేశారు. 
ఆంగ్లభాషలో శ్రీసాయి సత్ చరిత్ర వ్రాసిన శ్రీనగేష్ వి.గుణాజీగారు ఆంగ్లభాష తెలిసిన వారందరికీ ఆపుస్తకం ద్వారా ఎంతో సహాయం చేశారు.  లేకపోతే మనకి శ్రీసాయిబాబా గురించి తెలిసేదే కాదు.  ఆయనకు కూడా మనమందరం నమస్కారాలు తెలియచేద్దాము.  ఆయన కూడా తమ అనుభవాన్ని సాయిసుధ (జూలై 1951) ఎడిటర్ గార్కి ఈ క్రింద వివరించిన విధంగా తెలియచేశారు.
శ్రీసాయి సత్ చరిత్ర ఆంగ్లంలో చదివిన కొంత మంది నాస్నేహితులు, సాయిబాబాపై నేను పొందిన అనుభూతులేమిటని నన్నడిగారు.  నేను చాలా ఉన్నాయని చెప్పాను. కాని, అవన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకున్నందువల్ల లాభమేమిటి?  ఆంగ్ల భాషలో ఉన్న శ్రీసాయి సత్ చరిత్రలోనుండి ఒకదానిని ఉదాహరణగా తీసుకొందాము.  నాకు ఆంగ్లభాషలో ప్రావీణ్యం లేదు.  నేనసలు ఆపుస్తకం రాద్దామనుకోలేదు.  కాని, సాయిబాబా నాచేత వ్రాయించారు. 
ఇక యిటీవలే జరిగిన అనుభవానికొస్తే, ఏప్రిల్ నెల 1951వ.సం.గురువారం, 12వ.తారీకు ఉదయం 8 గంటలకు తలకవాడి  కాంగ్రెస్ రోడ్డునుండి నాస్నేహితునితో కలసి వస్తున్నాను.  అతని యిల్లు తలకవాడిలో తూర్పువైపున ఉంది.  వెంకటేష్ విలాస్ టీ క్లబ్ ముందున్న రైలు గేటును దాటుకొని తన యింటికి వెళ్ళిపోయాడు.  ఆరోజు గురువారం కాబట్టి హారతయిన తరువాత సాయిబాబాకు నైవేద్యం పెట్టడానికి కోవా కొనడానికి మిఠాయి దుకాణానికి తిన్నగా నడుచుకొంటూ వెళ్ళాను.  కొన్ని అడుగులు వేసిన తరువాత నాకెదురుగా ఒక కారు నామీదకు రావడం గమనించాను.  దానినుండి తప్పించుకోవడానికి నేను కుడివైపుకు వెళ్ళాను.  కాని, కారు డ్రైవరు కూడా అదే దారిలో కుడివయిపుకు నాకెదురుగా వచ్చి నన్ను గుద్దడంతో క్రిందకు పడిపోయాను.  కొద్ది క్షణాలు నాకు స్పృహతప్పింది.  తరువాత మామూలుగా లేచి నిలబడ్డాను.  రోడ్డుమీద వెడుతున్నవారందరూ నేను పోయాననే అనుకున్నారు.  కాని, నేను లేచి నిలబడగానే చాలా ఆశ్చర్యపోయారు.  నామీదుగా పోయేలా కారునెందుకు నడిపావని  డ్రైవరు నడిగాను.  తన కారు కెదురుగా కొంతమంది ఉన్నారని వారిని తప్పించడం కోసం కారును కుడివయిపు పోనిచ్చానని చేప్పాడు.  తరువాత నేను మిఠాయి దుకాణానికి వెళ్ళి కోవా కొని, యింటికి వెళ్ళి బాబాకు హారతినిచ్చి కోవా నైవేద్యం పెట్టాను.  మంచం మీద పడుకొని సుఖంగా నిద్రపోయాను.  మరునాడు డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను.  నాశరీరానికి ఎక్కడా దెబ్బలు తగలలేదని ఆరోగ్యంగా ఉన్నానని పూర్తిగా పరీక్షించి చెప్పాడు.
బాబా అనుగ్రహం వల్లనే నేనా ప్రమాదం నుండి తప్పించుకొన్నాను.  నాకు ఎటువంటి గాయాలు తగలకుండా రక్షించి ఆరొగ్యంగా ఉంచారు.
ఎన్.వీ.గుణాజీ
సాయిసుధ
జూలై 1951

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీసాయిబాబా అనుగ్రహం 

సాయినాథుని ప్రణతి

సాయినాథుని చెర్యలు అగాదాలు. వారి లీల్లలు అంతుపటనివి. వారి ఆశ్వివాదాలు సర్వత్ర వుంటాయి

kishore Babu

Thank you so much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles