శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారికి పుట్టినరోజు నాడు బాబాగారి అనుగ్రహము–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba




This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఈ రోజు మనము బాబాగారు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారిని యే విధముగా అనుగ్రహించారో తెలుసుకుందాము.  ఈఇ లీల ఆమె తన ఆంగ్ల బ్లాగులో అక్టోబరు 2008 లో ప్రచురించడం జరిగింది.

ఈ రోజు గురువారము చాలా ప్రత్యేకమయినది. యెందుకంటే ఈ రోజు నా పుట్టినరొజు నాడు బాబా గారు నాన్ను అనుగ్రహించారు.

కాని, ఈసారి మాత్రం నేను నా పుట్టినరోజు నా స్నేహితులతో కలిసి జరుపుకోకుండా, సాయి తో జరుపుకోవాలనుకున్నాను. క్రితం రోజు రాత్రి, నేను, నా భర్త, ఈ రోజు సాయి మందిరానికి వెళ్ళి అక్కడ బీదవారికి అన్నదానము చేద్దామని యోచన చేశాము.

మేము వారికి ఈ రోజు పంచడానికి, వెచ్చటి శాలువాలు కూడా కొన్నాము.

అంచేత ఈ యోచనతో నేను ప్రొద్దున్నే లేచి తయారయి బాబా విగ్రహానికి స్నానము చేయించి, పూజ చేసి, చందనము దిద్ది, ఆరతి ఇచ్చాను.

ఆరతి అయిపోయింది, నేను, “సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహరాజ్ కి జై” అని జయ థ్వానము చేశాను.

బాబాగారికి జై అని చెప్పిన వెంటనే, మా ఇంటిలోకి ఒకరు వచ్చి “అమ్మా, బాబాగారు మీ ఇంటికి వచ్చారు” అన్నాడు. నేను “యెవరదీ?” యెవరు మీరు” అని ఆడిగాను.

అతడు, “నా పేరు ఆషు (ఇతను నా భర్త పని చేసే ఆఫీసులో సహొద్యోగి) నేనింకా యేదయినా అడిగేలోపే అతను మేడ మీద కొచ్చి, నేను బాబా పూజ చేస్తున్న చోట నా ప్రక్కన నుంచున్నాడు.

వచ్చి, “అమ్మా, ఈ రోజు బాబాగారు సాయి మందిరము నుంచి, అదీ గురువారము నాడు మీ ఇంటికి వచ్చారు. “ అని చెప్పి ఒక పాకట్ నాచేతికిచ్చాడు.

నేను అతని వద్దనుంచి ఇటువంటి బహుమతి వస్తుందని ఊహించలేదు కాబట్టి, జోక్ చేస్తున్నడనిపించింది. అతను చాలా చిన్నవాడు,

పైగా అతనికి నేను సాయి భక్తురాలినని కూడా తెలియదు. అంచేత యెదో  తెచ్చి ఉంటాడు నాకోసం అనుకుని, దానిపైనున్న కాగితం విప్పి చూసేటప్పటికి, అందులో ఆకుపచ్చని శాలువాతో అందమైన దండ, కిరీటంతో అందమైన బాబా విగ్రహం చూసేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది.

ఆ విగ్ర్రహాన్ని చూడగానే, బాబాని మా ఇంటికి ఆహ్వానిస్తున్నానా అన్నట్లుగా నా కళ్ళనుంచి ఆ విగ్రహం మీద కన్నీరు కారడం మొదలుపెట్టింది. నా శరీరంతా మంచులా చల్లగా అయింది.

నేను బాబాగారి విగ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుదు, విగ్రహం పాదాల వద్ద కొంచెం చెక్కుకు పోయి వుండడం గమనించాను. నేను ఆ విగ్రహాన్ని మార్చేద్దామనుకున్నను.

మేము యెలాగూ సాయి మందిరానికి వెడుతున్నాము కాబట్టి, ఆ విగ్రహాన్ని మార్చేసి, కొత్తది తీసుకుందామని, సాయి మందిరం ఉన్న షాపు లోకి వెళ్ళాము.

షాపు యజమానికి చెప్పి విగ్రహం పాదాల వద్ద కొంచెం చెక్కుకుపోయి ఉంది, ఇంకొకటి మార్చమని ఆడిగాను.

ఆ షాపతనికి నేను బాగా తెలుసును కావట్టి, “ఓహ్, అవును, ఇంతకు గంటన్నర క్రితమే ఒకబ్బాయి వచ్చి, యెవరికో బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ విగ్రహాన్ని పట్టుకు వెళ్ళాడు.

అప్పుడు నేను, అవును ఈ రోజు నా పుట్టినరోజు, నాకు బహుమతిగా ఇచ్చాడు” అని చెప్పాను. షాపు యజమాని నాకు శుభాకాంక్షలు చెప్పి 5 నిమిషములు ఉండమన్నాడు.

తరువాత చేతిలో పెద్ద విగ్రహంతో తిరిగి వచ్చాడు. ఇది పెద్ద విగ్రహం, మా ఇంటిలో ఇప్పటికే ఇలంటిది ఉందని చెప్పి, వద్దన్నాను.

అప్పుడు అతను, మీరు దీనిని తీసుకోవాలి, యెందుకంటే ఇది చాలా ప్రత్యేకమయినది. నన్ను నమ్మండి. ఇందులో బాబాగారు ఉన్నారు అని చెప్పాడు.

2 నెలల క్రింతం కొంతమంది వారింటిలో పెద్ద సత్సంగము చేసుకున్నారు.

ఈ సత్సంగానికి వారు 500 మంది భక్తులని పిలిచారు. అంచేత వారు నా వద్ద ఈ విగ్రహాన్ని కొన్నారు.

కాని, సత్సంగము అయిన వెంటనే, నా షాపుకి వచ్చి, ఈ విగ్రహాన్ని ఇచ్చివేసి, పెద్ద బాబా ఫొటో బదులుగా తీసుకున్నారు.

ఈ విగ్రహం చాలా పెద్దది, దానిని జాగ్రత్తగా చూడడం కూడా తమవల్ల కాదని చెప్పారు. ఇంతే కాకుండా షాపతను, “నాకెందుకో మనసులో ఈ విగ్రహాన్ని మీరు తీసుకోవాలని చెపుతోంది.

నానుంచి ఇది మీకు బహుమతి అనుకోండి అని చెప్పాడు.
“మీరెందుకింత విలువైన విగ్రాహాన్ని నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు” అని అడిగాను. అప్పుడు అతను “మీరు అది అడగవద్దు ఇది బాబాగారి ఆజ్ణ” అన్నాడు.

నేనేమీ మాట్లాడకుండా ఆ విగ్రహాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాను. కాని, నామనసు కుదురుగా లేదు.

బాబాగారు నాకేదో చెబుదామని అనుకుంటున్నట్లుగా అనిపించింది. ఆరోజు సాయంత్రం నేను కాఫీ త్రాగుతుండగా ఈ విగ్రహం గురించి షాపతను చెప్పిన మాటలన్ని మరలా గుర్తుచేసుకోవడం మొదలుపెట్టాను.

హటాత్తుగా నాకు, డెహ్రాడూన్లో తొందరలో సాయి సత్సంగము ప్రారంభించమని బాబాగారు సూచిస్తున్నట్లుగా నేను తెలుసుకున్నాను.

ఇప్పుడంతా వివరంగా చెబుతాను. కొన్ని రోజుల క్రితం, త్యాగరాజు గారి నుంచి, తమ ఊరిలో సత్సంగము చేస్తున్నట్లుగా, నన్నుకూడా డెహ్రాడూన్లో సత్సంగము చేయమని మెయిల్ చేయడం జ్ణప్తికి వచ్చింది.

నాకు ఈ సలహా నచ్చింది, కాని నేను షిరిడీ నుంచి వచ్చాక ఒక్కసారి మాత్రమే చేదామనుకున్నాను. కాని, బాబాగారి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి.

ఈరోజు ఇంతపెద్ద విగ్రహం ఒకరి ఇంటిలో సత్సంగములో ఉండి, వెంటనే సత్సంగము ప్రారంభించమని సూచన చేస్తున్నట్లుగా మాఇంటికి తిరిగి వచ్చింది. 

అందుచేత డెహ్రాడున్లో సాయి సత్సంగము నిర్వహణా బాథ్యత నేను తీసుకోవాలని బాబాగారి కోరిక, సూచన. ఇది రాసిన తరువాత నా మనసు ప్రశాంతంగా ఉంది.

సాయంత్రం ఆరతి అయిన తరువాత నేను, నాపనిలో పూర్తి న్యాయం చేకూరుస్తానని బాబాగారికి మాటిచ్చాను.

సాయి సత్సంగము గురించి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేస్తాను. యెప్పుడూ నాకు, నా పుట్టిన రోజు నాడు ఇటువంటి అనుగ్రహం రాలేదు. బాబాగారు తన విగ్రహంతో నాన్ను అనుగ్రహించారు.

ఈ రోజున ఆయన నన్ను ఇల్లా దీవించారంటే నమ్మలేకపోతున్నాను.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles