Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి
మనమిప్పుడు భాగవతంలోని రంతిదేవ మహారాజు చరిత్రను తెలుసుకొందాము. ఆయన తనవద్ద ఉన్నదంతా దానధర్మాలు చేసి ఇక ఏమీలేని బికారి స్థితికి చేరుకొన్నాడు. ఆదశలొ ఎవరైనా అడిగినప్పుడు తాను తింటున్న దానిని కూడా కాదనకుండా దానం చేస్తూ ఉండేవాడు.
1908 నుంచి 1918 మధ్యకాలంలో బాబా రోజూకు సుమారు ఐదువందల రూపాయలదాకా దక్షిణగా స్వీకరిస్తూ ఉండేవారు. దక్షిణగా వచ్చినదానినంతా అవసరంలో ఉన్నవారికీ, బీదవారికీ పంచిపెడుతూ ఉండేవారు. అమలికి 2/-,జమాలీకి 3/-,బాయిజాబాయికి 25/- , తాత్యాకు 35/- రూపాయలు ఇస్తూఉండేవారు. అలా ఇచ్చి మరుసటిరోజుకు ఫకీరయిపోయేవారు. బాబా మరలా బిక్షకు వెళ్ళేవారు.
బాబా ప్రతీరోజూ అయిదు ఇళ్ళవద్ద బిక్షను స్వీకరించేవారు. అలా స్వీకరించిన భిక్షగా వచ్చిన కూరలు, రొట్టెలు అన్నిటినీ కలిపేసేవారు. రుచిని కూడా పట్టించుకునేవారు కాదు. ఆయన బిక్షగా తెచుకున్నదానిని పిల్లులు, కుక్కలు తింటు ఉండేవి. ద్వారకామాయిలోని సాయినాధులు ఎలాగో భాగవతంలోని రంతి దేవుడు కూడా అట్లాంటివారే అని నేను భావిస్తున్నాను.
మరలా భాగవతం విషయానికి వస్తే కృష్ణుడు తన చిన్నతనంలో కాళీయ మర్ధనం చేశాడు. కాళీయ మర్ధనం చేసిన తరువాత కాళీయుడికి గర్వమణగి యమునానది నుంచి బయటకు వచ్చాడు. తాను నీటి నుంచి బయటకు వచ్చిన వెంటనే తనను చంపడానికి గరుత్మంతుడు తయారుగా ఉంటాడని కృష్ణునికి చెప్పాడు కాళీయుడు. కృష్ణుడు “భయపడకు, నీపడగమీద నాపాదముద్రలు ఉంటాయి. అపుడు గరుత్మంతుడు నీకు హాని తలపెట్టలేడు. నీకు నేను ఆ హామీ ఇస్తున్నాను. నాపాదముద్రలు నిన్ను రక్షిస్తాయి” అని చెప్పాడు. ఆవిధంగా కృష్ణుడు తాను బాలుడిగా ఉన్నప్పుడే అభయమిచ్చాడు.
శ్రీసాయి సత్ చరిత్ర 5వ.అధ్యాయములో బాబా తన పాదుకలను వేపచెట్టుక్రింద ప్రతిష్టించదానికి అంగీకరించారు. 1912 వ. సంవత్సరములో వాటిని ప్రతిష్టిస్తున్నపుడు ఇవి భగవంతుని పాదుకలని చెప్పారు. ఏ భక్తులయితే ఈ పాదుకలకు నమస్కరించి, గురు,శుక్రవారములలో ధూపము వేయుదురో వారి భయాలన్ని తొలగి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. శ్రీకృష్ణుడు కాళీయునికి ఎటువంటి అభయమిచ్చాడొ అదే అభయాన్ని బాబా తనభక్తులకు ఇచ్చారు. బాబా ఎప్పుడూ అవి తన పాదుకలని చెప్పలేదు. భగవంతుని పాదుకలని చెప్పారు.
బాబా కూడా ఇదేవిధమైన లీలను చూపించారు. శ్రీసాయి సత్ చరిత్ర 11వ. అధ్యాయములో ద్వారకామాయిలో ధునిలోని మంటలు హటాత్తుగా పైపైకి ఎగసిపడసాగాయి.
అక్కడ వున్న భక్తులందరూ భయంతో ఏమి చేయాలో పాలుపోక నిశ్చేష్టులయిపోయారు. జరుగుతున్నదానిని బాబా వెంటనే గ్రహించుకొని, తన చేతిలో ఉన్న సటకాతో ద్వారకామాయిలోని స్థంభాలమీద కొడుతూ చెలరేగుతొన్న అగ్నిని తగ్గు, తగ్గు అని అధికార స్వరంతో ఆజ్ఞాపించారు. ఒక్కొక్క సటకా దెబ్బకి ధునిలోని మంట తగ్గుతూ వచ్చింది. కొద్ది నిమిషాలలోనే ధునిలోని మంట మామూలు స్థితికి వచ్చింది. అడవిలో చెలరేగిన మంటలనుండి శ్రీకృష్ణుడు తన భక్తులను ఎలాగయితే కాపాడారో అదేవిధంగా బాబా ద్వారకామాయిలో మంటలలో చిక్కుకొన్న తన భక్తులను కాపాడారు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 10వ. భాగము
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 2
- కృష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము
- రామాయణంలో శ్రీసాయి 8వ. భాగము
- శ్రీకృష్ణునిగా శ్రీసాయి – 5వ. భాగము–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments