రామాయణంలో శ్రీసాయి 8వ. భాగము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

రామాయణంలో శ్రీసాయి 8వ. భాగము

నవవిధ భక్తిలో ‘కీర్తన ప్రాముఖ్యమైనదని రామాయణంలో కూడా చెప్పబడింది.

భరతుడు తమ తండ్రి అయిన దశరధ మహారాజుల వారి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తరువాత   శ్రీరామ చంద్రుల వారిని ఒప్పించి అయోధ్యకు తిరిగి రప్పించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అడవిలోకి వెళ్ళుతున్న సమయములో గంగానది ఒడ్డున ఉన్న గుహుడిని కలుసుకొన్నాడు.  గుహుడు శ్రీరాముల వారిని కీర్తిస్తూ గానం చేస్తున్నాడు.  అందుచేత భగవంతుని కీర్తించడానికి ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ ఎవరికీ అవసరం లేదు. ముఖ్యమైనది భక్తి మాత్రమే.

శ్రీసాయి సత్చరిత్రలో నాకు ఇటువంటి సంఘటనే కనిపించింది.  వివిధ రంగాలలో ప్రావీణ్యత గల జనులందరూ  బాబా దర్బారుకు వచ్చేవారు. కొంతమంది పాటలు పాడేవారు., మరికొందరు నృత్యాలు చేసేవారు, కొంతమంది పద్యాలు చదువుతూ తమ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేవాస్తూ  ఉండేవారు. ఒక చెప్పులు కుట్టేవాడు బాబాని తన తల్లి తండ్రి అని సంబోధిస్తూ ఉండేవాడు. ప్రతీవారికీ కూడా తమదైన పధ్ధతిలో భగవంతుని కీర్తించే అధికారం ఉందని మనం గ్రహించగలము.

అరణ్యకాండలో భగవంతుడు తన భక్తులకు జ్ఞాన మార్గాన్ని చూపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

శ్రీరామచంద్రుల వారు సీతాదేవి అన్వేషణలో ఉన్నారు. శ్రీరాముల వారికి ఒక పక్షి నిరంతరం ‘ శ్రీరామ శ్రీరామా అని నామ జపం చేస్తూ ఉండటం వినపడి, ఆశబ్దం  వస్తున్న దిశగా అడుగులు వేశారు. అక్కడ మృత్యువుతో పోరాడుతున్న జటాయువు అనే పక్షిని చూశారు. జటాయువు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిన విషయాన్ని వివరించి,  రావణుని ఎదిరించి పోరాడినా సీతాదేవిని రక్షించలేకపోయానని విచారిస్తూ చెప్పాడు.  పైగా రావణాసురుడు తనను గాయపరచడం వల్ల లేవలేక పడి ఉన్నానని చెప్పాడు. రావణుడిని వధించి సీతాదేవిని కాపాడమని జటాయువు శ్రీరాముల వారిని కోరాడు. ఇలా చెపుతూ జటాయువు ఆఖరి శ్వాస తీసుకొన్నాడు. ఆక్షణం చాలా హృదయ విదారకమైన క్షణం. శ్రీరాముల వారి నేత్రాలు చమర్చాయి. జటాయువు చేసిన సేవకు గుర్తుగా శ్రీరాముల వారు అడవి నుంచి ఎండు కట్టెలను  తీసుకుని వచ్చి జటాయువు యొక్క అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీరాముల వారు తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించలేకపోయినా, తన తండ్రికి ప్రాణస్నేహితుడైన జటాయువుకు నిర్వహించారు.

ఇటువంటి సంఘటనే మనకు శ్రీ సాయి సత్చరిత్ర 31వ. అధ్యాయములో కనపడుతుంది. మేఘుడు బాబాకు అంకిత భక్తుడు.35 సంవత్సరాల చిన్నవయసులోనే మరణించాడు.  బాబా మేఘుని వద్ద కూర్చొని చిన్న పిల్లవానిలా రోదించారు. అంత్యక్రియలకు శ్మశాన వాటిక వరకు నడిచి వెళ్ళారు.  తన స్వంత ఖర్చుతో ఆఖరి రోజున బ్రాహ్మణులకు, బీదవారికి అన్నదానం చేశారు. ఈ సంఘటన నాకు జటాయువు మరణ సమయమలో రామాయణంలోని శ్రీరాముని పాత్రను గుర్తుకు తెచ్చింది.

మనమిప్పుడు రామాయణంలోని పంపా నది ఒడ్డుకు వెళ్ళి శబరి కధ గురించి గుర్తుకు తెచ్చుకొందాము. శబరి శ్రీరాముల వారికి పండ్లను సమర్పించే ముందు, తాను ముందుగా కొంచెం కొరికి వాటి రుచి చూసి మరీ అర్పించింది.  ఈ సంఘటన మనకు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని భగవంతుడు భక్తికి కట్టుబడి ఉంటాడనే  విషయాన్ని ఋజువు చేస్తుంది.

శ్రీ సాయిసత్ చరిత్రలో కూడా మనకి ఇటువంటి దృష్టాంతమే కనపడుతుంది. శ్రీరామనవమి నాడు భక్తులంతా బాబా దర్శనానికి వరుసలో నిలబడి ఉన్నారు. మధ్యహ్న్నము ఒక ముసలి స్త్రీ బాబా కు సమర్పిoచడానికి మూడు చపాతీలను తీసుకొని ద్వారకామాయికి వచ్చింది.  ఆమెనెవరూ పట్టించుకోలేదు.  తను బాబాని కలుసుకోగలనా లేదా అని సందేహం వచ్చింది ఆమెకు.  బాబాకు సమర్పించడానికి తెచ్చిన మూడు చపాతీలలో ఒక చపాతీ ఆకలి వేసి ఆమె ఆరగించింది. మిగిలిన చపాతీలను తినడానికి ముందే, ఆమె గురించి చెప్పి తన వద్దకు తీసుకుని రమ్మనమని శ్యామాను పంపించారు బాబా. శ్యామా ఆమెవద్దకు వెళ్ళి స్వయంగా బాబా వద్దకు తీసుకొని వెళ్ళాడు.  బాబా ఆమెను తనకు చపాతీలను పెట్టమని అడిగారు. తాను అప్పటికె సగం తినేసానని చెప్పింది. మిగిలినవాటిని ఇమ్మని చెప్పి వాటిని ఆనందంగా ఆరగించారు బాబా.  ఈ సంఘటన నాకు రామాయణంలోని శబరి తాను రుచి చూసిన పండ్లను శ్రీరాములవారికి అర్పించిన సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles