నా సంరక్షకుడు.. సాయిబాబా – 1



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

నా సంరక్షకుడు..సాయిబాబా – 1 
ఈ అనుభవం శ్రీలంకలోని ఒక సాయి భక్తురాలి అనుభవం…ఆమె మాటలలోనే ఈ అనుభవాన్ని చదవండి.
నా చిన్నతనం నుండీ నాకు సాధువులన్నా,  సన్యాసులన్నా, తమకు తాము డేవుడినని చెప్పుకునే మనుషులన్నా నమ్మకం ఉండేది కాదు.  కాని నా చిన్నతనంలో ‘బాలమిత్ర’ పిల్లల కధల పుస్తకంలో షిరిడీ సాయిబాబా గురించి  చదివిన తరువాతనే ఆయన గురించి తెలిసింది.  ఆ పుస్తకంలో బాబా నీటితో దీపాలను వెలిగించిన కధను ప్రచురించారు. ఆకధను చదివిన తరువాత బాబా రూపం నా మదిలో నిలిచిపోయింది.  ఆయన నిరాడంబర జీవితం నన్నెంతగానో ఆకర్షించింది.  అప్పటి నుండీ నాకు బాబా మీద భక్తి ఏర్పడింది.
ఒకసారి నేను చెన్నై వెళ్ళాను.  అక్కడ నాస్నేహితుడు చెన్నైలో ఇక్కడ  ఏ ఏ ప్రదేశాలు చూద్దామనుకొంటున్నావని అడిగాడు.  నాకు షిరిడీ సాయిబాబా మందిరం చూడాలని ఉందని చెప్పాను.  అతను ముస్లిం అయినా కూడా నన్ను యింజంపాక్కం లో ఉన్న బాబా మందిరానికి తీసుకొని వెళ్ళాడు.  ఆరోజు సాయంత్రం సమయం.  అప్పటికి ఇంకా గుడికి ఎవరూ రాలేదు.  అక్కడ ఒక పెద్ద బాబా ఫొటో మాత్రం ఉంది.  ఇక హాస్టల్ కి  వెళ్ళిపోదామనే ఉద్దేశ్యంతో తొందరగా బాబాను ప్రార్ధించుకొని వెంటనే బయటకు వచ్చేశాను.
మరుసటి రోజు అతనితో కలిసి బైక్ మీద ఈ.సీ.ఆర్ రోడ్ కి వెళ్ళాను.  అతను నన్ను సముద్రపు ఒడ్డుకి తీసుకొని వెడుతున్నాడు.  కాని సముద్రపు ఒడ్డు దాకా వెళ్ళాలంటే రోడ్డు దగ్గర నుండి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి.  కాని, ఆప్రదేశం నాకు క్రొత్త. పైగా ఒడ్డుకు వెళ్ళే దారంతా దేవదారు చెట్లు, పొదలతో బాగా దట్టంగా ఉండి అడవిలాగ ఉంది.  ఆప్రాంతమంతా భయంకరంగా ఉంది.  ఎక్కడా మానవ సంచారం లేదు.  ఆప్రదేశాన్ని చూడగానే సినిమాలలో చూసే భయంకరమయిన దృశ్యాలన్నీ నాకు గుర్తుకు వచ్చి మరింత భయం వేసింది.  కాని నాప్రక్కన నాస్నేహితుడు ఉండటంతో మనసులోనే దైవాన్ని స్మరించుకుంటూ నడవసాగాను.  మేము పొదలలోకి  ప్రవేశించగానే ఎక్కడి నుండో ఒకనల్ల కుక్క మాతో కూడా రాసాగింది.  అరణ్యంలా ఉన్న ఆప్రదేశం గుండా వెడుతున్నపుడు ఆకుక్క మా ముందు నడుస్తూ ఉంది.  అప్పుడప్పుడు అది ఆగి మమ్మల్ని ఆగమన్నట్టుగా మొరుగుతూ, తరువాత తనని అనుసరించి రమ్మన్నట్లుగా తిరిగి బయలుదేరసాగింది.  ఆప్రదేశాన్ని దాటి మేము సముద్రపు ఒడ్డుకు చేరగానే ఆకుక్క యిక మాతో రాలేదు.
ఇసుకలో కూర్చొని మేము బిస్కట్లు తింటున్నాము.  “మనతో కూడా వచ్చిన నీస్నేహితుడు ఏడీ? దానికి కూడా ఒక బిస్కెట్ పెట్టవా”? అని నాస్నేహితుడు నవ్వుతూ అన్నాడు.  అప్పుడు నాకు ఆకుక్క  గుర్తుకొచ్చి చుట్టూ చూశాను.  అది ఒక పొదదగ్గర కూర్చొని ఉంది.  దానిని పిలిచి ఒక బిస్కెట్ పెట్టాను.  అది బిస్కట్ తిన్న తరువాత  చూస్తే వెనకాల ఆకుక్క ఎక్కడా కనపడలేదు.  ఆప్రాంతమంతా ఒక అడవి అవడంవల్ల ఎక్కడికో వెళ్ళి ఉంటుందిలే అనుకొన్నాను.
కొంతసేపటి  తరువాత యిక బయలుదేరడానికి లేచాము.  ఒడ్డు నుంచి మరలా అడవిలా ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించగానే, అదే కుక్క మళ్ళీ మాతో కలిసి రావడం మొదలుపెట్టింది.  అడవి చివరివరకూ మాతో కూడా వచ్చి, ఆకుక్క మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.  ఆకుక్క ప్రవర్తనకి నాకు చాలా ఆశ్చర్యం వేసింది.  నేను ఆకుక్క ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతుంటే నాస్నేహితుడు నవ్వుతూ “నువ్వు భయపడతావని, యిక్కడకు వచ్చేముందు నీకు చెప్పలేదు.  ఇక్కడ పొదల్లో పాములుంటాయి.  కాని నీకు యిక్కడ అందమైన సముద్ర తీరాన్ని చూపిద్దమనుకున్నాను.  అందుకే చెప్పలేదు.  అందుచేతే ఆకుక్క నీకు తోడుగా, రక్షణగా మనతో కూడా వచ్చింది.  బహుశ దానికి నామీద కూడా నమ్మకం లేకపోయి ఉండచ్చు.  నీలాంటి అమాయకురాలిని ఏదయినా చేస్తానేమోనని నీకు రక్షణగా కూడా వచ్చింది” అన్నాడు.
ఆక్షణంలో నాభావాలను నేను వివరించలేను.  నన్ను రక్షించడానికి నాకు రక్షకుడుగా ఆకుక్క రూపంలో వచ్చినది సాయిబాబాయే అని గ్రహించుకొన్నాను.  నాకెంతో ఆనందం వేసింది.  నాకు రక్షణగా వచ్చిన నాసాయికి ఎంతో ఋణపడిఉన్నాను.
 ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles