రామాయణంలో శ్రీసాయి (3వ.భాగము)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

రామాయణంలో శ్రీసాయి (3వ.భాగము)

మనము రామాయణంలోని బాలకాండను ఒక్కసారి సమీక్షిద్దాము.  ఇందులో దశరధ మహారాజుకు   పుత్ర సంతానాన్ని అనుగ్రహించిన సందర్భము ఉంది.  దశరధ మహారాజు తనకు పుత్రసంతానం లేదని ఎప్పుడూ విచారిస్తూ ఉండేవారు.  రామాయణంలో ఋష్యశృంగ మహర్షి దశరధుని చేత పుత్రకామేష్టి యాగం చేయించినారు.  ఆ యాగ ఫలితం వల్ల దశరధ మహారాజుకు నలుగురు కుమారులు జన్మించారు.

ఇటువంటి సంఘటనే   మనకు శ్రీ సాయి సత్  చరిత్ర  14వ. అధ్యాయములో కనపడుతుంది. రత్నాజీ షాపూర్ జీ  వాడియా నాందేడ్ నివాసి. ఆయనకెంతో సిరిసంపదలు, మంచి ఆరోగ్యం ఉన్నాకూడా పుత్ర సంతానం కలగలేదు .   శ్రీసాయి సత్ చరిత్రలో బాబా రత్నాజీ షాపూర్ జీవాడియాకు పుత్రసంతానాన్ని ప్రసాదించారు.

బాల కాండలో గురువు ఆజ్ఞను గురించి  అత్యంత ప్రాధాన్యాన్నివ్వవలసిన దాని గురించి ప్రముఖంగా చెప్పబడింది.  యాగ సంరక్షనార్ధం రామ లక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహామునిని అనుసరించి, వెడుతున్న సమయంలో విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ  రావడం కనపడింది. విశ్వామిత్రుల వారు రామునితో ఆమెను ఒక్క బాణంతో చంపమని ఆజ్ఞాపించారు. తమకు అపకారం చేయని ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు మొదట సందేహించాడు. ఒక్క క్షణమాగి, తరువాత గురువు ఆజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి, బాణాన్నెక్కుపెట్టి ఒక్క బాణంతొ ఆస్త్రీని వధించినాడు.   శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన గురువు యొక్క ఆజ్ఞను పాలించాడు. తరువాత ఆ స్త్రీ తాటకి అనే రాక్షసి అని తెలుసుకున్నాడు. 

సరిగా ఇటువంటి సంఘటనే మనకు శ్రీసాయి సత్ చరిత్ర 23వ. అధ్యాయంలో కనపడుతుంది.  ద్వారకామాయిలోకి ఒక మేకను తీసుకుని వచ్చారు.  బాబా కాకాసాహెబ్ దీక్షిత్ ని పిలిచి, అతనికి ఒక కసాయి కత్తినిచ్చి ఆమేకను ఒకే వేటుతో చంపమన్నారు.  తనకు అపకారం చేయని ఆమేకను ఎట్లా చంపడమా అని మొదట సందేహించాడు కాకా సాహెబ్. కొంతసేపు ఆగిన తరువాత గురువు యొక్క ఆజ్ఞే వేద వాక్యమని తలచి మేకను చంపడానికి కత్తిని పైకి ఎత్తినాడు. ఈలోగా సాయినాధుల వారు అతనిని వారించారు. అప్పుడు కాకాసాహెబ్ “మేకను చంపడం తప్పా ఒప్పా అన్నది నాకనవసరం. గురువు చెప్పిన వాక్యాలే వేదాలకన్నా శక్తివంతమైనవని నాకు తెలుసు. నాకు గురువు ఆజ్ఞను పాలించడమొక్కటే తెలుసు.” అన్నారు.  ఆవిధంగా నేను రామాయణంలోను, శ్రీ సాయి సత్చిరిత్రలోను ఉన్న పోలికలను గమనించాను.

(బాలకాండలోని విశేషాలు తరువాయి భాగంలో)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles