Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
రామాయణంలో శ్రీసాయి 9వ. భాగము
మనమిప్పుడు రామాయణంలోని అయోధ్యకాండను సమీక్షిద్దాము. సమాజ శ్రేయస్సు కోరి శ్రీరామ చంద్రుల వారు ఒక చిన్న అసత్యమును పలికినారు.
శ్రీరామ చంద్రులవారు సీతాదేవితో అడవులకు బయలుదేరినప్పుడు దశరధ మహారాజు తన మంత్రి సుమంతుడుని పిలిచి “రాముడు సామాన్య మానవునిగా అడవులకు వెడుతున్నాడు. అతనిని వెంటనే వెనుకకు తిరిగి రమ్మని, ఇది రాజాజ్ఞగా చెప్పు” అన్నారు. పుతృడి మీద ఉన్న ప్రేమ దశరధుణ్ణి గుడ్డి వానిని చేసింది. రాజుగా తాను ఇచ్చిన ఆజ్ఞను రాముడు పాలిస్తాడనుకున్నారు. సుమంతుడు రాముల వారికి దశరధ మహారాజు వారి ఉత్తర్వులను తెలియచేశాడు. శ్రీరామ చంద్రుల వారు సంధిగ్ధంలో పడ్డారు. అయన ఆజ్ఞ ప్రకారం వెనుకకు మరలితే ప్రజలందరూ, దశరధ మహారాజు పుత్ర వాత్సల్యం చేత కైకేయి కిచ్చిన మాట తప్పినాడని విమర్శిస్తారు. శ్రీరామ చంద్రుల వారు సుమంతుడితో “నువ్వు చెప్పిన మాటలు నాకు వినపడినవి. కాని, రధం చాలా వేగంగా వెడుతున్నందు వల్ల నువ్వు చెప్పిన మాటలు నాకు వినపడలేదని, విషయం పూర్తిగా వినేలోగానే రధం అయోధ్య పొలిమేరలు దాటి వెళ్ళిపోయిందని మహారాజుకు చెప్పు. సమాజ క్షేమం కోసం ఈ ఒక్క అబధ్ధం చెప్పు .” అంటు శ్రీరామ చంద్రుల వారు ముందుకు సాగిపోయారు. రావణుడిని అంతమొందించడానికి భగవంతుడే శ్రీరామునిగా అవనిపై అవతరించారు. ఒక్కడుగు వెనుకకు వేస్తే తన అవతార కార్యానికి భంగం కలుగుతుంది. తగిన కారణం ఉండటం వల్లే శ్రీరామ చంద్రుల వారు తమ జీవితంలో ఒకే ఒక్కసారి అసత్యము పలికారు.
తగిన కారణంతో శ్రీసాయి అసత్యం పలకడం మనకు శ్రీ సాయి సత్ చరిత్రలోని 7వ.అధ్యాయంలో కనపడుతుంది. రామదాసి అనే భక్తుడు రోజుకు నాలుగు సార్లు విష్ణుసహస్ర నామాన్ని చదువుతూ ఉండేవాడు. అప్పటికే అతనికి విష్ణుసహస్ర నామం కంఠతా వచ్చేసింది. బాబా తనకు కడుపునొప్పిగా ఉన్నదని అసత్యమాడి, రామదాసిని సోనాముఖి ఆకులను తెమ్మని బజారుకు పంపి, రామదాసి చదువుతున్న విష్ణుసహస్రనామం పుస్తకాన్ని శ్యామాకు బహుకరించారు. బాబా శ్యామాతో “ఈ పుస్తకం చాలా పవిత్రమైనది. ఒకసారి నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు ఈ విష్ణుసహస్ర నామాన్ని నా గుండెలమీద పెట్టుకోగానే ఎంతో ప్రశాంతతని పొందాను. కనీసం రోజుకు ఒక్క నామాన్నయినా చదువు. అది నీకు ఎంతో మేలు చేస్తుంది. భక్తులందరికీ కూడా నీ ద్వారా నేను ఈ సందేశాన్నే ఇస్తున్నాను.” అన్నారు బాబా. “రామదాసి నాతో తగవు పెట్టుకుంటాడేమో” అన్నాడు శ్యామా. “ఆవిషయం గురించి బెంగపెట్టుకోవద్దు, ఏమిజరిగినా నేను చూసుకుంటానులే” అన్నారు బాబా.
శ్యామా విష్ణుసహస్రనామాన్ని బాగా అధ్యయనం చేసి, పూనాలోని డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసరుగా పనిచేస్తున్న ప్రొ.జీ.జీ. నార్కే గారికి దాని యొక్క ప్రాముఖ్యాన్ని వివరించాడు. ప్రతిరోజు విష్ణుసహస్ర నామాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాన్ని ఆవిధంగా బాబా మనకందరికీ తెలియచేశారు.
శ్రీమతి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గానం చేసిన విష్ణుసహస్ర నామాన్ని కూడా విని ఆనందించండి
http://www.youtube.com/watch?v=5NkfF3ZVCIo
(తరువాయి భాగంలో చరణకమలాల గురించి….)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- రామాయణంలో శ్రీసాయి 8వ. భాగము
- రామాయణంలో శ్రీసాయి 10వ. భాగము
- రామాయణంలో శ్రీసాయి 7 వ.భాగము
- రామాయణంలో శ్రీసాయి (3వ.భాగము)
- కృష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments