రామాయణంలో శ్రీసాయి 10వ. భాగము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

రామాయణంలో శ్రీసాయి 10వ. భాగము 

 మన హృదయాలను పరిపాలించేది భగవంతుని చరణకమలాలే అని రామాయణం ద్వారా మనకు అర్ధమవుతుంది.

శ్రీరామచంద్రుల వారు రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళారు. ప్రీతిపాత్రుడయిన రాముని యొక్క వియోగాన్ని భరించలేక దశరధ మహారాజు స్వర్గస్తులయారు . తాను లేని సమయంలో తల్లి మూర్ఖత్వం వల్ల ఇటువంటి విపరీత పరిణామాలన్ని జరిగడంతో భరతుడు చాలా దుఖించాడు. అరణ్యానికి వెళ్ళి రాములవారిని ఒప్పించి తిరిగి రాజ్యానికి తీసుకుని వచ్చి పరిపాలనా బాధ్యతలను రామునికి అప్పగిద్దామనుకున్నాడు. శ్రీరామచంద్రుల వారు తనకు బదులుగా తన పాదుకలను అయోధ్యకు తీసుకొనివెళ్ళి సింహాసనం మీద పెట్టి పరిపాలనా బాధ్యతలను నిర్వహించమని భరతుడిని ఒప్పించారు.  దీనివల్ల రామాయణంలో పాదుకలకు ఇవ్వబడిన ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. భరతుడు తన శిరస్సుపై పాదుకలను పెట్టుకొని అయోధ్యకు తీసుకొని వచ్చారు. అయోధ్యకు చేరిన తరువాత, పాదుకలను సింహాసనం మీద పెట్టి భరతుడు శ్రీరాములవారి తరఫున పరిపాలనా బాధ్యతలను చేపట్టారు.

శ్రీ సాయి సత్ చరిత్ర 5వ. అధ్యాయములో మనకు ఇటువంటివే కనపడతాయి.  బాబా షిరిడీలో ప్రవేశించిన దానికి అనుగుణంగా బాయి కృష్ణజీ, దీక్షిత్ లు బాబా పాదుకలను షిరిడీకి తీసుకొనివచ్చి వేప చెట్టుక్రింద ప్రతిష్టించారు.  పాలరాతి పాదుకలను వారు ఉపాసనీ మహారాజు గారి చేత ప్రతిష్టించ దలచి ఆయనను ఆహ్వానించారు.  ఉపాసనీ మహరాజు పాదుకలను 1912 వ సంవత్సరములో  శ్రావణ పూర్ణిమ రోజున వేపచెట్టు క్రింద ప్రతిష్టించి దానికి “గురుస్థాన్” అని పేరు పెట్టారు.  బాబా అక్కడకు వచ్చి “ఇవి భగవంతుని పాదుకలు” అన్నారు.

బాబా ఎప్పుడూ వాటిని  తన పాదుకలు అని చెప్పుకోలేదు.  “ఈ భగవంతుని పాదుకలను పూజించండి. గురు శుక్రవారములలో ఈ పాదుకలకు అగరుబత్తీలను, సాంబ్రాణి ధూపం వేసినచో భగవంతుని అనుగ్రహమును పొందగలరు” అని బాబా చెప్పారు. దీనిని బట్టి  పాదుకలకు మనము ఎంతటి ప్రాముఖ్యాన్నివ్వాలో అటు రామాయణం ద్వారా, ఇటు సాయి సత్చరిత్ర ద్వారా గ్రహించగలము.

శ్రీ సాయి సత్చరిత్ర 43, 44 అధ్యాయముల ద్వారా భాగవతము, రామ విజయముల యొక్క గొప్పతనము తెలుస్తుంది. సాయినాధుని మహాసమాధికి వాటికి సంబంధం ఉంది. సామాన్య మానవులు జీవిత ఆఖరి క్షణాలలొ భాగవతం వింటూ మోక్షాన్ని పొందగలరు. సాధు సత్పురుషులు తమ ఆఖరి క్షణాలలో మహా సమాధి అయేముందు రామవిజయాన్ని వింటారు. శ్రీరామచంద్రుల వారి అవతార పరిసమాప్తి అయేముందే రామవిజయం యొక్క ప్రస్తావన వస్తుంది. శ్రీరాముల వారికి మరణం లేదు. బాబా మహా సమాధి అయే సమయములో తన భక్తుడయిన వాఝే చేత రామ విజయాన్ని చదివించుకోవడానికి బహుశా ఇదే కారణమయి ఉంటుంది.  ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి శ్రీరాములవారు తన అవతారాన్ని ఎట్లా చాలించారో మనము తెలుసుకొందాము.

శ్రీరాముల వారు తన కుమారులయిన లవ కుశులకు పట్టాభిషేకం చేశారు.  సీతామాత ఎన్నోకష్టాలను అనుభవించి ఇక తన పాత్రను ముగించుకుందామని నిశ్చయించుకొన్నది. తాను  ఎక్కడినుంచయితే జన్మించిందో ఆపుడమి తల్లి ఒడిలోకే  చేరుకొన్నది.  ఇక శ్రీరామచంద్ర్రలవారికి ఏమి మిగిలింది? లక్ష్మీదేవి అప్పటికే  విష్ణులోకానికి వెళ్ళిపోయింది.
ఆమె ప్రక్కన ఉండటానికి తను కూడా వెళ్ళాలి. అందరూ చూస్తుండగా, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు, నలుగురూ కూడా సరయూ నదిలోకి ప్రవేశించి అదృశ్యమయ్యారు. సరయూ నదిలోనించి, శంఖు చక్ర గదా ఆయుధాలను ధరించి ఆదిశేషునిపై పవ్వళించి శ్రీమహావిష్ణువు స్వర్గలోకానికి వెళ్ళారు. ఇదంతాకూడా రామాయణంలో వర్ణించబడి ఉంది.

బాబా మహాసమాధి ఎలా చెందారన్న విషయం మనకు శ్రీ సాయి సత్చరిత్ర 43 – 44 అధ్యాయాల ద్వారా తెలుస్తుంది. అక్టోబరు 15 వ. తేదీ 1918 సంవత్సరము విజయదశమి  మధ్యాహ్న్నము వేళ దశమి వెళ్ళి ఏకాదశి ఘడియలు సమీపిస్తున్న సమయములో  బాబా ద్వారకామాయిలో తన శరీరాన్ని త్యజించి విష్ణులోకానికేగారు.  రామాయణంలో శ్రీరామ చంద్రులవారు, శ్రీసాయి సత్చరిత్రలో బాబా ఇద్దరూ కూడా  విష్ణులోకానికి చేరుకొన్నారు.  ఆనాటి శ్రీరాముల వారే ఈనాటి  శ్రీ షిరిడీ సాయిరాముల వారని తెలియచేస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. 

రామాయణంలో శ్రీసాయి సమాప్తము

 ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles