రామాయణంలో శ్రీసాయి 6వ. భాగము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

రామాయణంలో శ్రీసాయి 6వ. భాగము

కైకేయి దశరధ మహారాజుతో రామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరింది. దశరధ మహారాజు దానికి అంగీకరించారు. దశరధ మహారాజు రాముని వియోగం భరించలేక  మరణించారు.  ఆసమయంలో ఆయన ప్రక్కన, రాముడుగాని, లక్ష్మణుడు గాని, భరతుడు గాని, శతృఘ్నుడు గాని   లేరు. భరతుడికి జరిగిన విషయాలన్నీ కూడా తన తాతగారి ఇంటినించి అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత తెలిసాయి. తనకు పట్టాభిషేకం జరగాలని తన తల్లి కోరినా భరతుడు  అంగీకరించలేదు.  తన తండ్రి తన తల్లి కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీ రాముడు అడవులకు వెడుతూ  తన సిరిసంపదలన్నిటినీ  ప్రజలకు దానం చేసి వెళ్ళినాడని తెలుసుకొన్నాడు.  శ్రీరాముడు సంతోషంగా తన సింహాసనాన్ని భరతునికి ఇచ్చిన సంఘటన రామాయణంలో వివరంగా చెప్పబడింది.   ఇటువంటి సంఘటన మనము .

శ్రీ సాయి సత్చరిత్ర 10వ. అధ్యాయములో చూడగలము.

ద్వారకామాయిలో బాబా వద్ద భక్తులంతా చేరి ఆయన కూర్చోవడానికి మంచి ఆసనం తయారు చేసి అందులో మెత్తటి  దిండ్లు అమర్చారు.  ఆయనకు దండ వేసి ఆ సుందర మనోహర దృశ్యాన్ని చూసి అందరూ ఆనందించేవారు.

నానావలి అనే భక్తుడు వచ్చి బాబాని ఆ ఆసనం తనదని చెప్పి బాబా ని లేవమని చెప్పినపుడు,  శ్రీరాముడు తన సింహాసనాన్ని భరతునికి త్యాగం చేసిన విధంగానే బాబా తన ఆసనాన్ని సంతోషంగా నానావలికి ఇచ్చారు.

మనము ఇక్కడ మరొక విషయాన్ని  తెలుసుకుందాము.  అయోధ్యకాండలో దానం గురించి ప్రముఖంగా చెప్పబడింది. అరణ్యానికి పయనమవుతున్నపుడు దారిపొడవునా ఉన్న ప్రజలకు శ్రీరాములవారు తన నగలనన్నిటిని స్వచ్చందంగా దానం చేశారు.  ఆసమయములో ఒక బ్రాహ్మణుడు ముందుకు వచ్చి రాముడితో తనకు గోవులను దానం చేయమని అడిగాడు. నీకెన్ని గోవులు కావాలి అని శ్రీరాములవారు అడిగినపుడు ఆబ్రాహ్మణుడు   “నేను నా చేతిలో ఉన్న కఱ్ఱను ఇక్కడినుంచి విసురుతాను. ఆ కఱ్ఱ ఎంత దూరమయితే వెళ్ళి పడుతుందో అంత దూరమువరకు వరసలో నిలబడిన గోవులు కావలెను అన్నాడు”  శ్రీరాములవారు ఆ సమయంలో  అయోధ్య పొలిమేరలుదాటలేదు కనక మంత్రి సుమంతుడిని పిలిచి యువరాజుగా తన ఆజ్ఞ ప్రకారము ఆబ్రాహ్మణుడికి గోవులను దానం చేయమని చెప్పినారు.

1909 – 1918 సంవత్సరాల మధ్య కాలంలో బాబా తన భక్తుల వద్ద నుండి ప్రతీరోజు సుమారు 500 రూపాయలను దక్షిణగా తీసుకొంటు ఉండేవారు.  మరలా వచ్చిన ఆ డబ్బునంతా తన భక్తులందరకూ పంచిపెడుతూ ఉండేవారు.  ఈ రోజుల్లో మనకంతటి  ఉదార స్వభావం ఎక్కడ ఉంది?  సాయంత్రమయేటప్పటికి ఆయన వద్ద ఏమీ మిగిలి ఉండేది కాదు.  మరలా మరునాడు ఉదయాన్నే భిక్షా పాత్ర పట్టుకొని భిక్షకు బయలుదేరేవారు. మన సాయి రాముడు కూడా రామాయణంలోని శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తన దగ్గిర ఉన్నదంతా దానం చేసినట్లుగానే బాబా తన భక్తులకు దానం చేసేవారు. 

రామాయణ కాలంలో కొంతమందికి జంతువులు, పక్షులు, క్రిమికీటకాదుల భాషలు తెలుసు. ఒకరోజున కైకేయి మహారాజు, తన రాణితో కలసి తోటలో విహరిస్తున్నారు. ఇప్పుడు మనము మన పెంపుడు జంతువులకు పేర్లు పెట్టుకున్నట్లు గానే ఆకాలంలో కూడా జంతువులకు పేరు పెట్టి పిలిచేవారేమో. అప్పుడు అక్కడ జృంభకము అనే మగ చీమ ఆడచీమతో మాట్లాడుతూ ఉండటం వాటిని కైకేయి మహారాజు చూడటం, ఆరెండు  చీమల సంభాషణ విన్న తరువాత కైకేయ మహరాజు చిన్న చిరునవ్వు నవ్వినారు. ఎందుకు నవ్వుతున్నారని మహారాణి అడిగింది. “అది ఒక మగ చీమ ఆడ చీమ మాట్లాడుకుంటున్నాయి.  ఆవిషయం గురించి తరువాత చెపుతాను” అన్నారు కైకేయ మహారాజు. అందుచేత రామాయణంలో జరిగిన ఇటువంటి సంఘటనలు చూసిన తరువాత ఆకాలంలో క్రిమికీటకాలు, జంతువుల మధ్య కూడా సమాచార సంభాషణా వ్యవస్థ ఉందనే విషయం మనకి అర్ధమవుతుంది.

ఇప్పుడు నేను చెప్పిన విషయానికి శ్రీసాయి సత్చరిత్రకు ఉన్న సంబంధం ఏమిటన్నది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. శ్రీ సాయి సత్చరిత్రలోని 15 వ. అధ్యాయాన్ని ఒక్కాసారి గుర్తుకు తెచ్చుకుందాము. ద్వారకామాయిలోఒక బల్లి వింతగా శబ్దం చేయసాగింది.. అప్పుడక్కడ ఉన్న భక్తుడొకదు ఆ బల్లి శబ్దం శుభానికి సంకేతమా లేక అశుభానికా అని కుతూహలంతో బాబాని అడిగాడు.  ద్వారకామాయిలోని బల్లి,  ఔరంగాబాదు నుంచి తన చెల్లెలు రాక కోసం ఎదురు చూస్తోందని బాబా సమాధానమిచ్చారు. రామాయణ కాలంలో వలేనే,బాబాకు కూడా క్రిమికీటకాలు, జంతువుల భాష తెలుసు.  ఈ కలియుగంలో మన సాయి రాముడికి క్రిమికీటకాదులు జంతువులభాష తెలుసుకొనే శక్తి  ఉందనే విషయం శ్రీసాయి సత్ చరిత్ర చదివే వారికందరకూ తెలుసు.

(రామాయణంలోకి మనము మరికాస్త ముందుకు వెడదాము)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles