నమ్మితే దర్శనమేంటి నిజదర్శనమే ఇస్తారు సాయి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయిబంధువులందరికీ సాయిరాం.

నా పేరు సాయి మూర్తి. మా కుటుంబము, మా అన్నగారి కుటుంబము మొత్తం 8 మంది 2015 లో గురుపౌర్ణమికి షిరిడీకి వెళదామని టికెట్లు బుక్ చేయడానికి నాంపల్లి రైల్వేస్టేషనికి వెళ్ళాను. టికెట్లు లేవు.

వెంటనే మా వదినకి ఫోన్ చేసి టికెట్లు లేవు ఏమి చేద్దాం అని యడిగాను. 15 నుండి 20 తారీకు మధ్యలో చూసి ఎప్పుడుంటే అప్పుడు బుక్ చేయి అని చెప్పారు.

అయితే  జూలై 17 కి టికెట్లు బుక్ చేసాను. 18 వ తారీకు రంజాన్ పండుగ. ఆ పర్వదినాన షిరిడీలో దిగాము.

9 గంటలకు లైనులో మొత్తం 8 మంది నిలబడ్డాము. అయితే నా దగ్గర “బాలల బాబా సాయిబాబా” అనే జీవిత చరిత్ర ఉంది. అది పారాయణం చేసుకుంటూ లైనులో వెళుతున్నాము.

క్రింద పది లైనులు తిరిగి తిరిగి మొదటి అంతస్తులోకి వెళ్ళాము. అప్పటికి ఆ సచ్చరిత్ర పూర్తయింది.

పైన అంతస్తులో కూడా పది లైనులుంటాయి కదా! అలా లైనులో 8 మంది వెళుతున్నాము. ఒకటే రద్దీ.

నాలుగు లైన్లు దాటిన తరువాత లైను ప్రక్కన బెంచీ మీద ఒక ముసలాయన కూర్చున్నారు. పాపం నడవలేక కూర్చున్నారు అని మా ఆవిడతో అన్నాను. ఆయనను దాటి వెళ్ళిపోయాము.

మళ్ళీ ప్రక్క లైనులోకి వెళ్ళేసరికి అక్కడ కూర్చున్నారు. ఆయనను దాటి వెళ్ళిపోయాము. మళ్ళీ ప్రక్క లైనులోకి వెళ్ళేసరికి అక్కడ కూర్చున్నారు. అలా ఐదు లైన్లలో మాకన్నా ముందుగా వెళ్ళి కూర్చున్నారు.

మమ్మల్ని దాటిగాని, ఒక లైనులోంచి ఇంకొక లైనులోకి జంప్ చేసి గాని వెళ్ళే పరిస్ధితి లేదు. అప్పటికి మాకు బాబాగారే అలా కూర్చున్నారు అనే ద్యాస రానివ్వలేదు.

అలా లైనులో వెళుతూ వెళుతూ “సమాధి మందిరం” లోకి అడుగుపెట్టాము. బాబాగారి దర్శనము చేసుకొని బాబాగార్ని చూసుకుంటూ వెనక్కి వచ్చాము.

అయితే నేను ఎప్పుడు షిరిడీకి వెళ్ళినా సమాధి మందిరంలోకి వెళ్ళగానే చేతులు రెండు పైకి ఎత్తి “బాబా చల్లగా చూడు తండ్రి” అని గట్టిగా అరుస్తాను. అలానే ఆ రోజు కూడా చేతులు పైకెత్తి బాబాగార్ని చూస్తూ గట్టిగా అరిచాను.

ఎక్కడో క్రింద కనబడిన ముసలాయన మళ్ళీ సమాధి మందిరంలో నేను అరుస్తుంటే నా ప్రక్కనే ఉండి నన్ను చూస్తూ నవ్వుతున్నారు.

అప్పుడు కూడా నాకు ఆయన బాబాగారే అని ద్యాస రాలేదు. ఎందుకంటే ఎంత సేపు నా చూపులన్నీ ఆ దివ్యమూర్తి మీదే ఉన్నాయి.

ప్రక్కన నిజ దర్శనం ఇచ్చిన బాబాని పట్టించుకోలేదు. సరే బయటికి వెళ్ళాక ఆయన కూడా బైటకి వస్తారు కదా అప్పుడు మాట్లాడుదాము అనుకున్నాను.

బైయటకి వెళ్ళిన అందరం ఎదురుచూస్తున్నాము. ఇంతలో మా వదినగారు ఎవరికోసం ఎదురుచూస్తున్నారు అని అడిగారు.

ఒక ముసలాయన లైనులో ఐదు సార్లు కనబడ్డారుగా ఆయన లోపల ఉన్నారు. ఆయన కోసం చూస్తున్నాము అని మా అబ్బాయి చెప్పాడు.

మా నలుగురికి కనబడలేదు మూర్తి అని మా వదిన, అన్నయ్య, పిల్లలిద్దరు సమాధానమిచ్చారు.

అయ్యో బాబా ఈ విధంగా మా కుటుంబానికి మాత్రమే దర్శనమిచ్చావా తండ్రి అని చాలా చాలా సంతోషించాను. కనిపెట్టలేక పోయామే అని బాధపడ్డాము.

నమ్మి కొలిచినందుకు 2006 లో మొదటి సారి షిరిడీకి వెళ్ళినప్పుడు (ఆత్మజ్ఞానం కోసం ఒక కోటీశ్వరుడు మసీదుకు వచ్చినప్పుడు బాబాగారు 5 రూపాయలు తెమ్మని ఒక పిల్లవాడ్ని అప్పుకోసం పంపించినట్లు)

బిచ్చగాడి రూపంలో వచ్చి “ముజే ఏక్ కూపన్ లేవోనా” అని అడిగారు. అప్పుడు సంస్ధానములో భోజన కూపన్ ధర రూ. 5/–. ఏమీ ఆలోచించక కూపను తీసుకొని ఇచ్చాను.

మళ్ళీ 2015 రంజాన్ పర్వదినాన తెల్లటి బట్టలు ( పైజామా, జుబ్బా) వేసుకొని తెల్లగడ్డంతో పొట్టిగా ఉండి దర్శన భాగ్యం కల్పించారు.

ఈ విధంగా రెండు సార్లు నిజదర్శన భాగ్యం కల్పించారు. గురువారం రోజు ఆ ద్వారకాధీశుడి ఆశీర్వాదముతో మీ అందరికీ తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై సాయిరాం.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నమ్మితే దర్శనమేంటి నిజదర్శనమే ఇస్తారు సాయి–Audio

kishore Babu

సాయివంటి దైవంబు లేడోయి లేడోయి…సాయి బాబా…సాయి బాబా

Sai Suresh

బాబా దర్శనం లభించిన మాయ మనల్ని గుర్తిన్చానివ్వాదు

Very nice murthi garu om sairam

Murthi gariki baba garu chesini leela chala adrustam andhuke baba varu antaru you look to me i look. to you om sairam

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles