చదివి ఉన్నదేదో స్వానుభవానికి తెచ్చుకోక , ఉత్తమాటలతో ఉన్నకాలమంతా వ్యర్థమే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Author : Kota Prakasam garu

చదివి ఉన్నదేదో స్వానుభవానికి  తెచ్చుకోక , ఉత్తమాటలతో  ఉన్నకాలమంతా వ్యర్థమే …
*****

పాలసముద్రాన్ని చిలికితె మొదట పుట్టింది హాలాహలమే .. ఆ తర్వాత గుర్రం , కామదేనువు , కల్పవృక్షం , ఐరావతాలు పుట్టింది అందులోనే ..
చందృడు , లక్ష్మీదేవి , అమృతం ఉద్భవించింది కూడా ఆ సాగరమధనంలోనే ..

తుదకు లక్ష్మీదేవికి పుట్టిల్లైన ఆ పాలసముద్రంపైనే , మహావిష్ణువు ఆదిశేశుని పాన్పుపై , యిల్లరికపు అల్లుడై అమ్మవారి పాదసేవలొ సేదతీరుతున్నది అక్కడే ..

భారతంలొ పిట్టకధలంటారు అలా ప్రతిపురాణంలోనూ సూటిగా చెప్పిన భక్తిని పెంపొందించే విషయాలతోపాటు, అంతర్గతంగా అందించిన సాగరమదనంలాంటి సాధనా మార్గాలు కొన్ని అందించబడ్డాయనిపిస్తుంది ..

పురాణాలు నిజమేనా , ఇవి కల్పితాలే అన్న హేతువాదంతో వాగ్వివాదాలు అనవసరం ..

దానివల్ల నష్టపోయేది ఆస్తికవాదమే. ..

కంటికి కనిపించేదే నిజమని నమ్మే హేతువాదంతో , మనసును నిలిపి మధురానుభూతిని పొందినవాడు,అనిర్వచనీయమైన ఆత్మఅనుభూతిని వర్ణించ సాధ్యమౌతుందేమోకానీ , పొరలుకమ్మే సాదారణ కంటిచూపుకు తనలోనే ఉంటూ ఆజ్ఞాపించే మనసును , ఒకరూపమంటూలేని సృష్టికి ఆధ్యమైన శక్తిని తేరిపారాచూడగలిగే సాధన పరాకాష్టకిచేరితేతప్ప ఎవరికీ సాధ్యంకానిపని ..

ఆస్వాదించక సాదన అనే పదానికి అర్థమే ఉండదేమో ..

ఒక కుక్కకు ఉచ్వాస నిశ్వాసలు అతివేగంగా ఉంటాయి .అందుకె ఆ జాతి గట్టిగా యిరవైసంవత్సరాలకు మించిబ్రతకడం కష్టం .. తాబేలు అతినిధానంగా శ్వాస తీసుకొంటుంది అందుకె అది నాలుగువందల సంవచ్చరాల పయిగా ఆయష్షు కలిగిఉంటుందంటారు ..

అంటే శ్వాసను నిబద్ధించుకొంటే , మనిషి ఆయువు పొడిగించబడుతుందని గతంలో అర్ధంచేసుకొన్న ఎవరొ ఒకరి స్వానుభవం వలన , ప్రాణాయామ నియమం లోకానికి అందించబడివుండవొచ్చు ..

దేవుడులేడు , దయ్యాలులేవు అనడం ఎంతతేలికో , సాధనతొ స్వానుభవానికి తెచ్చుకోడం అంతకష్టం ..

సద్గ్రంథాలు ఉద్దేశింపబడింది మనిషి సత్ప్రవర్తనతో తననితాను ఉద్ధరించుకొనేందుకే ..

నాస్తికుడైనంతమాత్రాన రాక్షస స్వభావులుండరు ..

ఆస్తికులమని చాటుకొన్నంతమాత్రాన అందరూ సాత్త్విక స్వభావులుకాకపోవొచ్చు ..

అయితె ఒక మంచిమాట , ఒక మంచి విషయం విని , సత్ప్రవర్తనతో ప్రవర్తించేందుకు ఏవర్గమైన ఒకటే ..

విషం పుట్టినచోటే అమృతమూ పుట్టింది , కష్టపడినచోటే సుఖమూ సంప్రాప్తమౌతుంది అని అనుభవజ్ఞులమాట ..

కంటికి గోచరించని దైవాన్ని రుజువుచేయమంటే సాధ్యకాకపోవొచ్చుకానీ , గ్రంథాలను చదివి , ఆకలింపుచేసుకొని , సాధనతొ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందినవారు చరిత్రలో ఎందరో గతమె రుజువుచేస్తుంది …

దెవుడున్నాడా , లీలలు నిజమేనా అన్న వాదనలకంటే , తీర్చిదిద్దె గ్రంథాలలో పారాయణలోని అంతరార్థం ఒక మనిషిలో చైతన్యానికి మేలుకొలుపుకొరకే , అది విశ్వకళ్యాణం కొరకే ఆపాదించబడిందని అనుభవానికొస్తే , ఈ సృష్టికి మూలమయినది ఏదో కూడా స్వానుభవానికొస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా అందించినమాట ..

శ్రీ గురుభ్యోన్నమః
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles