Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మాతాజీ కృష్ణ ప్రియ జీవితం అంతా సాయిమయం. ఆమెకు 9 సంవత్సరాల వయస్సులో బయట ఆడుకుంటూ వుంటే బాబా ఆమెకు దర్శనం ఇచ్చారు.
నేను నీకు గత ఎన్నో జన్మల గురువును అని చెప్పారు. ఆ పసి మనసుకు ఏమి అర్థంకాక అమ్మ దగ్గరికి పరుగులు పెట్టింది భయంతో అమ్మ, “ఆ సన్యాసి ఏదో ఇలా అన్నారు” అని చెప్పింది.
అమ్మ చిన్న పిల్లలే, ఏదో అంటూవుంది అని వూరికే వుండిపోయింది. ఆ కాలంలో చిన్న పిల్లలకే పెళ్ళి చేసేవాళ్ళు. ఈమెకు కూడా 10 వ ఏటనే పెళ్ళి, మళ్ళీ బాబా కనపడి నీకు పెళ్ళి చేస్తారు, అయినా నేను నీ తోనే వున్నాను. “ఓం శ్రీ సాయినాథాయ నమః” మంత్రం జపం చేసుకో అని చెప్పారు. ఆమె అలాగే చేసింది.
పెళ్ళి అయింది, అత్తవారింటికి వెళ్ళింది. చాలా కష్టాలు, అంటే వర్ణింప నలవి కాని కష్టాలు పడింది. ఆ కాలంలో చిన్నపిల్లలను, పెద్ద ఆయనకు ఇచ్చి పెళ్ళి చేసేవారు. ఆమె భర్త ఆమె కన్నావయసులో చాలా పెద్దవారు.
తంతి తపాలా శాఖలో ఉద్యోగం. దైవ భక్తి అసలు లేదు. ఈమె మూర్తిభవించిన దైవభక్తురాలు అది ఆయనకు నచ్చదు. ఇంకేముంది సంసారం ఒక చదరంగం అయింది ఆమె పరిస్థితి.
అప్పుడు మళ్ళీ సాయినాధుడు కనపడినాడు. అప్పటికి ఆమెకు జ్ఞానం కొంచెం వచ్చింది.సంసారం అంటే ఏంటో తెలిసింది.సాయినాధుడు నేను నీతోనే వుంటాను. నిదానంగానే కష్టములన్నీ గట్టెక్కిస్తాను చింతింపకు అన్నారు.
ఆమె తెల్లవారి 3 గంటలకు లేచి నామ జపం చేసేది. ఒక రోజు ఆమె జపం చేస్తూ వుంది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. భర్త కు office time 8 గంటలకు అయింది. ఈవిడ ఎంతకు రాదు. ఆయనకు సహనం పోయింది.
ఇంతలో బాబానే ఆమెరూపంలో వచ్చాడు.(ఒక్కసారి ఆలోచించండి, దైవం మానుషరూపేణ అంటె ఇదే, మనతో ఆడతాడు,పాడతాడు, మనలో ఒకనిగా వుంటాడు, కాని పై నుంచి దిగివచ్చిన అవతారం అది), ఆయనకు తాంబూలం అలవాటే. ఆయనకు తాంబూలం డబ్బా కట్టించాడు, shoes clean చెయ్యవే తొందరగా అని అరుపు ఆ భర్తగారు. మన మారు వేషములో వున్న ఆ పరాత్పరుడు shoes కూడా clean చేసి ఇచ్చాడు.
భగవంతుడు భక్తురాలి కోసం ఏమైన, చేస్తాడు.(నేను ఇవన్నీ చదివినప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. చతుర్భవ భువనాలకు ఏకైక చక్రవర్తి, ఒకే ఒక్క వూపిరి, ఈ 14 భువనాలను నిలిపి వుంచింది, అయన ఉచ్చ్వాస , నిశ్వాసలు ఒక్క క్షణం గతి తప్పిన, అల్ల కల్లోలం జరుగుతుంది. ఆలాంటి పరాత్పరుడు సాయినాథుడు భక్తురాలి కోసం పడిన వేదన) ఆయన office వెళ్ళిపోయినాడు.
ఈమె సమాధిస్థితి నుంచి బయటికి వచ్చి చూస్తే, తన భర్త office కు వెళ్ళిపోయినాడు. హతవిధి: ఇంక ఈరోజు నా పని అంతె అనుకుంది. ఇంటికి వస్తె ఎంత పెద్ద గొడవ అవుతుందో, నేను ఆయన వెళ్ళేటప్పుడు తాంబూలం ఇవ్వలేదు, ఆయనతో లేను, బాబా . ఏమి చేస్తావో అనుకుంది.
సాయంత్రం రానే వచ్చింది మహాప్రళయం ఇంకో విధంగా అయితే. అయన ఇంటికి వచ్చి ఈ రోజు తాంబూలం చాలా బాగా చేశావు. చాలా రుచిగా వుంది(ఎందుకుండదు, భగవంతుడు కదా తయారు చేసింది) రోజు ఎందుకు అలా ఎందుకు చేయవు? అని గోల.
ఈవిడాకు అర్థంకాలేదు. ఈ రోజు నేను మీకు ఇవ్వలేదండి అనింది ఆయన వినడు లే అనుకోని గమ్మున అయిపోయింది. తరువాత రోజు మళ్ళీ అలాగే ఆమె 3 గంటలకు లేచి పూజలో వుంది. పొరపాటున నిన్నలా సమాధి స్థితికి వెళ్ళిపోతానేమో, అనుకుంది.
ఇంతలో మళ్ళీ బాబా ఆమె వేషంలో వచ్చి ఆయనకు TEA చేసి ఇచ్చారు. చాలా బాగా చేశావు TEA రోజు ఇలా చెయ్యవచ్చుగా అని మళ్ళీ మొదలు పెట్టాడు, వెంటనే పైకి చూశాడు. అక్కడ ఆమె నిలబడివుంది. పక్కకు చూశాడు, పక్కన వుంది. ఇదేంటి, రెండు చోట్ల వుంది అనుకున్నాడు.
ఇంతలో పక్కనే వున్న బాబా మాయం. ఆమె పై నుంచి క్రిందికి పరుగున వచ్చింది. అరే, TEA ఎవరు పెట్టిచ్చారు! అని అడిగింది.నువ్వే కదవే, ఇచ్చావు, అన్నాడు. అలా ఆమె భర్తను మార్చడానికి బాబా ఆమెలాగే కనపడేవాడు.
ఇలా ఆమె జీవితం మొత్తం బాబా మయం. ఇంతకీ అసలు విషయం చెప్పనా, ఆమె కృష్ణ భక్తురాలు. కృష్ణ సందర్శనాభిలాషి. ఆమెకు బాబా గురువు మాత్రమె. గురువు ప్రసన్నుడు అయితే ఇష్టదైవ దర్శనం అవుతుంది.
ఇంకా చాలా వుంది మాతాజీ కృష్ణ ప్రియ కధ. ఇది ఒక చిన్న నీటి బిందువు మాత్రమే.
సర్వం సాయినాథార్పణమస్తు
మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- మాతాజీ కృష్ణ ప్రియ జననం
- బాబా మరల కృష్ణ ప్రియ కు దర్శనం ఇచ్చి నీకు త్వరలో మారకం వుంది, నేను రక్షిస్తాను
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- ఆ గురుదేవులు(సాయినాథుడు) అందరికి పరీక్ష పెడతాడు. కృష్ణ ప్రియ లాంటి వాళ్ళు పరీక్షలో నెగ్గుతారు.
- మాతాజీ కృష్ణ ప్రియా ను బాబా తాను పాదాలు చెంతకు చేర్చుకొనుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
35 comments on “నాకు తెలిసిన మాతాజీ కృష్ణ ప్రియ జీవిత గాధ(సాయి మయం)”
Deepu
January 25, 2018 at 7:53 pmSuper story.mam.
T.V.Gayathri
January 25, 2018 at 8:08 pmసాయిబాబ సర్వాంతర్యామి. భక్తుల కష్టాలు తెలుసు కొని వాటిని రూపుమాపే భగవంతుడు.
Radhika J
January 25, 2018 at 8:59 pmJai jai sairam
soundarya
January 25, 2018 at 9:47 pmAum sri sai ram
Radha
January 26, 2018 at 5:23 amMathaji story bhale vundhi.Madhavi.sairam ki jai
Gautam
January 26, 2018 at 5:26 amMadhu.Mathaji krishna priya..Story..So many times we discussed about her..Very gud story selected..sairam.at sambalpur long back we met her daughter..Kadha.
Gapal
January 26, 2018 at 5:27 amChala baaguntundhi mathaji life story.we r rathalu waiting..Mam.
Gapal
January 26, 2018 at 5:42 amSry.eargerly waiting for that story.
Radhika
January 26, 2018 at 5:43 amAbbaa..Super vundhi.mathaji story..Mam.we r waiting for that.
Vijaya akka.
January 26, 2018 at 5:46 amMadhavi..Ekkada collect chesavu.nuvvu..Chalaa baagundhi..Malli waiting..Saibaba bless u .Sai charitra roju andharitho meeru chadivistunnaru
Swathi
January 26, 2018 at 6:01 amNew beginning with Mathaji.fantastic.sairam.
Sudip
January 26, 2018 at 6:03 amAap story bolrahaahe.ham sunrahaahe..Wonder he mam..Sai baba is doing so many wonders.
Gouri
January 26, 2018 at 6:04 amNenu vinnanu.mathaji gurinchi.entha details theleedhu.waiting for detailed story
Ratna
January 26, 2018 at 6:05 amChalaa baagundhi.aunty..Waiting for that story.
Sachin
January 26, 2018 at 6:06 amJaisairam..
Sampa
January 26, 2018 at 6:08 amNaaku elaa express cheyyalo thelitam ledhu..Saibaba Leelalu agaatham
Srikanth
January 26, 2018 at 6:10 amElaa thelusu pinnamma..Neeku..Baba gurinchi neeku chalaa bhakthi vundhi ani telusu..Maku nee valla baba blessings vasthayi.evi chadivithe.
Vishnupriya
January 26, 2018 at 6:11 amAmazing story..Mam..We all are waiting for next part.
Raghu
January 26, 2018 at 6:30 amWow..Super experiences.Mathaji krishna priya.waiting remaining story.
Shobha
January 26, 2018 at 6:31 amChala chala baagundhi.krishapriya story..Sairam.
Maruthi Sainathuni
January 26, 2018 at 12:58 pmSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
b vishnu Sai
January 26, 2018 at 1:19 pmMaa pinamma madhavi gaaru vivarinchina Mata krishnapriya gaari charithra Ni swayam ga aavida tho akkadi pradesam veekshinchinanduku dhanyudini Ani bhavistunanu, om sai ram
Madhavi
January 26, 2018 at 6:24 pmYess.vishnu..U r always with me in my Baba’s long journey.thank u very much my dear son..And baba bless u.
Madhavi
January 26, 2018 at 6:27 pmఅసలు ఆవిడ గురించి చెప్పే సాహసం చేసాను..బాబా దయ వలన..ఇంతకీ.సముద్రం లో నీటి బిందువు..నేను రాసింది..ఇంకా చాలా ఉంది..ఆ బాబా కృప ఉంటే మళ్ళీ రాస్తాను..ఆమె గురించి…
kishore Babu
January 27, 2018 at 4:27 amచాల అద్భుతమైన లీల…నేను ఈ వెబ్ సైట్ చేసేటప్పుడు ..నాకు తెలియకుండానే ..నా శారీరము అంతా అధోకరకమైన స్థితిలోకి మారిపోయి …రెండు రోజుల వరకు నాకు ఏమి తెలియ లేదు. ఆ తరవాత ఎవరో వచ్చి నా తలుపు తట్టారు..అప్పుడు యధాస్థితిలోకి వచ్చాను..మెస్ కి వెళ్ళితే ..నువ్వు రెండు రోజులనుంచి మెస్ కి రావడం లేదు అని అడిగారు…అప్పుడు నాకు చాల ఆశ్చర్యం అనిపించింది…అప్పుడు ఆర్డమయింది…అదే సమాధి స్థితి అని…సాయి బాబా..సాయి బాబా…
Maruthi Sainathuni
January 27, 2018 at 2:02 pmThank u mam.Sai Baba…Sai Baba
Karuna
January 27, 2018 at 5:23 pmChalaa baagundhi.mathaji story.
Dheeraj
January 27, 2018 at 5:29 pmChalaa baagundhi.mam..Waiting for remaing part of life story..
Arunavalli
January 27, 2018 at 6:03 pmKrishna priya gaari bhale vundhi.mam..Enka raayandi.mam.andharu vuntaaru.
Sreenivas
January 29, 2018 at 4:19 pmనాకు బాబా లీలాలను Saileelas.com లో upload చేస్తున్నప్పుడు అంతకు ముందు ఎప్పుడు feel అవ్వని ప్రశాంతతను పొందాను…ఎంత అంటే ఇంత ప్రశాంతత బాబా ఎవరికీ ఇవ్వరేమో అంత. ముఖ్యముగా శిరిడీలో ఉన్నప్పుడు నాకు స్పష్టంగా అనిపించేది. ఈ jan 1st కి శిరిడీ లో ఉన్నప్పుడు Net center నేను తప్ప వేరే వారు ఉండారు. నాకు ఒక రోజు miracle టైపు చేసి upload చేయడానికి 2 1/2 hours పడుతుంది. upload చేసిన తరువాత వచ్చిన ప్రశాంతత negative అవ్వకుండా (బాబా నాకు మాత్రమే ఇంత ప్రశాంతత ఇచ్చారు) గురువు గారి సమాధి(శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ, సాయిపథం) చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశాను.
Saileelas.com లో నాకు work దొరికినందుకు నిజంగా నేను అదృష్టవంతుణ్ణి.
Thanks to Baba
Madhavi
January 29, 2018 at 5:11 pmఎన్నిసార్లో అడిగాను.మిమ్మల్ని.ఎందుకు ఏమిరాయరు.అని..ఇప్పుడు అర్థం ఎయ్యింది..బాబా దగ్గర ప్రశాంతత చాలా ఉంటుంది.నేను.మీరు.doing same work in a different way..Both say thanks to Mr kishoregaru..And god bless him always.
Mithali
January 29, 2018 at 5:12 pmChalaa baagundhi.krishapriya gaari leela.waiting for next part
Vidya
January 29, 2018 at 7:16 pmOm Sai ram . Bhalai undi pinnama .
K.raga divya
February 3, 2018 at 2:17 pmVery nice story and waiting for next part sairam
Madhavi
February 4, 2018 at 2:49 pmIt’s already started..Go through all miracles done in mathaji krishna priya life.