ధర్మానికి మనసు కట్టుబడితె , ఆ థర్మాన్ని ప్రబోధించిన మూలముమీద ఏకాగ్రత కుదురుతుంది



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Author : Kota Prakasam garu

అమ్మలేక జన్మాలేదు ధర్మంనేర్చక జన్మకు అర్ధమూ లెదు
*****

“రుచుకీ సుచికీ మా హోటలు ప్రత్యేకత ” అని ప్రతి హోటలుముందు బోర్డు స్వాగతం పలుకుతూ ఉంటుంది ..

హోటలు ఎంత అధునాతంగాఉన్నా , ఎన్ని రకాల పదార్దాలు నోరూరించినా , రుచి ఎలాఉందని నిర్ణయించబడేది తినిన తర్వాత ,తినిన వ్యక్తుల ప్రచారం వల్లనే ..

పదార్దాలు పదిరకాలున్నా , ఒక్కొక్కరు ఒక్కొ రుచిని ఆస్వాదిస్తారు ..

యజమాని బాగ ఆదరించిన , ఒడ్డించేవాడు ఎంత వినయాన్ని ప్రదర్శించిన , పదార్ధాలు వొండేవాడు సక్రమంగాలేకుంటే , ఆ హోటలువైపు ఎవరూ ముఖం తిప్పికూడా చూడరు ..

కొన్ని చొట్ల తిన్నంతవరకూ ఇంకా తింటె బాగుండని ఆక్షణంలొ అనిపిస్తుంది
తీరా కొంతసమయంగడిచాక తిన్నపదార్దాలవల్ల జీర్ణసమస్యలతో బాధపడవలసివొస్తుంది ..

అతిగా రుచులకుపోతే అజీర్ణం తప్పదు ..

అందుకు డాక్టర్లచుట్టూ తిరగకాతప్పదు ..

ఇన్ని బాదలు పడుతున్నా , హొటళ్ళు ఆకర్షిస్తూనే ఉంటాయి ..

మళ్లీ ,మళ్లీ ఆ రుచులకు లోoగిపోతూనే ఉంటారు , అందుకు తగ్గ డాక్టర్ల సంఖ్యా పెరిగిపోతూనే ఉంటుంది ..

మహావిష్ణువు అంశతోనే దశావతారాలు ఆవిర్భవించాయి ఆయా కాలపరిస్థులనుబట్టి ..

ఆ అవతారాల విశిష్టతను , ధర్మాలకు అణుగుణంగా పురాణాలూ అందించబడ్డాయి ..

రాములవారు థర్మాన్ని ఆచరించి చూపారు ..

పరమాత్ముడు భగవద్గీతను లోకాన్ని ఉద్దేశించి చెప్పవలసివొచ్చింది , కాలపరిస్థితిని అనుసరించి .. అర్ధంచేసుకోనేంతవరకూ విదానాలు వేరుగా అనిపించినా , చివరకి అన్ని గ్రందాలసారం మనోధర్మానికి ఉద్దేశింపబడినవే ..

కాలానికి తగ్గట్టు మనిషి మనోనైజాలు మారుతున్నాయి ..

మత థర్మాన్ని అనుసరించి , ఆచరించె సoఖ్యకన్నా , నమ్మిన సిద్దాంతం , నా మతమే గొప్పదన్న వాగ్విదాలు ముదిరిపోతున్నాయి ..

ఉబుకుతున్న వాదాలను సొమ్ముచేసుకొనే స్వార్థవ్యక్తిత్వాలూ చోటుచేసుకొంటున్నాయి ..

నాలిక రుచులకోసం పాకులాడినట్టు , మనసు ఆకర్షణలవైపు ఆకర్షించినంతవరకూ , స్వాగతంపలికే హోటలుబోర్డుల్లా స్వార్ధప్రయోజకులు తెరమీదకొస్తూనేఉంటారు ..

లొకంలో అమ్మలు ఎందరో ఉన్నా , ఎవరి తల్లి వారికి దేవతే ..

ఎవరు చేరదీసి ఎన్ని పాకాలు ఒడ్డించినా , అవి అమ్మ , ప్రేమగా బుజ్జగించి పెట్టే పచ్చడన్నం ముందు దిగదుడుపే ..

ఇహంలో చేసుకున్నవి పరంలో ఫలితాలనిస్తాయంటారు ..

దేహం ఉన్నంతవరకే ఏదైనా సాద్యం ..

కనిపించని లోకాలలో ఒనగూరే సౌఖ్యాలకన్నా , శరీరం నేలకూలేంతవరకు మానసిక ప్రశాంతతకన్నా మించిన పరలోక సౌఖ్యం మరొకటిఉండదు ..

అన్నింటికీ మూలం మనసె. అమ్మను ప్రెమించినట్టు , నచ్చిన ధర్మానికి మనసు కట్టుబడితె , ఆ థర్మాన్ని ప్రబోధించిన మూలముమీద ఏకాగ్రత కుదురుతుంది ..

ఎవరికి నచ్చిన విదానాన్ని వారు నిజాయతీగా, సక్రమంగా పాటిస్తే , వాద, వివాదాలకు స్వార్థప్రయోజనాలకు తెరదిగి, అవతారాల ఆవశ్యకత , గ్రంధసారాల ప్రాముక్యం లోకోద్ధరణకే అని స్పూర్తినిస్తుందని పెద్దలమాట …

సద్గురు చరణార్పణమస్తు

*****

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “ధర్మానికి మనసు కట్టుబడితె , ఆ థర్మాన్ని ప్రబోధించిన మూలముమీద ఏకాగ్రత కుదురుతుంది

Madhavi

Manthru devobhava..Amma..Aa padaniki artham..varninchalemu..We lost my mother long back..Eynaa kastam vasthe mundhu ammane gurtuvastundhi…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles