సద్గురు ప్రబోధాలలోని సారాలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Author : Kota Prakasam garu

జన్మకు,జన్మకూ మధ్య నాటకాన్ని గుర్తుచేస్తూ , నడతనేర్పేవే సద్గురు ప్రబోధాలలోని సారాలు
***

స్థాయి మారేకొద్దీ స్వభావాలు మారిపొతుంటాయి ..

ఏది నాది , నాది అనిపట్టుకొని పాకులాడుతూంటామో అది పరులపాలైపోయేపరిస్థితి దాపురించవొచ్చు ..

ఏది నేను అన్న తార్కిక జ్ఞానం కలిగె సమయానికి దేహం సహకరించేవయసు చేజారిపోతూంటుంది …

వొచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోడం , పరిస్తితులు ప్రతికూలమైతె విధివ్రాత వక్రీకరించిందని వాపోవడం ఎందరి విషయాల్లోనూ సహజంగా కనిపిస్తూంటుంది ..

ఒక బొమ్మనుకొని పసివాడికిస్తే , మోజు తీరేంతవరకూ అమ్మనుకూడా మరిచిపొతాడు ..

ఒక గ్రంథాన్ని చదువుతున్నంతసేపూ మనసు ఆ పాత్రల్లో మునిగిపోయి , అలా ఎదగాలన్న స్పూర్తిని కలిగెవారుకూడా , మరొ వ్యవహారాల వలయంలోపడి వెనకటి స్పూర్తిని కోల్పోతుంటారు ..

తినే ప్రతిమెతుకూ జీర్ణమౌతున్నా ఒంటపట్టేది కొంతైతే , కొంత వ్యర్ధపదార్ధంగా విసర్జించకతప్పదు ..
ముందుగా నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నంచెయ్యి , ఆ తర్వాత నీ చుట్టూ ఉన్నదేదో

అవగాహనకొస్తుంది నీలోఉన్న ప్రతిచర్యా , నీలాంటివారిలోనేకాక , నిండిన ప్రతి ప్రాణి అనుభవించేది అదే అన్న అనుభవం స్ఫూర్తినివ్వగలదు అని అనుభవంతో ఆర్యులు ప్రబోధించినమాట ..

మనిషి పుట్టింది మొదలూ , నేలరాలేంతవరకు జీవితం ఒకే స్తాయి అనుభవానికి రావటం అసంభవమైన విషయం ..

పుట్టినవాఁడు అంచెలంచలుగా ఎదుగుతూ , శరీరంలొ మార్పులు ఉత్పన్నమైనట్టు , వయసుతోపాటు , ఎదిగే మనసుకూడా అనేక అనుభవాలకు లోనౌతూఉంటుంది ..

ఎప్పటి నిర్ణయాలప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ..

కాలం ముందుకు నడికొద్దీ వెనకటి నిర్ణయాలలో తప్పటడుగులు అనుభవానికొస్తుంటాయి ..

అమ్మకన్నా మించి దేవతలేదు అనిపిస్తుంది , పెళ్లయ్యాక బార్య , పుట్టినబిడ్డలు , పోగుచేసిన ధనం యిల్లూ , వాకిలీ ఇలా మమకారం , వ్యామోహాలు వొకటినుండి అనేకాలుగా విస్తరిస్తుంటాయి ..

ఆఖరిశ్వాసలో కొట్టుమిట్టాడే సమయంలొ నెను , నాది అని విర్రవీగిన శరీరంకూడా పిడికెడు బూడిదకాకతప్పదనే వేదాంతధోరణి అనుభవానికొస్తుంటుంది ..

ఏ గ్రంథాన్ని పరిశీలించినా , ఆకలింపుచేసుకొంటే , కొసమెరుపులో స్ఫురింపచేసేది , ఎవరిని వారు ఉద్ధరించుకొనే మార్గాన్నే స్ఫురింపచేస్తుంది ..

పుట్టుకా , చావులమద్య నాటకంలో ఎలా జీవించాలో నేర్పుతుంది ..

రజో , తమోగుణాలకు సంకేతమైన రాక్షస వర్గంకూడా , కఠోరనిర్ణయాలతో దేవతలను కదిలించి వరాలు పొందినవారే ..

సాత్త్విక వర్గంకూడా ధృఢసంకల్పాలతో , ప్రకృతి నియమాలతొ మెప్పించి ఉత్తమగతులు పోందినవారే ..

తప్పడుగులువేసే పిల్లవాడికి నడక నేర్చేంతవరకు అమ్మ చేయి ఆధారం ..

మనిషి నడతను తీర్చిదిద్దుకొనే ప్రయత్నానికి , ఉత్తమగతుల సంప్రాప్తికి సద్గ్రంథాల ప్రభోధం ఆదారం ..

అణుగుణంగా అనుసరించేవారికి జీవితమనే నాటకంలో మనిషి తనను తాను గుర్తెరిగి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకోగలడని పెద్దలనోట విన్నమాట ..

శ్రీ సద్గురుసాయి పాదార్పణమస్తు
**

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “సద్గురు ప్రబోధాలలోని సారాలు

Madhavi

Artham eythe aanimuthalu.vunnayi.yadaartham chepparu.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles