అదికారం , అంగబలాన్నిచూసి లొకం వెంటబడొచ్చుకానీ , మనోవైకల్యాలు తొలగించుకోక లొకేశ్వరుని మెప్పించడం దుర్లభమే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Author : Kota Prakasam garu

అదికారం , అంగబలాన్నిచూసి లొకం వెంటబడొచ్చుకానీ , మనోవైకల్యాలు తొలగించుకోక లొకేశ్వరుని
మెప్పించడం దుర్లభమే
**

అందం , వికారం … పొట్టీ , పొడుగూ ..నలుపు , ఎరుపు ఇవి వోక్కక్కరికీ ఒక్కొ విదంగా శరీరాకృతులనిర్మాణాలుంటాయి ..
ఎoత ప్రయత్నం చేసినా ప్రకృతి పరంగా,, వంశపారంపర్యంగా అబ్బిన శరీరస్వభావాన్ని మార్పుచేసుకోడం ఎవరితరమూ కాకపోవొచ్చు ..

కానీ ఎంతటి మేధావులైనా , మందబుద్ధులైనా , పండితపామర చక్రవర్తులకైనా పుట్టగానే మనోస్వభావాలు గంగకన్నా కల్మషరహితంగాఉంటాయి ..

ఎదిగి ఏర్పడే స్వభవాలనుబట్టి సంస్కారాలు మొదలౌతాయి ..

అధికారదాహం , ధనదాహం ,కీర్తిదాహం మొదలూ న్యాయాన్యాయ , దర్మాధర్మ విచక్షణా మొదలయ్యెది అవి వ్యక్తిగత స్వభావాలవల్లనే ..

పుట్టుకతొ వోచ్చిన అంగ వైకల్యాలాలను , శరీర ఛాయలను రూపుమాపుకొనే ప్రయత్నం విఫలంకావొచ్చుకానీ , నిలకడగా లోకాన్ని పరిశీలించి , సత్యాన్వేషణలో పడ్డవాడు తన మనోవైకల్యాన్ని అధిగమించె ప్రయత్నం మాత్రం అది మనిషి ఎంచుకునే మార్గంలోనే ఉంటుంది ..

అధికారాలు , ఆర్భాటాలు శరీరం సహకరించి ఒకపరిదివరకే …

ఎంత కూడఁబెట్టినవాడైనా , ఎన్ని అధికారాలు చలాయించినవాడైనా శరీరం వొంగిననాడు , ఆదారం కోసం అలమటించాల్సిందే ..

కాకాసాహెబుదీక్షిత్ ఒక ఆచార , సాంప్రదాయాన్ని పాటించేవాడు ..

వేకువనే ముందు దైవిక కార్యక్రమాలు శ్రద్దగా పూర్తిచేసుకోకుండా పచ్చి మంచినీళ్లుకూడా ముట్టుకొనేవాడు కాదని చరిత్రలోని కథనం ..

జీవితం మలుపుతిరిగీ , ఒక యోగ్యత వరించాలంటే , ఎదురయ్యె ఎత్తుపల్లాలనుకూడా ఎదుర్కొనే ఆత్మస్త్థెర్యం ఉండాలంటారు ..

అలా కాలువిరిగి , కుంటితనం ఏర్పడి , ఎందరో డాక్టర్లని సంప్రదించినా నయంకాక విచారిస్తున్న సమయంలొ , షిరిడీలో బాబా ఉన్నారని , ఆయన ఆశ్రయిస్తే , ఆ బాధనుండి విముక్తి పొందగలవని , సలహాతో షిర్దీచేరి బాబాను దర్శించిన తొలిచూపులోనె కాలి కుంటితనం మరచిపోయి , తన మనసుకు పట్టిన కుంటిని వైదొలగించమని కొరుకొన్నాడు ..

సంకల్పం పెదిమలపైకాక , మనసునుండి జారితె అవి నెరవేరితీరుతాయని అంటారు ..

ఆ సంకల్పమే , దీక్షీత్తు జీవనగమనాన్నే మార్చి , చివరికి మొక్షప్రాప్తిని పొందాడని , నిన్ను విమానంలో తీసుకువెళతా అన్న సాయి మాటల్లోనే అర్థమౌతుంది ..

డబ్బునుచూసి , వ్యక్తి స్థాయినిచూసి లొకం గౌరవిస్తుంది ..
మనసును చూసి మహాత్ములు ఆదరిస్తారు ..

మనో వికారాలను తొలగించుకునే ప్రయత్నంచేస్తె , ఆశ్రయించిన బొమ్మలోకూడా చైతన్యం తొంగిచూస్తుందని పెద్దలమాట ..

శ్రీగురుభ్యోనమః
**

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “అదికారం , అంగబలాన్నిచూసి లొకం వెంటబడొచ్చుకానీ , మనోవైకల్యాలు తొలగించుకోక లొకేశ్వరుని మెప్పించడం దుర్లభమే

Madhavi

Chalaa baaga chepparu.baba charitra vundhi.kishoregaru.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles