Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: సుబ్రహ్మణ్యం
నివాసం: హైదరాబాద్
అది 2007వ సంవత్సరం నిరుద్యోగంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజులు, దానికి తోడు ఇంట్లో తీవ్ర నైరాశ్యం, గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
గవెర్నమెంట్ ఉద్యోగం సాధించాలని, ఈనాడు కార్యాలయంలో పని చేస్తున్న సబ్ ఎడిటర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి బయటికి వచ్చి అప్పటికి రెండేళ్లు అవుతుంది.
తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు, అప్పటికే ఇద్దరు చిన్న పాపలు, వారి ఆరోగ్య సంరక్షణ, కుటుంబపోషణ మొత్తం నా భార్య ఒక్కరి సంపాదనపై ఆధారపడి ఉంది.
ఇలాంటి పరిస్థితులను, మానసిక సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ పరీక్షలకు సిద్దమయ్యాను.
బాబా పాదాలకు శరణు వేడుకున్నాను. అటువంటి పరిస్థితుల్లో బాబా అనుగ్రహం వలన సాయిబందువు సతీష్ అనుకోకుండా ఒకసారి మా ఇంటికి వచ్చాడు.
తొలిసారి గురువుగారి గురించి చెప్పి, మాకు పరిచయం చేసి మా జీవితంలో కొత్త వెలుగులు నింపారు.
సతీష్ చెబుతున్న కొద్దీ అంతటి గొప్ప మహనీయుని దర్శన భాగ్యం లభించే భాగ్యాన్ని కలిగించమని బాబాని వేనోళ్ళ వేడుకున్నాను.
ఆ మహనీయుని చిత్ర పటాన్నిమొదట చూసిన తరువాత అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. ఈ గ్రూప్ 2 పరీక్షలో నాకు ఇష్టమైన ఎక్సయిజ్ డిపార్టుమెంటులో ఇప్పించమని గురువుగారిని వేడుకున్నాను.
ఆయన ఆశీర్వాద బలం అన్నట్టు గ్రూప్ 2 పరీక్షలు బాగా రాయగలిగాను. ఫలితాలు వచ్చాయి. ఇంటర్వ్యూకి ఎంపికయ్యాను.
బాబా,గురువుగారి ఆశీర్వాద బలంతో ఇంటర్వ్యూ కూడా బాగా చేసి, గ్రూప్ 2 పరీక్షలో రాష్ట్రములో రెండో ర్యాంక్ సాధించి నేను కోరుకున్న ఎక్సయిజ్ శాఖలోనే ఉద్యోగానికి ఎంపికయ్యాను.
ఇబ్బంది పెట్టిన మెడికల్ టెస్ట్.
ఎక్సయిజ్ శాఖ యూనిఫామ్ సర్వీస్ కావడం వల్ల మమ్మలిని మెడికల్ టెస్ట్ కు పంపించారు.
కానీ, నాకు మొదటి నుండి సైట్ ఉండడంతో కళ్ళజోడు పెట్టుకునేవాడిని. యూనిఫామ్ సర్వీస్ కు విత్ అవుట్ స్పెట్స్ క్వాలిఫికేషన్ ఉండేది.
ఈ సమయంలోనే గురువు గారు శిరిడీకి వస్తున్నారని తెలుసుకుని ఎలాగైనా అయన దర్శన భాగ్యం చేసుకుని అయన ఆశీస్సులతో ఈ గండం నుండి గట్టెక్కాలని భావించాను.
రేజర్వేషన్ దొరకకపోయిన జనరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణించి శిరిడీ చేరుకున్నాను.
ఎన్నాళ్ళుగానో బాబాకు సేవ చేస్తున్న ప్రతిఫలంగా, ఆయన మనకు ఇచ్చిన అరుదైన వరంగా ఆరోజు తొలిసారి గురువుగారి దర్శనం నాకు లభించింది.
మనస్సులో ఆయనకు నా బాధనంతా విన్నవించుకుని ఎలాగైనా నన్ను ఈ మెడికల్ టెస్ట్ గండం నుండి గట్టెక్కించమని నన్ను హైదరాబాద్ డివిజన్ కి అలాట్ చేసేలా ఆశీర్వదించమని వేడుకున్నాను.
ఆ దర్శన భాగ్యం లభించిన తృప్తితో సంతోషంగా శిరిడీ నుంచి తిరిగి వచ్చాను.
అనుకున్న రోజు రానే వచ్చింది. ఆరోజు ఉస్మానియా ఆసుపత్రిలో ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహించారు.
విజన్ (కంటి) టెస్ట్ నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్ట్ అని చెప్పడంతో మనసులో భయం మొదలైంది, దానికి తగ్గట్టుగానే నా ముందున్న అయిదుగురు అభ్యర్థులను ఆ ఇన్స్పెక్టర్ గారు డిస్ క్వాలిఫై చేసారు.
దాంతో నా భయం మరింత పెరిగింది. బాబాని, గురువు గారిని మరొక సారి వేడుకున్నాను.
నన్ను ఈ గండం నుండి గట్టెక్కించమని, నా కుటుంబానికి, జీవితానికి సాయం చేయమని మనస్సులో పదే పదే ప్రార్ధించాను.
ఆశ్చర్యకరంగా నా వంతు విజన్ టెస్ట్ వచ్చేసరికి అప్పటి వరకు డ్యూటీ నిర్వహిస్తున్న సీరియస్ ఇన్స్పెక్టర్ నాకు అత్యవసర పని ఉంది మిగిలిన అభ్యర్థులకు పరీక్షలను నిర్వర్తించమని తోటి ఇన్స్పెక్టర్ కి చెప్పి ఆయన హుటాహుటిన ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళిపోయాడు.
ఇది నమ్మలేని నిజం. విజన్ టెస్ట్ లో నేనే చివరి అభ్యర్థిని భయపడుతూనే విజన్ టెస్ట్ కు కూర్చున్నా. నా సమస్యను ఆయనకు చెప్పాను.
డాక్టర్ గారు కూడా బాబా భక్తుడే.
విజన్ అనేది సహజమైన సమస్య అని దానికి భయపడాల్సిన పనిలేదని కళ్ళజోడు పెట్టుకుని చదవమని నాకు కలర్ బ్లైండ్ నెస్ సమస్య లేదని గుర్తించిన డాక్టర్ గారు మామూలు విజన్ సమస్య అని ఆలోచించవ- లసిన పని లేదని, నన్ను క్వాలిఫై చేస్తూ సర్టిఫై చేసాడు.
ఇదంతా కొద్దీ నిముషాల వ్యవధిలోనే జరిగింది. నాకు అప్పటికి ఏమి జరిగిందో పూర్తిగా అర్ధం కాలేదు.
నాకన్నా చిన్న సమస్య ఉన్న అభ్యర్థులు డిస్ క్వాలిఫై ఐతే! నా వంతు వచ్చేసరికి ఒక మిరాకిల్ లాగా బాబా, గురువు గారి ప్రేరణతో, ఆయన అనుగ్రహ పాత్రుడైన వైద్యుడు వచ్చి పరీక్షించి నన్ను ఎంపిక చేయడం ముమ్మాటికీ ఆ పరమ గురువు అవ్యాజ్యానురాగమైన ప్రేమ కాకా మరేమిటి?!.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
Latest Miracles:
- సమస్య ఏదైనా సద్గురు అనుగ్రహంతో పటాపంచలు
- సాయిబాబా వారి భక్తుల కోసం పరిగెత్తుకు వచ్చారు
- బాబా అనుగ్రహం డ్రైవింగ్ టెస్ట్ పాసయ్యాను
- ప్రేమగా పెడితే నేను ఏదైనా తింటానని తినకపోవడం అంటూ ఉండదని నాకు సందేశమిచ్చారు–Audio
- సద్గురు కృప.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “సమస్య ఏదైనా సద్గురు అనుగ్రహంతో పటాపంచలు”
Madhavi
May 6, 2018 at 6:52 pmAndhuke.guruve sarva devatha swaroopam.murty garu…Saibaba..Saibaba.saibaba.