Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
క్షణికావేశంతో నిర్ణయాలు ఎన్నటికి ఫలితాన్నివ్వవు ..నోరుజారేముందు ఎంతవరకు అది భరించసాధ్యమోకూడా నిర్ణయించుకోవాలి
*******
సత్యహరిచ్చంద్రుడి పాత్ర, మాట ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు, అది శక్తికి మించినదైతే చాతకాదని విన్నవించుకో, లేదా తీర్చడానికే సిద్ధమైనప్పుడు, ఉత్పన్నమయ్యే సమస్యలనుకూడా సంతోషంగా అనుభవించడానికి సిద్ధంగా ఉండు అనిపిస్తుంది.
భారతంలో ధర్మరాజుపాత్ర
“నీ బలహీనతవలన సంభవించే నష్టాన్ని నీవే భరించాలి తప్ప, ఆ బలహీనత కారణంగా అదికారం ఉందికదా అని నీ ప్రక్కవారినికూడా యిరుకునబెట్టే ప్రయత్నంచేయకు అని చెప్పినట్లనిపిస్తుంది .
ఎన్నో సౌకర్యాలున్నా, చేతినిండా ఆదేసించే అదికారం ఉన్నాఅన్ని భోగాలను త్యజించి, ఆత్మజ్ఞానంకోసం చెట్టుకింద కూర్చున్న గౌతమబుద్ధుడు తొలుత లోకానికి పిచ్చివాడిగానే కనిపించి ఉండొచ్చు .
ముక్కుమూసుకొని తపసుచేసుకొనే సర్వసంఘపరిత్యాగికి, శరీరభోగాలకై అలమటిస్తూ, మాయలోపడి దొల్లుతున్న లోకo పిచ్చిగా కనిపించవొచ్చు .
బాబా ఆ గ్రామంలో అడుగుపెట్టకముందు, షిర్డీ అనే గ్రామం ఒకటుందని ఆ ప్రాంతవాసులె పట్టించుకొలేనంత కుగ్రామం, ప్రస్తుతం ప్రపంచ పటంలో వాసికెక్కిన పట్టణాలలో శిరిడీ కూడా ఒకటిగ వన్నెకెక్కింది .
రుచి చూడనంతవరకూపదార్ధం విలువ తెలియదు, ఆయనెవరో అర్థం కానంతవరకు కొన్ని సంవత్సరాలపాటు నిత్యము గమనిస్తున్న ఆ గ్రామవాసులకే అర్థంకాలేదు .
ఆయన నిత్యచర్యలునిథానంగా వోక్కక్కరే ఆయనను కలుస్తూ, పొందిన అనుభవాలు ఆయనొక మహాత్ముడని మూల మూలకు ప్రచారం పాకింది .
అయన సిద్ధాంతంలో ఒక భాగం
“మాట యివ్వకు, యిస్తే ప్రాణంపోయేపరిస్థితిలో కూడా అది తప్పకు” అని .. మనిషి ఉన్నంతవరకే దేన్ని సాదించాలన్నా, దేనిని తీర్చాలన్నా .. చావు, పుట్టుకలకు అతీతమైన మహాత్ములవాక్కు, వారు శరీరం చాలించినా, అవి నెరవేరుతునే ఉంటాయనేది నిత్యము , సత్యమూ కూడా .
దేనిని క్షణికోద్రేకంతో నిర్ణయించుకోకు, ఒకటి రెండు సార్లు గట్టి నిర్ణయంతో ఆలొచించు, అడుగుపెట్టినచోట సంశయాలకు తావివ్వక, సడలని విశ్వాసంతో నమ్మకం గట్టిదైతే , సమాధికూడా సజీవంగా జవాభిస్తూనే ఉంటుంది.
మహాత్ముల మాటలెప్పుడూ మొదట విడ్డూరంగానే అనిపిస్తాయి .
సద్గ్రంథాలలో సత్యహరిచ్చంద్రునిలాంటి పాత్రలెప్పుడూ సత్యదూరమేమో అని సందేహాలను రేకింతించవొచ్చు, గట్టి ప్రయత్నంతో, విశ్వాసముంచి అడుగుముందుకుపడితే, అవే స్వానుభవానికొచ్చి , మనసు వాస్తవానికి దగ్గరకాగలదని పెద్దలమాట .
జయ్ జయ్ గురుదేవ సమర్థ
*******
Latest Miracles:
- నాస్తికులైన సభాగారిని మృతువు నుండి బాబా కాపాడుట,తెలుగు రచయత–Audio
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)
- సాయి మార్గములో పెద్దలు (శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా)
- నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు
- గురువుగారు చేతులు తట్టుతూ భజన చేస్తూనే ఉన్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments