భగవద్గీత కూడా చెబుతుంది ” నేను నిమిత్తమాత్రుడనే , ఎవరి కర్మనుబట్టి వారికా సంకల్పాలు నెరవేరుతుంటాయి ” అని.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా   …   సాయి బాబా   …   సాయి బాబా   …   సాయి బాబా

Author:Kota Prakasam Garu

సంకల్పాలు ఎలా ఉంటాయో నెరవేరే ఫలితాలు అలానేఉంటాయి
*********

గుంపుగా వెలుతున్న గొర్రెల్లో , నిన్న చూసిన గొర్రెను ఈరోజు గుర్తించడం కష్టం , అలాగే మేకలాంటి కొన్ని జంతువులను , కాకి పావురాల్లాంటి పక్షులను కూడా , గాలించి గుర్తుపట్టాలని ప్రయత్నంచేసిన అది అందరికి సాద్యంకాదు , నిత్యము అంటిపెట్టుకొనివుండే వాటి కాపరికి తప్ప ..

అలా షిరిడీలో మేకల గుంపు ద్వారకామాయి మార్గంలో పోతున్నాయి ఒకరోజు సాయంత్రంవేళ బాబా ఒక్క ఉదుటనలేచి , జన్మ ప్రారబ్ధముచేత ఆ మేక ఆయనని గుర్తించకున్నా , గతాన్ని గుర్తుచేస్తూ ఆ మందలో ఒక మేకను ఎంతో ఆత్మీయంగా మసీదుకు తీసుకొనివొచ్చి , పలకరించి , , దానికడుపు నింపి , వెన్ను నిమురుతూ , తిరిగి ఆ మందలోకి వొదిలివేశారు,అక్కడున్నవాళ్లకు జరుగుతున్నది అర్థంకాక , అదో విడ్డూరంగా తోచింది , ఆ తర్వాత బాబా చెప్పారు ” ఆ మేక ముందు జన్మలో నాతో ఎంతో సన్నిహితంగా ఉండి , ప్రారబ్ధంకొద్దీ ఇలా మేకగా జన్మించిందని , అందుకే దానిని గుర్తించి పలకరించానని ” అన్నారు ..

ప్రపంచంలో ఇన్నికోట్లమంది జనాబావున్నా , కొందరి మద్య పోలికలు యించుమించుగా ఒకటిగా కనబడినాసరే , ఒకరి స్వభావమున్నట్టు ఒకరి స్వభావాలుండవు అంటారు ..

మనుషుల మాటలు ఎంతో నిజాయతీగా అనిపించినా , అందుకు తగ్గట్టు మనోస్వభావాలు ఒకటిగా ఉండవు .. అందుకే అంటారు ” మనిషి మాటకు లొంగుతాడు , భగవంతుడు భక్తికి లొంగుతాడు ” అని …

దేవుడు దయామయుడు , కరుణామూర్తి , సాక్షాత్తు కల్పవృక్షమే అంటూ ప్రచారాలు సాగుతాయి ఒక వైపు , దున్నపోతునెక్కి కొండను దాటినంత సులువుకాదు ఆద్యాత్మిక సాదన అంటారు బాబాలాంటి మహాత్ములు . తీరని కోరికలు తీరుతాయనే ఆశ గుడి మెట్లను ఎక్కించవొచ్చు , అవి తీరవొచ్చుకూడా కానీ ఆశ్రయించిన ప్రతి మనసును ఎరిగినవాడు , కోరికలైనా , మోక్షమైనా మనసు స్పందించే తీరునుబట్టె అనుగ్రహిస్తూఉంటాడు ..

ఆర్తితో ఆశ్రయించిన దీక్షిత్ ,మేఘుడు లాంటి వారితోపాటు పులి , మేక , గుర్రం లాంటి మూగజీవులుకూడా బాబాచే ఉద్ధరింపబడినవే ,, పూర్వ జన్మ సుకృతాలనుబట్టి జన్మఫలాలంటారు.

ఒకటి మేలయిన జన్మకు కారణమైతే కొన్ని గత ప్రారబ్ధాలనుబట్టి మనిషేతర జన్మలకు హేతువౌతుందంటారు ..

శరీర భోగాలు , జన్మాన్తర సుఖాలు ఇవి రెండూ మనో సంకల్పాలనుబట్టే నెరవేరుతుంటాయి.ఇదే భగవద్గీత కూడా చెబుతుంది ..” నేను నిమిత్తమాత్రుడనే , ఎవరి కర్మనుబట్టి వారికా సంకల్పాలు నెరవేర్తుంటాయి ” అని ..

సచ్చరిత్ర లో ప్రతి పాత్ర అనుసరించిన విదానం , అందుకు తగ్గ ఫలాన్ని బాబా అనుగ్రహించిన తీరును అవగాహనకుదిరితే , పారాయణకు తగ్గ ప్రతిఫలంకూడా వెన్నంటి నడిపిస్తుంటుందని పెద్దలమాట ..

సర్వం శ్రీగురు పాదార్పణమస్తు
*******

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles