Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
మహనీయుల బోధలు , సద్గ్రంథాలు మనిషి మనో సంస్కారాలను తీర్చిదిద్దే కల్పవృక్షంలాంటివే
******
ఎదగడానికి ఒక ఆదారం కావాలి , యే ఎత్తుకు ఎదిగినా , వొదిగి ఉండడానికి ఒక ఉత్తమ సంస్కారం ఉండాలి ..
ఒక పూలతీగకు ప్రక్కనే ఒక చెట్టు అదీ లెకుంటే అధారంగా ఒక గుంజనో నాటితే , ఎవరి ప్రమేయం లేకుండా అది అల్లుకొంటూ ఎదిగిపోతూంటుంది.ఇంత ప్రయత్నంచేసి , ఆ ఎత్తుకు ఎదిగినా , ఆశించిన ఫలమో , పుష్పమో అది అందించకపోతే , అలంకార విద్యార్థిలా , ఇదొక అడ్డం దేనికని నిర్ధాక్ష్యన్నంగా పీకి అవతలపారేస్తుంటారు …
ప్రతి జంతువుకు సంతానం కలిగాక , వాటి తిండిని అవి సముపార్జించుకొనే అవగాహన కుదిరేంతవరకు , ప్రాణంకన్నా ఎక్కువగా వాటికి అధారంగా నిలిచి సంరక్షించుకొంటూ ఉంటాయి ..వాటికాళ్ళమీద అవి నిలబడ్డాక అవి , మమకారాలు , వావివరసలు పట్టించుకోవు ..
అమ్మ నాన్నల అండ లేనిదే పుట్టినవాడు సంరక్షింపబడడం కష్టమే చెట్టు ఎదిగేంతవరకు పాదులుకట్టి నీరుపోయడం యజమాని కర్తవ్యం ..
ఎదిగి , ఎవరిమీద ఆధారపడక , భూమిలో సారాన్నిగ్రహించి ఫలాలను అందివ్వడం ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ ..
మనిషి అవగాహనకుదిరాక , తన జీవితాధారానికి ఎన్నో ప్రయత్నాలు చేసి , కష్టపడితేకానీ తాను తన సంసారానికి ఆదారం కాలేడు ..
తాను తన సంతతికి ఒక ఆధారమై , ఒక స్థాయికి వారిని తీర్చగలిగితే , ఒక వయసులో వారు తనకు ఆధారంకాలేరు , ఇదో సృష్టిక్రమం …దీనిని అధిగమించగలిగినవారు ఎవరూ లేరు ..
డబ్బులేనిదే జీవితం సాగదు , అది అధిక స్థాయిలో కూడితే సమాజంలో ఒక స్థాయిని , అధికారాన్ని అందించవొచ్చు కానీ మనో ప్రక్షాళనకు , ఒక ఉత్తమ నడవడికి ఒక సమర్థుడైన సద్గురు ఆధారంలేక , అది గడ్డిపరకతో సమానమే ..
భగవద్గీత పుట్టి దాదాపు ఐదువేల సంవత్సరాల పైచిలుకే అయింది , అప్పటినుండి ఇప్పటిదాకా వేలకు వేలమంది గతంలో ప్రచారాలనందించినవారుఉన్నా , కోటానుకోట్లమంది శ్రోతలుగా విన్నవారున్నా , ఆ తర్వాతికాలంలో అది శంకరులనుండి బాబా వరకూ ఎందరో మహాత్ములు ప్రకటమై జన్మ సాఫల్యఆధారానికి వెంటాడి ప్రబోధిస్తున్నా , తీగలై ఆ ఆధారంతో ఎదిగినవారు ఎందరున్నా , ఆ ఆదారంతో సత్ఫలాన్ని పొంది , చరిత్రలో ఎందరుంటారో , నిలిచి నిదానంగా ఆలోచిస్తే అర్థమౌతుంది ..
సృష్టికి మూలం , సృష్టికి ఆధారమైంది , అది జన్మ సాఫల్యానికి ఎలా ఆధారమైందో వివరించి చెప్పేవే సద్గురు బోధలు , సద్గ్రంథాల సారాలు..అవి సాక్షాత్తు కల్పవృక్షంలాంటివి , ఆ ఆధారంతో ఎదిగిన తీగలాంటి ప్రతి సాధన , జన్మ సాఫల్యమనే మధుర ఫలాన్ని దక్కించుకోగలుగుతుంది మహాత్ములనోట వినిపించె మాట …
అదే బాబా చెప్పిన మాటకూడా ” “ఒక్క అడుగు నావైపు వెస్తే , పది అడుగులునీవైపుని ..కు వేస్తాను” అని
ఒక్క జన్మలో గట్టి ప్రయత్నం , 72 జన్మల సంబంధాన్ని యిచ్చింది శ్యామాకు ..
ఇలా సచ్చరిత్రలో జన్మ రుణాల ప్రస్తాపనలు అనేకం ప్రస్తావించబడ్డాయి , సద్గురువుతో అలాంటి ఋణానుబంధం పెంచుకొనే ప్రయత్నం ఉంటె , ఆయన మహాసమాధికూడా విధిగా కదిలి జవాబుచెప్పగలదని పెద్దలమాట ..
జయ్ సాయి గురుదేవ
******
Latest Miracles:
- దైవానుగ్రహము
- నేను గొప్ప భక్తుడని అనే అహంకారము నాలో రాకుండా ఉంటేనే తగ్గించండి
- సత్యాన్వేషణ .. …. మహనీయులు – 2020… డిసెంబరు 15
- సద్గురువు.
- మేలుకో! మేలుకో!! …. మహనీయులు – 2020… జూలై 15
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments