పండరీపురము పోయి యచ్చటుండుట–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!

This Audio prepared by Mr Sreenivas Murthy

  1. Mir-12 పండరీపురము పోయి యచ్చటుండుట 2:17

సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను, అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను.

నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు.

అతడు ఖాందేషులోని నందురుబారులో మామలతదారుగా నుండెను.

అతనికి పండరీపురమునకు బదిలీ జరిగెను. సాయిబాబా యందు అతనికిగల భక్తియను ఫలమానాటికి పండెను.

పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు.

నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను.

కాన షిరిడీకి ఉత్తరము వ్రాయకయే పండరీపురము పోవలెనని బయలుదేరెను.

షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరి పోవలె ననుకొనెను.

నానాసాహెబు షిరిడీ వచ్చునను సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను.

నానాసాహెబు నీమగాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహాళ్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా యిట్లనియెను.

“మన నలుగురము కలసి భజన చేసెదము. పండరీద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము లెండు.” అందరు కలసి పాడదొడంగిరి. ఆ పాట భావమేమన, “నేను పండరి పోవలెను. నే నక్కడ నివసించవలెను. అది నా దైవము యొక్క భవనము.”

బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుగమించిరి. కొద్ది సేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి,

బాబాను పండరీపురము వచ్చి వారితో కలసి యక్కడుండుమని వేడుకొనియెను. ఈ బతిమాలుట కవసరము లేకుండెను.

ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను; అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి.

ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబాయొక్క ఆజ్ఞను పొంది ఊదీ ప్రసాదమును గ్రహించి, ఆశీర్వాదమును పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles