శ్రీ మహాభాష్యం రంగాచారిగారు–“నేనెప్పుడూ నీతోనే యుంటాను”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-24 శ్రీ మహాభాష్యం రంగాచారిగారు 5:04

తూర్పుగోదావరి జిల్లాలోని పీఠపురంలోని శ్రీ అనంతాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకు ది.14.10.1908న రంగాచార్యులు గారు జన్మించిరి. 1932-33 నాటికి బి.ఎస్.సి. చదివి, కలకత్తాలో పోస్టు గ్రాడ్ యెట్ అయిరి.

1936లో పేరేందేవి అను ఆమెతో వీరికి వివాహమైనది. 1948లో నిజాంప్రభుత్వముచే నడపబడుచున్న దక్కన్ రేడియోలో ఇంజనీరుగా చేరి తరువాత కాలములో ఆల్ ఇండియా రేడియో ఇంజనీరుగా ఢిల్లీ, మద్రాసు,హైదరాబాదులలో చేయుచు పేరు ప్రఖ్యాతులు గాంచి, 64 సం:ల వయస్సులో 1972లో పదవి విరమణ చేసిరి.

సాయి సేవలో తరిస్తూ 92 సం:ల వయస్సులో ది.07.08.2001న దేహము చాలించి శ్రీసాయిబాబా లో ఐక్యమయిరి.

వీరు ఉద్యోగ కాలములో అనేకమంది ప్రముఖులను, అవధూతలను దర్శించిరి.

1942లో వృత్తిరీత్యా ఔరంగాబాద్ వెళ్ళినప్పుడు షిరిడీ దర్శించిరి. అక్కడ వారు సమాధి ముందు ధ్యానములో కుర్చుననప్పుడు “నేనెప్పుడూ నీతోనే యుంటాను” అను స్వరము రంగాచారిగారికి వినిపించింది.

కళ్ళు తెరచి చూడ అచ్చట ఎవరూ కనుపించలేదు.

“బాబా! నిన్ను నేను ప్రత్యక్షంగా చూడలేదు. నీ స్వరం విన్నాను. నాపై కృప జూపి నా జీవితకాలమంతా నీ శరణు ప్రసాదించు” అని తన మనస్సులో అనుకున్నారు రంగాచార్యులుగారు.

ఈ రంగాచారిగారి కుమారుడే ప్రముఖ గాయకులు చిత్తరంజన్ గారు.

అప్పటి నుండి శ్రీసాయిబాబా రంగాచారిగారికి వారివెంట బాబా వుండునట్లు అనుభవము వస్తూయుండేది.

ఢిల్లీలో సాయి కార్యక్రమములను నిర్వహించినారు.

మద్రాసు వచ్చిన తరువాత ఆల్ ఇండియా సాయిసమాజ్ తో సంబంధము పెంచుకొని, శ్రీబి.వి.నరసింహస్వామి, శ్రీరాధాకృష్ణ స్వామీజీ, శ్రీకేశవయ్యజీ గార్లతో కలసి శ్రీసాయిబాబా విషయములు ముచ్చటించుచుండేవారు.

72 లో ఉద్యోగ విరమణ తరువాత ఒకరోజు రాత్రి బాబా కలలో కనిపించి బంగారు లడ్డు పట్టుకొని, “రంగాచారీ! నీకు నేను కావాలా? ఈ లడ్డు(బంగారు) కావాలా?” అని అడిగారు. ఆ కలలోనే నీవే కాయాలని రంగాచారి గారన్నారు. ఆ రోజునుండి నా శేషజీవితాన్ని నీసేవలోనే గడుపుతాను అని రంగాచారిగారు నిశ్చయించుకున్నారు.

ఇక సాయి సేవలో యితర పెద్దలతో కలియుట . నాగపూరు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్ లలో సాయి సమ్మేళనములలో పాల్గొనుట,

సాయిమందిరములను దర్శించుచు, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమములలో పాల్గొనుట జరుగుచుండెడిది.

బాబా వీరికి లీలలను చూపించుట ప్రారంభమైనది. వీరు షుమారుగా 205 సాయి విగ్రహములు ప్రతిష్ఠించారు.

వీరు షిరిడీ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షులుగా కూడా యుండి దాని అభివృద్ధికి కృషి చేసిరి. వీరితో సాన్నిహిత్యము బాబా నాకు(రచయిత) కలిగించిరి.

బాబా ఎవరని రంగాచారిగారు చెప్పుట

బాబాను గురించి రచయితకు శ్రీరంగాచార్యులుగారు ఇట్లు చెప్పిరి.

“బాబా పరబ్రహ్మస్వరూపమైన దత్తాత్రేయ అవతారము.దత్తాత్రేయుడు ఈ యుగాలున్నంతకాలము ఉండును.సృష్టి యున్నంతకాలముండును. ఆ దత్తాత్రేయుడే సాయిబాబా.

యుగానికొక సంపూర్ణ అవతారమొస్తుంది. ద్వాపరయుగములో శ్రీకృష్ట పరమాత్మ సంపూర్ణ అవతారము.

మిగిలిన వారు అంశావతారములు.

ఈ కలియుగములో శ్రీసాయిబాబా సంపూర్ణ అవతారము. మిగిలినవారు అంశావతారములు. సంపూర్ణ అవతారము యుండుట లేకపోవుట అనేది యుండదు. పరబ్రహ్మ స్వరూపము కలవాడే సమర్థ సద్గురువు.

సమర్థ సద్గురువనగా తన శిష్యుని(అశ్రితుని) ప్రారబ్దాన్ని కూడా నశింపజేయువాడు. అట్టివాడే దత్తాత్రేయుడు. ఇప్పుడు సమర్థ సద్గురువు శ్రీషిరిడీ సాయిబాబా అని చెప్పారు. సాయి మహత్తును ప్రకటించారు.

శ్రీ రంగాచారిగార్కి బాబా దత్తాత్రేయస్వామి దర్శినమిచ్చిరి.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల ( జూన్  – 2014)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles