Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!! శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)
ములేశాస్త్రి యాచారముగల బ్రాహ్మణుడు. ఆయన నాసిక్ వాసి. ఆయన ఆరుశాస్త్రములను చదివిరి. ఆయనకు జ్యోతిష్యము, సాముద్రికము కూడ బాగుగ తెలియును. అతడు నాగపూరు కోటీశ్వరుడగు బాపు సాహెబు బుట్టీని కలిసికొనుటకు షిరిడీ వచ్చెను. బుట్టీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడిపండ్లను, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికి పంచి పెట్టుచుండెను. బాబా చిత్రముగా మామిడిపండును అన్ని వైపుల నొక్కుచుండెను. దానిని తినువారు నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి బోయి తొక్క, టెంక వెంటనే పారవేయుటకు వీలగుచుండెను. అరటిపండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచి పెట్టి తొక్కలు బాబా యుంచుకొనెడివారు. ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుమని యడిగెను. బాబా దానిని వినక నాలుగు అరటిపండ్ల నిచ్చెను. తరువాత నందరు వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని యగ్నిహోత్రము మొదలగునవి యాచరించుటకు మొదలిడెను. బాబా మాములుగనే లెండితోటకు బయలుదేరెను. మార్గమధ్యమున “గేరు (ఎఱ్ఱరంగు) తయారుగ నుంచుడు. ఈనాడు కాషాయవస్త్రమును ధరించెదను” అని బాబా యనెను. ఆ మాట లెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీతోటనుంచి తిరిగివచ్చెను. మధ్యాహ్నహారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్నహారతికి తనతో వచ్చెదరా యని ములేశాస్త్రిని బుట్టీ యడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసికొనెదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన యాసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్దనుంచి దక్షిణ తెమ్మనెను. బుట్టీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా యాజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను. తనలో తా నిట్లనుకొనెను. “నేను పూర్తిగ ఆచారవంతుడను, నే నెందులకు దక్షిణ నీయవలెను? బాబా గొప్ప యోగియైయుండవచ్చును. నేను వారిపై ఆధారపడి యుండలేదు.” గొప్ప యోగివంటి సాయి ధనికుడగు బుట్టీ ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేక పోయెను. తనపూజ ముగియకముందే వెంటనే బుట్టీతో మసీదుకు బయలుదేరెను. తాను పవిత్రుడ ననుకొని, మసీదట్టిది కాదని, బాబాకు దూరముగ నిలువబడి, పువ్వులను బాబాపై విసరెను. హఠాత్తుగా బాబా స్థానములో, గతించిన తన గురువగు ఘోలవ్ స్వామి కూర్చొనియుండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది యొక స్వప్నమేమోయని తలచెను. కాని యతడు జాగ్రదవస్థలో నున్నప్పుడు స్వప్న మెట్లగును? అయితే వారి గురువచ్చట కెట్లు వచ్చెను? అతని నోట మాట రాకుండెను. చైతన్యము తెచ్చుకొని తిరిగి యాలోచించెను. కాని తనగురువు మసీదులో నెందుకుండునని భావించెను. తుదకు మనస్సందిగ్ధము లన్నియు విడచి మసీదు పై కెక్కి, తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించుకొని నిలువబడెను. తక్కిన వారందరు బాబా హారతిని పాడిరి. కాని ములేశాస్త్రి తన గురుని నామము నుచ్చరించెను. గొప్పజాతివాడనను గర్వము, తాను పవిత్రుడనను సంగతిని యటుండనిచ్చి తనగురుని పాదములపైబడి సాష్టాంగ మొనర్చి, కండ్లు మూసికొనెను. లేచి కండ్లు తెరచునంతలో, బాబా వానిని దక్షిణ యడుగుచున్నట్లు గాంచెను. బాబావారి చిన్నయాకారమును ఊహకందని వారి శక్తిని జూచి ములేశాస్త్రి మైమరచెను; మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోషభాష్పములచే నిండెను. బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తనగురువును దర్శించితిననియు చెప్పెను. బాబాయొక్క ఆ యాశ్చర్యలీలను గాంచినవారందరు నిర్ఘాంతపోయిరి. అప్పుడు వారు బాబా పలికిన పలుకులు “గేరు తెండు! కాషాయవస్త్రముల ధరించెద” నను మాటల అర్థము గ్రహించిరి. అట్టిది సాయియొక్క యాశ్చర్యకరమైన లీల
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నాందేడు పట్టణ నివాసియగు రతన్ జీ
- స్వామి శరణానంద్ నుండి దక్షిణ స్వీకరించి అతనికి ‘సన్యాసం’, ‘సద్గతి’ ప్రసాదించారు బాబా
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.
- కాకా మహాజని స్నేహితుడు
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పన్నెండవ అధ్యాయము🌹…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments