Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!! శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)
ఇక ఈ అధ్యాయపు ముఖ్యకథను ప్రారంభించెదము. నైజాం యిలాకాలోని నాందేడులో ఫార్సీవర్తకు డొకడుండెను. అతని పేరు రతన్ జీ షాపుర్జీ వాడియా. అతడు చాలా ధనము ప్రోగు జేసెను. పొలములు, తోటలు, సంపాదించెను. పశువులు, బండ్లు, గుఱ్ఱములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు జూచుటకు చాల సంతుష్టిగా సంతోషముగా గాన్పించెడువాడు. కాని లోపల వాస్తవముగా నట్లుండెడివాడు గాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్నవారొక్కరు లేరు. ధనికుడగు రతన్ జీ గూడ ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు. దానధర్మములు చేయువాడు; బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు. అందరి కన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరును “అతడు మంచివాడు; సంతోషముగ నున్నా” డని యనుకొనసాగిరి. కాని రతన్ జీ చాల కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియై యుండెను. భక్తిలేని హరికథవలె, వరుసలేని సంగీతమువలె, జంధ్యములేని బ్రాహ్మణునివలె, ప్రపంచజ్ఞానములేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపములేని యాత్రవలె, కంఠాభరణములేని యలంకారమువలె రతన్ జీ జీవితము పుత్రసంతానము లేక నిష్ప్రయోజనముగాను, అందవికారముగాను, నుండెను. రతన్ జీ యెల్లప్పుడు ఈ విషయమునుగూర్చియే చింతించుచుండెను.
రతన్ జీ తనలో తానిట్లనుకొనెను. “భగవంతు డెన్నడయిన సంతుష్టి జెంది పుత్రసంతానము కలుగ జేయడా?” మనస్సునందలి చింతతో ఆహారమందు రుచి గోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్రసంతానము కలుగునా? లేదా? యను నాతురతతో నుండువాడు. దాసుగణు మహారాజు నందు గొప్పగౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు వారిని గాంచి, తన మనస్సులోని కోరికను జెప్పెను. షిరిడీ వెళ్లుమని వానికి దాసుగణు సలహా నిచ్చెను; బాబాను దర్శించు మనెను; బాబా ఆశీర్వాదము పొందుమనెను; సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్ జీ దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను. బాబా దర్శనము చేనెను. బాబా పాదములమీద పడెను. ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను దీసి బాబా మెడలో వేసి, యొక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను; మిక్కిలి వినయవిధేయతలతో బాబా దగ్గర కూర్చొనెను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను.
“కష్టదశలో నున్నవారనేకమంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములనాశ్రయించితిని, కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము.” బాబా రతన్ జీ ఇవ్వదలచిన 5 రూపాయలు దక్షిణ యిమ్మని యడిగెను. అందులో 3రూపాయల 14పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండెను, గాని మిగిలిన 1రూపాయి 2పైసలు మాత్రమే యిమ్మనెను. ఇది విని రతన్ జీ గ్రహించుకొనలేక పోయెను. కాని బాబా పాదములవద్ద కూర్చుండి మిగత దక్షిణ యిచ్చెను. తాను వచ్చిన పని యంతయు బాబాకు బోధపరచి తనకు పుత్రసంతానము కలుగజేయుమని బాబాను వేడెను. బాబా మనస్సు కరిగెను. “చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చు” నని చెప్పెను.
బాబావద్ద సెలవు పుచ్చుకొని రతన్ జీ నాందేడు వచ్చెను. దాసుగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు సవ్యముగా జరిగెననియు, బాబా దర్శనము, వారి యాశీర్వాదము, ప్రసాదము లభించెననియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని యనియెను. బాబా అంతకముందే 3రూపాయల 14పైసలు ముట్టినవని యనెను. బాబా యాడిన మాటల కర్థమేమని దాసుగణు నడిగెను. నేనెప్పుడు షిరిడీకి వెళ్ళియుండలేదే! నావల్ల బాబాకు 3రూపాయల 14పైసలు ఎట్లు ముట్టెను? అది దాసుగణుకు కూడ సమస్యగా నుండెను. కాబట్టి దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాల మయిన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఎప్పుడో మౌలాసాహెబు వారికి 3రూపాయల 14పైసలు తో సత్కరించినటలు జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలాసాహెబు గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్ జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే యీ మౌలాసాహెబు రతన్ జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు 3రూపాయల 14పైసలు యగుట జూచి యందరు ఆశ్చర్యపడిరి. అందరికి బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో నున్నప్పటికి దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను. లేనిచో మౌలానా సాహెబు కిచ్చిన 3రూపాయల 14పైసలు సంగతి బాబా కెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటే యని గ్రహించిరి.
రతన్ జీ యా సమాధానమునకు సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. ఆ దంపతుల యానందమునకు మితిలేకుండెను. కొన్నాళ్ళకు వారికి 12గుదురు సంతానము కల్గిరి. కాని నలుగురు మాత్రము బ్రతికిరి.
ఈ యధ్యాయము చివరన హరివినాయక సాఠె యను వాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకొనినచో పుత్రసంతానము కలుగునని బాబా యాశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చినపిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు గలిగిరి. కావున నిరుత్సాహము చెందెనుగాని బాబా మాటలెన్నటికి అసత్యములు గానేరవు. మూడవసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది. అంత నతడు మిక్కిలి సంతుష్టి చెందెను.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- షిరిడీలో బాబాకి మేము పంపిన దక్షిణ ముట్టిన వెంటనే, గురువు గారు(రామ్ రతన్ జీ బాబా గారు) వచ్చి మా ఇంటిలో జ్యోతి వెలిగించుట.
- కష్టాలలో ఉన్న మాకు రతన్ బాబా గారి ద్వారా అభయం ఇప్పించిన బాబా వారు.
- నాసిక్ నివాసియగు ములేశాస్త్రి
- ఓం అర్హం నమః… మహనీయులు – 2020 – జనవరి 21
- బాబా సలహాను పాటించాలి – కావ్ జీ పటేల్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments