సోమదేవస్వామి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు భాయాజీ నాగపూరులో నివసించుచుండెను. 1906వ  సంవత్సరములో హిమాలయములకు బోయినపుడు సోమదేవ స్వామి యను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయాజీ యింట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టికోరిక గలిగెను. భాయాజీ వద్దనుంచి పరిచయము ఉత్తరమును దీసికొని షిరిడీకి పోయెను. మన్మాడు, కోపరగాం దాటిన పిమ్మట టాంగా వెసికొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోను, వేర్వేరు జీవనపద్ధతులతోను, వేర్వేరు బాహ్యాలంకారములతోను ఉందురు. కాని యీ పై పై గుర్తులనుబట్టి యే యోగియొక్క గొప్పదనమును గనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా దోచెను. రెండు పతాకము లెగురుట చూడగనే తానిట్లనుకొనెను. “ఈ యోగి జండాలయందేల మక్కువ జూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తికొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది” అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని, షిరిడీకి పొవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న యితర యాత్రికులకు జెప్పెను. వారతనితో నిట్లనిరి. “అట్లయిన ఇంత దూరము వచ్చితి వేల?” జండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో, షిరిడీలో రథము, పల్లకి, గుఱ్ఱము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు?” సోమదేవస్వామి గాభరపడి యిట్లనెను. “గుఱ్ఱములతోను, పల్లకీలతోను, జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట జూచి యుండలేదు. అట్టి సాధువులను చూచుటకంటె తిరిగిపోవుటయే మేలు” అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్థమయ్యెను. తక్కిన తోడి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీ లోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా యా జండాలను కాని తక్కిన వస్తువులనుగాని ఆడంబరములనుగాని కీర్తినిగాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి. అవన్నియు నలంకరించినవారు బాబా భక్తులేగాని ఆయనకేమి యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమలకొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు జేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువనుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరగెను. అతని కండ్లు నీటితో నిండెను; గొంతుక యార్చుకొనిపోయెను. “ఎచ్చట మనస్సు శాంతించి యానందమును పొంది యాకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము” అని తన గురువు చెప్పినదానిని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనముకొరకు దగ్గరకు పోగా “మా వేషము మా దగ్గరనే యుండనీ, నీ యింటికి నీవు పొమ్ము. తిరిగి మసీదుకు రావద్దు. ఎవరయితే మసీదుపై జండా నెగురవైచుచున్నారో యట్టివారి దర్శనము చేయనేల? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమయిన ఉండవద్దు” అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నాడని తెలిసికొనెను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివితక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని యాశీర్వదించుట, కొందరిని యోదార్చుట, కొందరివైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరివైపు చూచి నవ్వుట, ఊదీప్రసాదమును కొందరి కిచ్చుట, యిట్లు అందరిని ఆనందింపజేసి, సంతృప్తి పరచుట జూచి తన నొక్కరినే యేల యంత కఠినముగా జూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీక్షణముగా నాలోచించి బాబా చేయునదంతయు తన యంతరంగముననున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్థిపొందుటకు యత్నింపవలెనని గ్రహించెను. బాబా కోపము మారురూపముతో నున్న యాశీర్వాదమే యనుకొనెను. కొన్నాళ్ళ పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను.

సంపాదకీయం:  శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles